SANGHAVI INCIDENT: సంఘవి పరిస్థితి విషమం.. ఏఐజీ డాక్టర్ల కీలక ప్రకటన..
సంఘవి పరిస్థితి గురించి ఏఐజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి ఈ వీడియో రిలీజ్ చేశారు. కత్తి గాయం బలంగా తగలడంతో సంఘవి గర్భాశయానికి దగ్గర్లో వెన్నెముకకు తీవ్ర గాయమైందని చెప్తున్నారు డాక్టర్లు.

SANGHAVI INCIDENT: ఎల్బీనగర్ ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ సంఘవి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం సంఘవి గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. శివకుమార్ దాడిలో సంఘవి వెన్నెముక, ముఖంతో పాటు ఇరత ప్రాంతాల్లో తీవ్ర గాయాలయ్యాయని డాక్టర్లు చెప్తున్నారు.
సంఘవి పరిస్థితి గురించి ఏఐజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి ఈ వీడియో రిలీజ్ చేశారు. కత్తి గాయం బలంగా తగలడంతో సంఘవి గర్భాశయానికి దగ్గర్లో వెన్నెముకకు తీవ్ర గాయమైందని చెప్తున్నారు డాక్టర్లు. ఈ దాడి కారణంగా సంఘవి శాశ్వతంగా మంచానికి పరితమయ్యే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. న్యూరో సర్జన్ల బృదం సంఘవి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి ఆపరేషన్లు చేయాలని నిర్ధారించారు. సంఘవి ముఖంతో పాటు వెన్నెముకకు మూడు ఆపరేషన్లు చేయనున్నారు డాక్టర్లు.
సంఘవి చికత్సకు అయ్యే పూర్తి ఖర్చు ఏఐజీ హాస్పిటల్ భరిస్తుందని చెప్పారు నాగేశ్వర్ రెడ్డి. ఈ దాడితో సంఘవి మానసిక పరిస్థితి కూడా దెబ్బతిందని చెప్పారు. ఈ గండం నుంచి యువతి కోలుకున్న తరువాత కూడా ఆమెకు అండగా ఉంటామంటూ చెప్పారు.