Parliament attack: పరిచయం లేని నలుగురు.. పక్కా ప్లాన్‌తో దాడి..
నిందితులు ఎందుకోసం ఈ దాడి చేశారన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ ఘటనకు సంబంధించి తవ్వేకొద్దీ సంచలన నిజాలు బయటకు వస్తున్నాయ్. సాగర్ శర్మ, మనోరంజన్, నీలంకౌర్, అమోల్ షిండే అనే నలుగురు.. పార్లమెంట్ దాడి ఘటన వెనక ఉన్నారు.
Parliament attack: లోక్‌సభపై దాడి ఘటనతో.. దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురిని పోలీసులు గుర్తించారు. మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి నిందితులకు తగిన శిక్ష విధించేలా చేస్తామని స్పీకర్ ఓం బిర్లా సభకు హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే నిందితులు ఎందుకోసం ఈ దాడి చేశారన్నది ఇంకా క్లారిటీ లేదు.
Parliament attack: పార్లమెంటుపై దాడి.. నలుగురు అరెస్టు.. నిందితుల గుర్తింపు
ఈ ఘటనకు సంబంధించి తవ్వేకొద్దీ సంచలన నిజాలు బయటకు వస్తున్నాయ్. సాగర్ శర్మ, మనోరంజన్, నీలంకౌర్, అమోల్ షిండే అనే నలుగురు.. పార్లమెంట్ దాడి ఘటన వెనక ఉన్నారు. నిజానికి ఈ నలుగురిలో.. ఎవరికి ఎవరితో పరిచయం ఇంతవరకు ప్రత్యక్షపరిచయం లేనట్లు తెలుస్తోంది. ఈ నలుగురు స్నేహితులు కాకపోయినా.. పక్కా ప్లాన్ చేసి మరీ.. పార్లమెంట్ మీద దాడి చేశారు. నలుగురిలో సాగర్ శర్మ, మనోరంజన్‌ది కర్ణాటకలోని మైసూరు కాగా.. నీలంకౌర్ హిస్సార్‌ది హర్యానా.. అమోల్ షిండేది మహారాష్ట్ర. ఈ నలుగురు కూడా సోషల్ మీడియా వేదికగా పరిచయం అయ్యారు. చాటింగ్‌లోనే పరిచయం పెంచుకున్నారు. ఆన్‌లైన్‌లోనే ఈ ఘటనకు సంబంధించి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌లోకి ఎంటర్ అయి హంగామా సృష్టించాలని ఈ నలుగురు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇలాంటి దాడి జరగొచ్చని నిఘావర్గాలకు ముందే సమాచారం ఉందని కూడా తెలుస్తోంది.
ఐనా సరే.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. దేశం ఉలిక్కిపడేలా చేసింది. సరిగ్గా 22 ఏళ్ల కింద ఇదే రోజు.. పార్లమెంట్ మీద దాడి జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పరిణామమే చోటుచేసుకోవడం.. రాజకీయంగా మంటలు రేపుతోంది. పూర్తి విచారణ జరిగిన తర్వాతే ఈ ఘటనకు గల అసలు కారణాలు తెలుస్తాయి.