Train Accident: అసలు నిజాలు దాచేస్తున్నారు.. ఒడిశా రైలు ప్రమాదానికి కారణం ఇదే..!

ఇప్పటి వరకూ హౌరా ట్రైన్‌ పట్టాలు తప్పడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రచారం చేశారు. హౌరా ట్రైన్‌ను కోరమాండల్‌ ఢీ కొడితే.. కోరమాండల్‌ ట్రైన్‌ను గూడ్స్‌ ఢీ కొట్టిందని చెప్పారు. కానీ ప్రమాదానికి అసలు కారణం సిగ్నలింగ్‌, కమ్యూనికేషన్‌ లోపం. సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని రైల్వేశాఖ కూడా తెలిపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 3, 2023 | 02:40 PMLast Updated on: Jun 03, 2023 | 2:40 PM

This Is The Real Truth Behind Odisha Train Accident

Train Accident: ఒడిశా ట్రైన్‌ యాక్సిడెంట్‌ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ హౌరా ట్రైన్‌ పట్టాలు తప్పడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రచారం చేశారు. హౌరా ట్రైన్‌ను కోరమాండల్‌ ఢీ కొడితే.. కోరమాండల్‌ ట్రైన్‌ను గూడ్స్‌ ఢీ కొట్టిందని చెప్పారు. కానీ ప్రమాదానికి అసలు కారణం సిగ్నలింగ్‌, కమ్యూనికేషన్‌ లోపం.

సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని రైల్వేశాఖ కూడా తెలిపింది. వేగంగా వస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కి రూట్ ఇవ్వడానికి అదే ట్రాక్ మీదున్న గూడ్స్‌ని లూప్‌లోకి పంపించారు రైల్వే అధికారులు. అయితే మెయిన్ లైన్లో 110 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కోరమాండల్ రైలుకు బహెనాగ్ రైల్వే స్టేషన్‌కు వచ్చాక దానికి సిగ్నల్‌ ఇవ్వలేదు. అయితే సిగ్నల్ ప్యానెల్‌లో మాత్రం ఆ ట్రైన్ మెయిన్ లైన్‌గానే చూపించింది. అదే మెయిన్ లైన్ అనుకుని లూప్‌లైన్లో వెళ్లి అదే ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌ని ఢీకొట్టింది కోరమాండల్ ఎక్స్‌ప్రెస్. కోరమాండల్ భోగీలు గూడ్స్ రైలు భోగీల పైకి ఎక్కాయి. ఈ యాక్సిడెంట్‌తో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ భోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్ పై పడ్డాయి. ఇక్కడి వరకు పెద్దగా ప్రమాదమేమీ జరగలేదు. కానీ 16 నిమిషాలు తర్వాత పక్క ట్రాక్ మీదకు వచ్చిన యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్.. కోరమాండల్ భోగీలను ఢీకొట్టింది.

కోరమాండల్.. గూడ్స్‌ని ఢీకొని పదహారు నిమిషాలు గడుస్తున్నా అటుగా వస్తుున్న యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్‌ను వేరే స్టేషన్‌లో నిలిపివేయలేదు రైల్వే అధికారులు. టోటల్‌గా నిన్న సిగ్నలింగ్ వ్యవస్థ మొత్తం కుప్పకూలి ఎర్రర్ వచ్చింది. ఈ ట్రాజెడీ యాక్సిడెంట్‌లో మొత్తం మూడు ట్రైన్‌లు ప్రమాదానికి గురయ్యాయి. అంతా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. 20 నిమిషాల గ్యాప్‌లో వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇందులో ఏ ఒక్కరు అప్రమత్తంగా ఉన్నా ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు. రైల్వే శాఖ నిర్లక్ష్యం ఇంత ప్రమాదానికి కారణమైంది.