ONLINE BETTING: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు గన్‌మ్యాన్ కుటుంబం బలి..
ప్రేమగా చూసుకునే భార్య.. ప్రాణంగా ప్రేమించిన పిల్లలు.. కలెక్టరేట్‌లో మంచి ఉద్యోగం.. అంతా బాగానే ఉందనుకున్నా.. ఆన్‌లైన్ బెట్టింగ్ అనే వ్యసనం ఆ కుటుంబం మొత్తాన్ని కబళించింది. తిరిగిరాని లోకాలకు పంపించింది.
ONLINE BETTING: రోజూ ఉదయాన్నే కోడి కూతతో నిద్ర లేచే ఆ ఏరియా.. ఆరోజు మాత్రం ఆర్తనాదాలతో మేల్కొంది. కళ్ల ముందే ఆటలాడుతూ కనిపించే చిన్నారులు.. శవాలుగా ఇంట్లో పడి ఉన్నారు. అన్నా అంటూ అందరినీ పలకరించే ఆ వ్యక్తి.. రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించాడు. అంతే.. ఆ ఏరియా మొత్తం ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన కుటుంబపు బంధువుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి.
MLC Shaik Sabjee: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి.. షాక్‌లో సీఎం..
ప్రేమగా చూసుకునే భార్య.. ప్రాణంగా ప్రేమించిన పిల్లలు.. కలెక్టరేట్‌లో మంచి ఉద్యోగం.. అంతా బాగానే ఉందనుకున్నా.. ఆన్‌లైన్ బెట్టింగ్ అనే వ్యసనం ఆ కుటుంబం మొత్తాన్ని కబళించింది. తిరిగిరాని లోకాలకు పంపించింది. బెట్టింగ్‌లు వేసి అప్పులపాలైన ఓ గన్‌మెన్.. ఆ అప్పులు కట్టలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్ధిపేట్ జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన నరేష్ కలెక్టర్‌కు గన్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి నరేష్ ఆన్‌లైన్లో బెట్టింగ్స్ ఆడుతున్నాడు. మొదట్లో సరదాగా ఉన్న ఈ బెట్టింగ్ వ్యవహారం రాను రాను వ్యసనంగా మారింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులను మించి నరేష్ బెట్టింగ్‌లు ఆడటం మొదలు పెట్టాడు. ఈ వ్యహారం ఎంతదూరం వెళ్లింది అంటే.. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఏకంగా 80 లక్షలు అప్పు చేశాడు నరేష్. కొన్ని రోజులకు వాళ్ల నుంచి అప్పు కట్టాలంటూ వేధింపులు మొదలయ్యాయి. అప్పులు కట్టేందుకు మార్గం కనిపించకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.
తాను ఒక్కడే చనిపోతే కుటుంబం పరిస్థితి ఏంటి అనుకున్నాడో ఏమో.. మొత్తం కుటుంబాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాడు. స్కూల్‌కు వెళ్లి పిల్లలను కూడా తీసుకువచ్చాడు. వచ్చీరాగానే తన దగ్గరున్న 9ఎంఎం పిస్టల్‌తో పిల్లల్ని షూట్ చేశాడు. తరువాత భార్యను కూడా చంపేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు నరేష్ డ్యూటీకి రాకపోవడంతో కలెక్టరేట్‌లో పని చేసే వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఇంట్లో శవాలుగా పడి ఉన్న నరేష్ కుటుంబ సభ్యులను చూసి పోలీసులకు ఫోన్ చేశాడు. మొదట కుటుంబ కలహాల కారణంగానే నరేష్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని అంతా అనుకున్నారు. కానీ ప్రైమరీ ఇన్వెస్టిగేసన్ నిర్వహించిన తరువాత బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. ఏదేమైనా.. బెట్టింగ్ అనే ఓ వ్యసనం ఓ నిండు కుటుంబాన్ని భూమ్మీద లేకుండా చేసింది.