Un marital Relation: తలుపు చాటు టీచర్ కథ తెల్లారిపోయింది..!

వివాహం ఒక పవిత్ర బంధం. ఒకరికి ఒకరు ఆజన్మాంతం కలిసి మెలిసి క‎ష్టసుఖాల్లో భాగస్వామ్యం అవ్వడం కోసం లైఫ్ పార్ట్ నర్ గా భార్యా భర్తలు ఒకరిని ఒకరు ఎంచుకుంటారు. మరి వివాహేతర సంబంధం అంటే ఇక్కడ కూడా ఒకరిని ఒకరు ఎన్నుకుంటారు కాకపోతే ఒకరితో ఉంటూ మరొకరిని ఎంచుకుంటారు. ఇది ఒకరకమైన నేరమే. ఇలాంటి నేరాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కొంత ఆసక్తి కలిగించేలా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 23, 2023 | 12:59 PMLast Updated on: Feb 23, 2023 | 1:11 PM

Teacher Un Marrital Relation

వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయో చెప్పే సంఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఆమె ప్రభుత్వ టీచర్. మంగపేట మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరిత్యా ఆమె మంగపేటలోనే కూతురితో కలిసి ఉంటుంది. భర్త జిల్లా కేంద్రంలోనే ఉంటూ వచ్చి పోతుంటాడు.

ఇలా సాగుతున్న వీరి వైవాహిక జీవితంలోకి మరొకడు ప్రవేశించాడు. అతని పేరు నాగేందర్. అప్పటికే నాగేందర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఇద్దరు భార్యలను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడు. ఇతను కూడా కానిస్టేబుల్ భార్య పనిచేస్తున్న పాఠశాలలో విధులు నిర్వహించేవాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఒకరికొకరు దగ్గరయ్యారు. సెలవు దినాల్లో ఇంటికి వచ్చిన భర్తను పట్టించుకోనంతగా కానిస్టేబుల్ భార్య మారిపోయింది. అనుమానం వచ్చిన భర్త తన కూతురిని అడిగాడు. కూతురు చెప్పిన వివరాల ప్రకారం నాగేందర్ ను గట్టిగా హెచ్చరించాడు. పాఠశాలకు వెళ్లి హెడ్ మాస్టర్ కి ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిని వేరే పాఠశాలకు డిప్యూటేషన్ మీద బదిలీ చేశారు పాఠశాల అధికారులు.

ఇక్కడితో ఆగలేదు వీరి బంధం. వేరే ప్రాంతానికి వెళ్లినప్పటికీ కానిస్టేబుల్ భార్యతో పరిచయం మాత్రం కొనసాగిస్తూ తరచూ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. గత వారం విధుల్లో భాగంగా శివరాత్రి పర్వదినం రోజున కానిస్టేబుల్ బందోబస్తుకై వేములవాడ వెళ్లాడు. సోమవారం సెలవు కావడంతో మంగపేటలో ఉంటున్న భార్య, కూతురిని చూసేందుకు ఇంటికి వచ్చాడు. ఇప్పుడే అసలు విషయం బయట పడింది. అర్ధరాత్రి 2గంటల సమయంలో కానిస్టేబుల్ భార్యకు టీచర్ నాగేందర్ ఫోన్ చేశాడు. తలుపు తీసి ఉంచు వస్తున్నా అని చెప్పాడు. తన అనుమానం నిజమని భావించి తలుపు తీసి బాత్ రూంలో దాక్కున్నాడు ఉపాధ్యాయురాలి భర్త. నాగేందర్ ఇంట్లోకి వచ్చిన వెంటనే బాత్ రూం నుంచి బయటకు వచ్చిన భర్త ఇంత అర్ధరాత్రి సమయంలో ఎందుకు వచ్చావు అని అడిగాడు. సమాధానం చెప్పలేక పోగా కానిస్టేబుల్ భార్య.. నాగేందర్ ఇద్దరూ కలిసి అతనిపై దాడి చేయబోయారు. అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వచ్చి తలుపుకు తాళం వేసి చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచాడు. ఉదయాన్నే తాళం తీసి ఇద్దరి చేతులకు తాడుతో కట్టి పోలీసులకు అప్పగించారు.

un marital relation

un marital relation

సాఫీగా సాగే జీవన యాత్రలో అనుకోకుండా కొన్ని మలుపులు, ఎత్తుపల్లాలు ఎదురవుతూ ఉంటాయి. అది మరీ వికటిస్తే వివాహేతర సంబంధంగా మారుతుంది. మన చుట్టూ ఇలాంటివి నిత్యం చాలానే జరుగుతూ ఉన్నాయి. గతంలో సుప్రీం కోర్టు కూడా వీటిపై సంచలనమైన తీర్పును వెలువరించింది. మహిళకు ఇష్టం అయితే ఆమె ఎవరితోనైనా వివాహేతర సంబంధం కొనసాగించవచ్చని తెలిపిన నేపథ్యంలో మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిపై కోర్టు తన తీర్పును మార్పులు చేర్పుటు చేసి ప్రత్యేక చట్టం ఏమైనా తీసుకువస్తుందా.. ఇంలాంటి సంఘటనలపై ఏవిధమైన చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.

 

 

 

T.V.SRIKAR