Aishwarya Addala: అతనితో సంబంధం.. మొగుడికి చుక్కలు.. బయటపడ్డ సీరియల్ నటి బాగోతం..
పెళ్లైన తర్వాత నుంచి రూ.25 లక్షలు కాజేసి.. ఆ తర్వాత కొత్త నాటకాలు మొదలుపెట్టి.. విడాకులు కోరుతూ.. తనను, తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తోందని శ్యామ్ కుమార్ కన్నీటి పర్యంతం అవుతున్నాడు.
Aishwarya Addala: ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య.. తనను పెళ్లి పేరుతో మోసం చేసిందంటున్నాడు ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్. తన డబ్బులన్నీ కాజేసి.. ఇప్పుడు విడాకులని నాటకాలు ఆడుతూ.. తన కుటుంబాన్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు శ్యామ్ కుమార్. పెళ్లైన తర్వాత నుంచి రూ.25 లక్షలు కాజేసి.. ఆ తర్వాత కొత్త నాటకాలు మొదలుపెట్టి.. విడాకులు కోరుతూ.. తనను, తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తోందని శ్యామ్ కుమార్ కన్నీటి పర్యంతం అవుతున్నాడు.
Vishwambhara: విజువల్ ట్రీట్.. విశ్వంభరలో త్రిష మరో శ్రీదేవిలా కనిపించనుందా..?
2023 సెప్టెంబర్ 6న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు శ్యామ్ కుమార్. కాపు మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం అయిన వీళ్లిద్దరు.. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఏడడుగులు నడిచారు. ఓ ఆరు నెలలు అంతా బాగానే ఉంది. ఆ తర్వాతే మొదలైంది అసలు టార్చర్. శ్యామ్, ఐశ్వర్య మధ్య గొడవలు మొదలయ్యాయ్. ఐతే ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడిందని శ్యామ్‌కుమార్ ఆరోపిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన కరణం రమేష్ బాబు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఐశ్వర్యకు వివాహేతర సంబంధం ఉందని.. అతని అండ చూసుకొని.. తన మీద బెదిరింపులకు దిగుతోందని శ్యామ్ కుమార్ ఆరోపణ. 25లక్షలు దోచుకోవడమే కాకుండా.. ఇదేంటని ప్రశ్నించినందుకు తనపైనే అన్యాయంగా కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందని శ్యామ్ కుమార్ వాపోతున్నాడు. అతని ఆవేదన.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీరియళ్లలో సంప్రదాయమైన పాత్రలు పోషించే ఐశ్వర్య.. అసలు కేరక్టర్ ఇదా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. జీ తెలుగుతో పాటు మాటీవీ, ఈటీవీ, జెమినీ టీవీల్లో టెలికాస్ట్ అయ్యే టీవీ సీరియళ్లలో ఐశ్వర్య యాక్ట్ చేస్తోంది.
అమ్మాయిగారు, పలుకే బంగారమాయెనా, అల వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియల్స్‌లో ఐశ్వర్య పాత్రకు మంచి పేరు వచ్చింది. సూపర్ హిట్ గ్యారెంటీ, నీ రూటే సెపరేటు, త్రిముఖిలాంటి సినిమాల్లోనూ ఐశ్వర్య హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. శ్యామ్ కుమార్ ఆరోపణలపై ఐశ్వర్య ఇంకా రియాక్ట్ కాలేదు. ఐతే అది వివాహేతర సంబంధమా.. అంతకుముందే రియల్టర్‌ని పెళ్లి చేసుకుందా.. పెళ్లి అయిన తర్వాత ఐశ్వర్య నాటకాలు ఆడుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఐశ్వర్య వ్యవహారం మాత్రం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్ అవుతోంది.