MMTSలో అత్యాచారయత్నం చేసింది వీడే…!
MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారం ఘటనలో నిందితుడిని గుర్తించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్ ఈ పని చేసినట్టు గుర్తించారు.

MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారం ఘటనలో నిందితుడిని గుర్తించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్ ఈ పని చేసినట్టు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు అందులో మహేష్ కదలికలను గుర్తించారు.
అనుమానితుడిగా పరిగణలోకి తీసుకుని.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలికి మహేష్ ఫొటోను చూపించారు. నిందితుడిని గుర్తు పట్టిన యువతి.. తనపై దాడి చేసింది మహేషేనని చెప్పడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.