Operation Gajendra: గజరాజు ప్రాణం తీసిన కరెంటు తీగలు..
ఒడిశా నుంచి వచ్చి పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరిస్తున్న ఎనులుగు చనిపోయాయి. భామిని మండలంలో ఈ ఘటన జరిగింది. పొలంలో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్ తగిలి ఏనుగులు చనిపోయాయి.
ఏనుగులు చనిపోయిన విషయం తెలియగానే స్థానికులు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఏనుగుల తలపై పసుపు కుంకుమ వేసి ప్రార్థనలు చేశారు. 14 సంవత్సరాల క్రితం ఓడిశాలోని అడవిలోంచి దాదాపు 11 ఏనుగులు పార్వతీపురం మైదాన ప్రాంతానికి వచ్చాయి. అయితే వీటిలో రెండు ఏనుగులను అప్పట్లో గిరిజనులు చంపేశారని పోలీసులు చెప్తున్నారు. ఒక ఏనుగు కరెంట్ షాక్ తో చనిపోయింది. కొన్ని రోజుల క్రితం పొలాల్లో బీభత్సం సృష్టించిన ఏనుగును తిరిగి ఓడిశాలోని అడవుల్లో వదిలేసేందుకు అధికారులు ఆపరేషన్ గజేంద్ర చెప్పట్టారు.
దీంట్లో భాగంగా ఆ ఏనుగుకు మత్తు మందు ఇచ్చారు. ఆ మత్తు మందు వికటించడంతో ఏనుగు చనిపోయింది. దీనితో ఒడిశా నుంచి వచ్చిన ఏనుగుల్లో కేవలం 7 ఏనుగులు మాతరమే మిగిలాయి. ఈ ఏనుగులు అప్పటి నుంచి మైదాన ప్రాంతాల్లోనే సంచరిస్తున్నాయి. అప్పుడప్పుడూ గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం ఏనుగుల దాడిలో ఓ ట్రాకర్ చనిపోయాడు. గత 14 సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు ఈ ఏనుగులను తిరిగి ఒడిశా అడవికి పంపించడానికి శత విధాలుగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆపరేషన్ సక్సెస్ కాలేదు. ఏనుగుల్ని ట్రాక్ మళ్లించడానికి నిత్యం13 మంది ట్రాకర్లు పనిచేసేవారు. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ట్రాన్స్ ఫార్మర్స్ తాకి ఏనుగులు చనిపోయాయి.