సూక్ష్మదర్శిని చూసి చంపేసా.. గురుమూర్తి ఆన్సర్ కు పోలీసులు షాక్
సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుందని కామెంట్ చేస్తే సినిమా వాళ్లు మాత్రం దాన్ని వెటకారంగా మాట్లాడుతుంటారు. కొంతమంది హత్యలు చేసే విషయంలో దోపిడీలు చేసే విషయంలో.. సినిమాను చూసి ఎక్కువగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు.
సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుందని కామెంట్ చేస్తే సినిమా వాళ్లు మాత్రం దాన్ని వెటకారంగా మాట్లాడుతుంటారు. కొంతమంది హత్యలు చేసే విషయంలో దోపిడీలు చేసే విషయంలో.. సినిమాను చూసి ఎక్కువగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న హత్యల్లో ఎక్కువగా సినిమాలను చూసి చేస్తున్నవే ఉంటున్నాయి. లేటెస్ట్ గా తెలంగాణలో జరిగిన ఒక హత్య కేసు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. అక్రమ సంబంధానికి తన భార్య అడ్డొస్తుంది అనే కారణంతో గురుమూర్తి అనే వ్యక్తి హైదరాబాదులో భార్యను హత్య చేసి బాత్రూంలో ముక్కలు ముక్కలుగా నరికి ఆ తర్వాత ఆ ముక్కలను శరీరం నుంచి వేరు చేసి కుక్కర్లో ఉడకబెట్టి ఎముకలను పొడిచేసి డ్రైనేజీలో పారబోశాడు.
ఎటువంటి ఆధారాలు దొరక్కుండా అతను చేసిన హత్య కేసు చూసి పోలీసులు కూడా భయపడిపోయారు. ఇక బాత్రూంలో దొరికిన రక్త నమూనాలు వంటి వాటితోనే పోలీసుల ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆమె శరీరానికి సంబంధించి ఒక్క పార్ట్ కూడా పోలీసులు కనుగొనలేకపోయారు. అయితే ఈ హత్య వెనక సూక్ష్మదర్శిని అనే మలయాళ సినిమా ప్రభావం ఉంది అనే విషయం బయటకు వచ్చింది. రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమా చూసిన గురుమూర్తి తన భార్య శవాన్ని ఏ విధంగా మాయం చేయాలో పక్కాగా ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేశాడు. పోలీసులకు ఇదే విషయాన్ని గురుమూర్తి వివరించినట్లు సమాచారం. సూక్ష్మదర్శిని సినిమాతో తాను ఇన్స్పైర్ అయ్యానని… ఈ సినిమాలో దత్తత తీసుకున్న కూతురుని తల్లి, కుమారుడు కలిసి హత్య చేస్తారని అతని మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ఒక ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి కరిగిస్తారని… ఆ నీళ్లను వాష్ రూమ్ ఫ్లష్ ద్వారా వదులుతారని.. అది సినిమాలో తాను చూశానని అతను వివరించాడు.
ఇక మొదట భార్య శవాన్ని కుక్కర్లో ఉడికించి మాయం చేశానని పోలీసులు వివరించాడు. శవాన్ని మాయం చేయడానికి యాసిడ్లను వినియోగించినట్లు సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. భార్యను హత్య చేసిన తర్వాత విషయం బయట పడితే ఆమె కుటుంబ సభ్యుల నుంచి హాని కలుగుతుందని భావించి ఆ శవాన్ని మాయం చేయాలని తాను నిర్ణయం తీసుకున్నానని… ఆ సినిమాలో మృతదేహాన్ని మాయం చేయడానికి యాసిడ్లో రసాయనాలు వినియోగించడం చూసి తాను కూడా అలా చేయాలనుకున్నానని చెప్పుకొచ్చాడు.
రసాయనాలతో శవాన్ని కలిగించి ద్రవంగా మార్చేస్తారు ఆ సినిమాలో. ఆ నీటిని వాష్ రూమ్ ద్వారా ఫ్లష్ చేసేస్తారు. కరగని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా తర్వాత పొడి చేసి ఫ్లష్ ద్వారా డ్రైనేజీలో వదిలేస్తారు. మీర్పేట మాధవి కేసులో కూడా నిందితుడు అలాగే శవాన్ని మాయం చేసి నేరం నుంచి తప్పించుకోవాలని ట్రై చేశాడు. రంపం, కత్తితో చేసి శవాన్ని మూడు ముక్కలుగా కోసి మాంసాన్ని బకెట్లో హీటర్ తో ఉడికించాడు. ఆ తర్వాత ముద్దగా మారిన శరీర భాగాలపై ఆసిడ్ ఇతర రసాయనాలు పోసి సాధ్యమైనంతగా పేస్ట్ తరహాలో మార్చడం పోలీసులు కూడా కంగారు పెట్టింది.
ఇక ఇంట్లోనే గ్యాస్ స్టవ్ పై కాల్చి చిన్న చిన్న ముక్కలుగా విరగగొట్టి దంచి పొడిలా మార్చేసినట్టు తెలిపారు. ఇదంతా నిందితుడు ఒక్కడే ఇంట్లోనే చేశాడని… వీటిని కొంత బాత్రూంలో ఫ్లష్ ద్వారా మరికొంత బకెట్లో వేసుకొని మీర్పేట పెద్ద చెరువులో పారబోశాడని ఆధారాలు దొరకకుండా ఇంటిని రసాయనాలతో క్లీన్ చేశాడని శవాన్ని మాయం చేసే క్రమంలో ఎముకలను కాలుస్తున్న సమయంలో నిందితుడు గురుమూర్తి చేతులు పలుచోట్ల కాలాయని పోలీసులు వెల్లడించారు. ఇక నిందితుడు యాసిడ్లను కొనుగోలు చేసిన దుకాణాలను కూడా పోలీసులు గుర్తించారు. గదిలో రక్తపు ఆనవాళ్లు లేకుండా మాయం చేసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేదు. నేలపై రక్తం మరకల్ని పోలీసులు గుర్తించారు పోలీసులు. ఇక డిఎన్ఎ నమోనాలు కూడా వెంకట మాధవికి చెందిన పోలీసులు తేల్చారు.