ట్రాన్స్ జెండర్ దీపు హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు
అనకాపల్లిలో రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా కాలంగా దీపుతో ఉంటున్న దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

అనకాపల్లిలో రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా కాలంగా దీపుతో ఉంటున్న దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు దీపును హత్య చేసిన తర్వాత బెడ్ షీట్‌లో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు. మహిళను హత్య చేసి, శరీర భాగాలు వేరు చేసి పడేశారు. మిగిలిన డెడ్ బాడీలోని అవయవభాగాలను అనకాపల్లి డైట్ కాలేజీ సమీపంలో పోలీసులు గుర్తించారు.
ఈ మిస్టరీ కేసును పోలీసులు 8 బృందాలుగా వెళ్లి దర్యాప్తు చేపట్టారు. హత్య ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. హత్యకు గురైన దీపు నాలుగేళ్లుగా బన్నీ అనే వ్యక్తితో గుట్టుగా మునగపాక మండలం నాగులాపల్లి లో నివాసం ఉంటూ సహజీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. దీపు సహజీవనం చేస్తున్నట్టు తోటి హిజ్రాలకు కూడా తెలియకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది. కాగా బన్నీనే హిజ్రాను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన తగాదాలు హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
దీపు చాలాకాలంగా హిజ్రా కమ్యూనిటీకి దూరంగా ఉంటుందని తోటి హిజ్రాలు తెలిపారు. హత్యకేసుపై ట్రాన్స్‌జెండర్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీపునీ చంపిన బన్నీని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలనుంచి ట్రాన్స్ జెండర్లు అనకాపల్లికి తరలి వచ్చారు. దిలీప్ హత్య కేసు నిందితుడు బండి దుర్గాప్రసాద్‌ను కఠినంగా శిక్షించాలంటూ అనకాపల్లి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడినుంచి అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. హిజ్రా హత్యలో నిందితుడు బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.