Telangana: ఇచ్చట క్వశ్చన్ పేపర్లు అమ్మబడును..! ఇట్లు టీఎస్పీఎస్సీ..?

ఈ నగరానికి ఏమైంది. ఒకవైపు నిరుద్యోగం.. మరోవైపు ఉపాధి కరువు.. ఎందుకిలా అంటున్నామంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూసిన నిరుద్యోగుల కడుపు కొట్టేందుకు పోటీ పరీక్షల క్వశ్చన్ పేపర్ ను లీక్ చేస్తున్నారు. బంధుప్రీతి చూపించో లేకుంటే ఐదుకో పదికో కక్కుర్తిపడి యువకుల భవిష్యత్తుకు విఘాతం కలిగేలా చేస్తున్నారు. ఇలా ఉన్నత స్థాయి పరీక్షల ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడం వల్ల విద్యార్థుల, ఉద్యోగార్థుల కెరియర్ కి తీవ్ర నష్టం కలుగుతుంది. చదివి సాధించాలనే పట్టుదల ఉన్న వారికి ఇలాంటి లీకేజి వ్యవహారాలు నిరుత్సాహాన్ని కల్గిస్తాయి. దీనికి నిలువెత్తు నిదర్శనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అక్రమ వ్యవహారం సంబంధించి 13మంది పాత్ర ఉన్నట్లు వెలుగులోకి రావడం. ఒప్పంద ఉద్యోగి కుదుర్చుకున్న ఒప్పందం గురించి తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2023 | 01:11 PMLast Updated on: Mar 14, 2023 | 12:55 PM

Telangana Tspsc Group Question Papers Leak

ఒకప్పుడు కూడు, గూడు, గుడ్డ కనీస అవసరాలు మనకు అవసరం అయ్యేవి. కానీ ఇప్పుడు వీటన్నింటినీ సామాన్యుడే తన స్వశక్తితో పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మనం చేయవల్సిందల్లా సరైన ఉపాధి చూపించడమే. అలాంటి ఉపాధి సర్కార్ కొలువైతే ఇంకేముంది పంచభక్షాలతో పరమాన్నం వండినట్లే అవుతుంది. ఇప్పటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే పుట్టి పెరగాల్సిందే. అదేంటి సాధారణంగా పెట్టి పుట్టాలి అంటారు కదా అనే సందేహం మీలో కలుగవచ్చు. అతి సులువుగా దొరికేస్తే అలా అంటారు. కానీ ఇప్పటి పరిస్థితులు అలా లేవు. ఎందుకంటే ఉద్యోగం కోసం పుట్టాలి. పెరిగి పెద్దయినప్పటికీ వస్తుందన్న గ్యారెంటీ లేదు. దీనికి కారణం ఏ శివరాత్రికో.. సంక్రాంతికో ఒక్కసారి నోటిఫికేషన్ ఇస్తుంది ప్రభుత్వం. ఆ నోటిఫికేషన్లో కూడా అవకతవకలు, అవినీతి జరిగితే.. పరిస్థితి ఏంటి. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది.

టీఎస్పీఎస్సీ గ్రూప్ పరీక్షల ప్రశ్నాపత్రాన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కంపూటర్ ఆపరేటర్ పర్యవేక్షణలో ఉంటుంది. అక్కడ పనిచేసే ఉద్యోగి ఒకరు అందులోని ప్రశ్నల సాఫ్ట్ కాపీ డేటాని దొంగలించారు. ఇందులో టీఎస్పీఎస్సీ పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఏఎస్ఓ ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్ ఇద్దరి హస్తం ఉన్నట్లు మొదటగా తేలింది. గతంలో సిస్టమ్స్ అన్నీ అప్గ్రేడ్ చేసే క్రమంలో టీసీఎస్ అనే మల్టీనేషన్ సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన ఉద్యోగి ఈ సెక్షన్ కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తస్కరించినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇలా తస్కరించిన వివరాలను ప్రవీణ్ కు ఇచ్చినట్లు తెలిసింది.

ఇదంతా ఇలా ఉంటే ఓక మహిళా ఉద్యోగిని కోసం ఈచర్యకు పాల్పడినట్లు సమాచారం. ఆమె ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు కొనసాగిస్తుంది. ఆమె సోదరుడు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్నర్ ప్రశ్నాపత్రం కోసం ఈ సాహసోపేతమైన నేరానికి పాల్పడినట్లు తేలింది. మామూలుగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఎవరినీ అనుమతించరు. లోనికి వెళ్లాలంటే లోపల తెలిసినవారి అనుమతితో పాటూ పూర్తివివరాలు బయట సెక్యూరిటీ రిజి‎స్టర్ లో నమోదు చేయాలి. అలాంటిది ఈ మహిళ ఇలాంటివన్నీ బేకాతరు చేస్తూ అమాంతం కార్యదర్శి కార్యాలయంలోకి వచ్చి గంటలు గంటలు ప్రవీణ‌్ తో మాట్లాడేదని విచారణలో వెల్లడైంది.

Groups Exam Question Paper

Groups Exam Question Paper

ఇక్కడితో ఈ వ్యవహారం ఆగిఉంటే బాగుండేది. ఎంతటి క్రైం చేసేవాడైనా ఏదో ఒక తప్పుచేయక మానడు అన్నవిధంగా.. మహిళా సోదరుడు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా తమ గ్రామంలోని గ్రామ సర్పంచి కుమారునితో బేరసారాలాడాడు. గ్రామ సర్పంచ్ కాస్త మరో ముగ్గురు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విషయం తెలియజేయడంతో మొత్తం నలుగురి నుంచి రూ.14లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇందులో రూ.10లక్షలు ప్రవీణ్ కు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం ఆనోట ఈనోట పాకి చివరకు డైల్ 100ద్వారా పోలీసులకు చేరింది. దీనిపై చర్యలు తీసుకొని టీఎస్పీఎస్సీ అధికారులను విచారించగా క్వశ్చన్ పేపర్ లీకేజ్ గుట్టు బయటపడింది. ఇందులో మొత్తం 13మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇలా ఏదో ఒకవిధంగా అక్రమాలకు నిలయంగా మారిపోతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు. వీరి స్వార్థ ప్రయోజనాల కోసం అనేక మంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి తనువులు చాలించిన సంఘటనలు కొన్ని వందల్లో చూశాం. మరి కొందరికైతే వయోపరిమితి కూడా దాటిపోతుంది. సర్కార్ కొలువు సాధించాలనే కల కల్లగా మిగిలిపోతోంది. ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత కరువైందని చెప్పాలి. నేటి ఆధునిక తరంలోనూ ఇలాంటి చీకటి వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయంటే ముమ్మాటికీ అధికారల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యంగా పరిగణిలోకి తీసుకోవాలి. ఇలా చేసిన వారికి ఉద్యోగంలో నుంచి తక్షణమే తొలగించేలా సరికొత్త రూల్స్ ని తీసుకు రావాలి. అప్పుడే అధికారుల్లో భయం అనేది ఉంటుంది. అలాగే నియామకాల, దరఖాస్తుల, ప్రశ్నాపత్రాల తయారీ విధానంలో మరింత ఖచ్చితత్వం అవసరం అని దీనిపై ప్రభుత్వాలు నిరంతర పర్యవేక్షణతో కూడిన నిఘానేత్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుందాం.

 

T.V.SRIKAR