Shanmukh Jaswanth: అమ్మాయిని బెదిరించి అన్న.. గంజాయి తాగుతూ తమ్ముడు.. ఇలా దొరికేశారు..!

ఒక కేసులో సంపత్‌ను అదుపులోకి తీసుకునేందుకు వాళ్ల ఇంటికి వెళ్లారు పోలీసులు. ఐతే పోలీసులు వెళ్లేసరికి.. తమ్ముడు షణ్ముఖ్‌తో కలిసి సంపత్‌ గంజాయి కొడుతూ కనిపించాడు. దీంతో రెండు కేసులు బుక్‌ చేసి.. వాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2024 | 03:10 PMLast Updated on: Feb 22, 2024 | 3:10 PM

Shanmukh Jaswanth And His Brother Sampath Vinay Detained By Police Over Marijuana Possession

Shanmukh Jaswanth: యూట్యూబ్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ గంజాయి తాగుతూ అడ్డంగా బుక్ అయ్యాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ వ్యవహారంలో.. సినిమా రేంజ్ ట్విస్టులు కనిపించాయ్. అన్న సంపత్ వినయ్‌ మీద కేసు ఫైల్ అయిందని.. అతడి ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులకు.. షణ్ముఖ్ గంజాయి తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఓవరాల్ ఎపిసోడ్‌ చూసి.. సినిమా రేంజ్‌ ట్విస్ట్ భయ్యా అనుకుంటున్నారు నెటిజన్లు.

Upasana Kamineni: ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నా..!

షణ్ముఖ్‌ అన్న సంపత్‌ వినయ్‌ మీద మౌనిక అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు యూట్యూబ్‌లో చాన్స్ ఇప్పిస్తానని నమ్మించి.. సంపత్‌ తనను శారీరకంగా వాడుకున్నాడంటూ కంప్లైంట్‌లో తెలిపింది మౌనిక. ఓ రిసార్ట్‌లో రూమ్‌ బుక్‌ చేసి.. తనపై లైంగిక దాడి కూడా చేశాడని చెప్పింది. అంతా అయ్యాక పెళ్లి చేసుకోమని ఫోర్స్‌ చేస్తే రింగ్‌ తొడిగి పెళ్లి పెళ్లి అయిపోయిందని బిల్డప్‌ ఇచ్చాడంటూ మౌనిక ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఐతే ఇప్పుడు మరో అమ్మాయితో సంపత్‌ వేరే పెళ్లికి సిద్ధం అయ్యాడని తెలుసుకున్న మౌనిక.. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులోనే సంపత్‌ను అదుపులోకి తీసుకునేందుకు వాళ్ల ఇంటికి వెళ్లారు పోలీసులు. ఐతే పోలీసులు వెళ్లేసరికి.. తమ్ముడు షణ్ముఖ్‌తో కలిసి సంపత్‌ గంజాయి కొడుతూ కనిపించాడు. దీంతో రెండు కేసులు బుక్‌ చేసి.. వాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిజానికి ఇది గంజాయి కేసే అనుకున్నారు అంతా !

ఐతే ఆ తర్వాత మౌనిక కంప్లైంట్ వ్యవహారం బయటకు రావడం.. దానికోసమే పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్‌కు వెళ్లారని తెలియడంతో.. అన్నాదమ్ములను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. తమ్ముడు ఏక్‌ నంబరీ.. అన్న దస్ నంబరీ.. అమ్మాయిని బెదిరించి అన్న.. గంజాయి తాగుతూ తమ్ముడు.. సరిపోయారు ఇద్దరికి ఇద్దరు అంటూ ఫైర్ అవుతున్నారు. మౌనిక, షణ్ముఖ్‌, సంపత్‌.. ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. మౌనికకు కూడా సినిమాలు అంటే ఇంట్రెస్ట్‌. దీంతో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. తనకు చాన్స్ ఇప్పిస్తానని సంపత్ ఆమెను మోసం చేసినట్లు తెలుస్తోంది.