Diwali : దీపావళి రోజు బాంబాలు కాల్చిన వాళ్లకు షాక్.. 554 మందిపై కేసు..
దీపావళి అంటేనే టపాసుల పండగ. కుటుంబం మొత్తం కలిసి హ్యాపీగా బాంబులు పేల్చుకుంటూ ఎంజాయ్ చేస్తారు. టైం కూడా చూసుకోకుండా సంతోషంగా గడిపేస్తుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా టపాసులు పేలుస్తారు.

Shock for those who fired bombs on Diwali day Case against 554 people
దీపావళి అంటేనే టపాసుల పండగ. కుటుంబం మొత్తం కలిసి హ్యాపీగా బాంబులు పేల్చుకుంటూ ఎంజాయ్ చేస్తారు. టైం కూడా చూసుకోకుండా సంతోషంగా గడిపేస్తుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా టపాసులు పేలుస్తున్నారు. కానీ అలా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నవాళ్లకు చెన్నై పోలీసులు షాకిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన సమయం కాకుండా మిగతా సమయాల్లో టపాసులు పేల్చిన వాళ్లపై కేసులు నమోదు చేసింది.ఈ క్రమంలో మొత్తం 554 మందిపై కేసులు నమోదైనట్లు చెన్నై పోలీసులు చెబుతున్నారు. పర్యావరణాన్ని కాపాడటాన్ని దృష్టిలో పెట్టుకుని టపాసులు పేల్చడంపై సుప్రీం కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 6 నుంచి 7 గంటల వరకూ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ టపాసులు పేల్చుకోవచ్చు అంటూ అనుమతిచ్చింది.
China Flight Tickets : రూ. 114కే విమానం టికెట్.! భలే మంచి చౌక బేరం !
ఈ సమయాల్లో మాత్రమే టపాసులు పేల్చాలంటూ పోలీసులు కూడా నగరవ్యాప్తంగా ఆదేశాలు జారీ చేశారు. కానీ పండగ పూట ఇలాంటి ఆదేశాలు ఎవరైనా పట్టించుకుంటారా!.. చెన్నై ప్రజలు కూడా అదే చేశారు. పోలీసులు చెప్పిన సమయం కాకుండా తమకు వీలైన సమయంలో కుటుంబంతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబంతో కలిసి జాలీగా గడిపారు. అయితే పోలీసులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా బాంబులు పేల్చిన వాల్ల వివరాలు సేకరించారు. హోంగార్డ్స్ రాత్రంతా ఇదే పనిలో ఉన్నారు. టపాసులు పేల్చిన వాళ్లపై ఉదయాన్ని కేసు నమోదు చేశారు. ఇలా మొత్తం 554 మందిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. వాళ్లందరికీ ఇప్పుడు జరిమానా విధించబోతున్నారు. పండగ చేసుకుంటే పెనాల్టీ కట్టాలా అంటూ షాకవుతున్నారు కేసులు మీద పడ్డ చెన్నై ప్రజలు.