Pushpa 2: పుష్ప కేశవ అరెస్ట్‌.. ఇదేంది మచ్చా.. ఇట్టా చేసినవ్‌..

పుష్ప మూవీలో బన్నీకి ఎంత పేరు వచ్చిందో.. బన్ని పక్కన కేశవ అనే ఫ్రెండ్ కేరక్టర్ చేసిన జగదీష్‌ ప్రతాప్ బండారికి కూడా అంతే పేరు వచ్చింది. ఇప్పుడు ఆ కేశవ పాత్ర చేసిన జగదీష్ అరెస్ట్ కావడం మరో హాట్‌టాపిక్ అయింది. జగదీశ్‌పై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2023 | 06:15 PMLast Updated on: Dec 06, 2023 | 6:15 PM

Pushpa 2 Movie Artist Keshava Arrested By Panjagutta Police

Pushpa 2: పుష్ప సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. సౌత్‌, నార్త్‌లో బాక్సాఫీస్ దుమ్ము దులిపిందీ మూవీ. అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. పుష్ప మూవీలో బన్నీకి ఎంత పేరు వచ్చిందో.. బన్ని పక్కన కేశవ అనే ఫ్రెండ్ కేరక్టర్ చేసిన జగదీష్‌ ప్రతాప్ బండారికి కూడా అంతే పేరు వచ్చింది. పుష్ప 2లో అంచనాలకు మించి కేశవ కేరక్టర్ ఉంటుందని మూవీ టీమ్‌ లీక్‌లు ఇవ్వగా.. ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది.

BIGG BOSS 7: బిగ్ ట్విస్ట్.. అమర్ ముక్కు పగలకొట్టిన ప్రియాంక..

ఐతే ఇన్నాళ్లు కేశవ పాత్ర గురించి చర్చ జరుగుతుంటే.. ఇప్పుడు ఆ కేశవ పాత్ర చేసిన జగదీష్ అరెస్ట్ కావడం మరో హాట్‌టాపిక్ అయింది. జగదీశ్‌పై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ జూనియర్‌ అర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన జగదీశ్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. జగదీశ్‌ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ.. నవంబర్ 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. ఆ మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్‌ ఫొటోలు తీశాడు.

ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీశ్‌ను.. ఎట్టకేలకు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్‌కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. కేశవ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.