Priyanka Gandhi Vadra: ప్రియాంకా గాంధీకి ఈడీ షాక్.. మనీ లాండరింగ్ కేసు చార్జిషీటులో పేరు

మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించింది. ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరును కూడా ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2023 | 04:22 PMLast Updated on: Dec 28, 2023 | 4:22 PM

Priyanka Gandhi Mentioned In Ed Charge Sheet In Pmla Case

Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించింది. ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరును కూడా ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అయితే, చార్జిషీటులో వీరి పేర్లను నిందితులుగా పేర్కోలేదు. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీపీ థంపి, బ్రిటన్‌కు చెందిన సుమిత్ చద్దాపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరు చేర్చింది ఈడీ.

VICTORY VENKATESH: చిరు లేకపోతే సినిమాలు మానేసేవాడిని: విక్టరీ వెంకటేశ్

అయితే ఇద్దర్నీ నిందితుల జాబితాలో మాత్రం చేర్చలేదు. హర్యాణాలో భూములు, ఆస్తులు కొనుగోలుకు సంబంధించి దాఖలైన మనీ లాండరింగ్ కేసు ఇది. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006 లో హర్యాణా ఫరీదాబాద్‌లోని అమీపూర్ గ్రామంలో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన హెచ్ఎల్ పహ్వా వద్ద 40 ఎకరాల భూమిని, అమీపూర్‌లో హెచ్ఎల్ పహ్వా ద్వారా ఒక ఇంటిని కొన్నారు. 2010 లో అదే భూమి, ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మారు. అయితే ఈ భూములు, ఇల్లు కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. విదేశాలకు చెందిన సీసీ థంపి, సుమిత్ చద్దా ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త వాద్రా.. భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్ పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది.

మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ భండారీ 2016 లోనే బ్రిటన్‌కు పారిపోయారు. అయితే సంజయ్ భండారీని వెనక్కి తీసుకొచ్చేందుకు ఈడీ, సీబీఐ చేసిన వినతికి బ్రిటన్‌ సర్కారు గత జనవరిలో ఆమోదం తెలిపింది. వీరిని ఈడీ అరెస్టు చేసింది. నిందితులు సీసీ థంపీ, రాబర్ట్ వాద్రాల మధ్య డబ్బు లావాదేవీలే కాకుండా లండన్‌లో ఉన్న ఫ్లాట్‌ను సీసీ థంపి.. రాబర్ట్ వాద్రా కోరిక మేరకు పునరుద్ధరించారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు సంజయ్ భండారీకి చెందిన రూ.26.55 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.