తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేసి అంత్యక్రియలు
సొసైటీలో రోజు రోజుజకూ ఎలాంటి దారుణాలు బయటికి వస్తున్నాయంటే.. మనం సమాజంలో బతుకుతున్నామా లేక అడవిలో బతుకుతున్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
సొసైటీలో రోజు రోజుజకూ ఎలాంటి దారుణాలు బయటికి వస్తున్నాయంటే.. మనం సమాజంలో బతుకుతున్నామా లేక అడవిలో బతుకుతున్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కరోనా వచ్చిన తరువాత మనుషులు ఇలా తయారయ్యారా.. లేక వీళ్ల క్రూరత్వం ఇప్పుడిప్పుడే బయటికి వస్తోందా అర్థం కావడంలేదు కానీ.. కొందరు మనుషులు చేస్తున్న అరాచకాలు, దారుణాలు చూస్తుంటే ఓళ్లు గగురుపొడుస్తోంది. అన్నా దమ్ముల మధ్య ఉన్న గొడవల కారణంగా తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేయాలని చూశారు ఇద్దరు కొడుకులు. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌లో జరిగింది ఈ దారుణ ఘటన.
తికమ్‌గఢ్‌లోని జాతర పోలీస్ స్టేషన్ పరిదిలో ఉన్న లిదవ్రాతాల్ గ్రామంలో.. ఫిబ్రవరి 3న ధ్యానిసింగ్ అనే ఓ ముసలాయన చనిపోయాడు. దీంతో ఆయన చిన్న కొడుకు దామోదర్ సింగ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. పెద్దాయని చనిపోయాడని తెలియగానే చుట్టాలంతా ఇంటికి వచ్చారు. ఇక శవాన్ని తీస్తారు అనే సమయంలో దామోదర్ అన్న కిషన్ సింగ్ ఇంటికి వచ్చాడు. పెద్దకొడుకుగా తానే తండ్రి అంత్యక్రియలు చేస్తానని గొడవకు దిగాడు. దామోదర్‌కు, కిషన్ సింగ్‌కు చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగా వాళ్లు వేర్వేరుగా ఉంటున్నారు. వాళ్ల మధ్య ఉన్న గొడవలను ఇప్పుడు తండ్రి అంత్యక్రియల మీద కూడా రుద్దారు. అంత్యక్రియలు నేను చేస్తానంటే నేను చేస్తానంటూ ఇద్దరూ గొడవ పెట్టుకున్నారు.
కాసేపటికి ఇద్దరూ కలిసి ఓ దారుణమై నిర్ణయం తీసుకున్నారు. తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేసి పంచుకుందామని డిసైడ్ అయ్యారు. ఎవరి భాగానికి వాళ్లు అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. వీళ్లు తీసుకున్న నిర్ణయం చూసి చుట్టాలతో పాటు ఆఖరిచూపుకు వచ్చినవాళ్లు కూడా ఖంగుతిన్నారు. మనుషులా రాక్షసులా.. ఏం మాట్లాడుతున్నారంటూ వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ల ఎంతకూ వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరు కొడుకులకు క్లాస్ తీసుకుని ఇద్దరూ కలిసి అంత్యక్రియలు చేసేలా వాళ్లను ఒప్పించారు. తండ్రి అంత్యక్రియలను బాధ్యతగా భావించి గొడవ పడితే ఒకే.. కానీ ఏకంగా తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేయాలనుకోవడం ఏంటని ప్రతీ ఒక్కరు నిర్ఘాంతపోతున్నారు.