టిక్ టాక్ చేస్తుందని కూతురి ప్రాణం తీసిన తండ్రి
ఈ మధ్య కాలంలో షార్ట్ వీడియోల సంస్కృతి పెరిగిపోయింది. ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి షార్ట్ వీడియోలపై ఎక్కువగా డిపెండ్ కావడం, ఒకరకంగా వినోదం కూడా షార్ట్ వీడియోస్ లో ఎక్కువగా ఉండటంతో జనాలు వాటిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
ఈ మధ్య కాలంలో షార్ట్ వీడియోల సంస్కృతి పెరిగిపోయింది. ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి షార్ట్ వీడియోలపై ఎక్కువగా డిపెండ్ కావడం, ఒకరకంగా వినోదం కూడా షార్ట్ వీడియోస్ లో ఎక్కువగా ఉండటంతో జనాలు వాటిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అయితే ఇవి క్రమంగా ప్రాణం తీసే వరకు వెళ్తున్నాయి. టిక్‌టాక్ వీడియోలకు తన చెల్లెలు బానిస అయిందనే కారణంతో పాకిస్తాన్‌లోని జీలమ్‌లో 20 ఏళ్ల అమ్మాయి ప్రాణాలు తీసారు ఆమె సోదరులు. జీలంలోని ధోక్ కొరియన్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం అయింది.
అమ్మాయి వీడియోలపై స్థానికులు అసహనం వ్యక్తం చేయడంతో.. ఇది ఇంట్లో గొడవకు దారి తీసింది. ఈ ఘటనలో సోదరులు కాల్పులు జరపడంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. పరువు హత్య తరువాత, నిందితులు ఈ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఇక సాక్ష్యాలను చెరిపివేయడానికి కూడా ప్రయతిన్చారని స్థానిక మీడియా పేర్కొంది. తమ మతానికి ఇది విరుద్దమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.
పాకిస్తాన్ లోని క్వెట్టాలో పరువు హత్య జరిగినట్లు అక్కడి మీడియా కథనాలు రాసింది. టిక్‌టాక్ వీడియోల కారణంగా 15 ఏళ్ల బాలికను ఆమె తండ్రి, మేనమామ కాల్చిచంపారని స్థానిక మీడియా తెలిపింది. టిక్‌టాక్‌లో తన కుమార్తె వీడియోలు ఉండటంపై 15 ఏళ్ల హీరా అనే బాలికపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీడియోలు చేయడం ఆపాలని హెచ్చరించాడు. అయితే కూతురు మాట వినకపోవడంతో ఆ అమ్మాయి మేన మామతో కలిసి కూతురిని చంపేందుకు పథకం వేశాడు. కొన్నాళ్ల క్రితమే అన్వరుల్ హక్ తన భార్య, పిల్లలతో కలిసి అమెరికాకు వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆయన భార్య, మరో ఇద్దరు కుమార్తెలు అమెరికాలోనే ఉండగా జనవరి 15న ఆమె కుమార్తె హీరాతో కలిసి పాకిస్థాన్ కు వచ్చి కూతుర్ని చంపేసాడు.