బ్రేకింగ్: అప్సరను చంపిన పూజారి ,కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2025 | 05:14 PMLast Updated on: Mar 26, 2025 | 6:03 PM

Sensational Verdict By Rangareddy Court In The Case Of Priest Who Killed Apsara

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధించారు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్‌లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. నాలుగేళ్ల పాటు అప్సరతో ప్రేమ కార్యకలాపాలు జరిపాడు. పెళ్లి చేసుకోమని వెంటపడడంతో అప్సరను కిరాతకంగా చంపి పూడ్చి పెట్టాడు. ఈ ఘటనలో తాజాగా పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడు సంవత్సరాలు అదనపు జైలు శిక్ష విధించింది.

10 లక్షలు అప్సర కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షులను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. అందులో 28 మంది సాక్షులను పరిగణలోనికి తీసుకుంది కోర్టు. వెంకట సాయి కృష్ణ అప్సరను హత్య చేశాడు అనడానికి అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు మిగతా ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. వెంకట సాయి కృష్ణ వినిపించిన వాదనలను కోర్టు పరిగణలోనికి తీసుకోలేదు. దేవాలయం పూజ కోసం వచ్చిన ఆప్సరను ఏ విధంగా ట్రాప్ చేశాడు ? ఏ విధంగా ఆమెను కాశీకి తీసుకొని వెళ్తానని చెప్పి హత్య చేశాడు ? పూర్తి ఆధారాలను కోర్టు ముందు ఉంచారు పీపీ. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సాయికృష్ణకు జీవితఖైదు సరైన శిక్ష అని తీర్పునిచ్చింది.