Titan submersible: ప్రాణాలతో ప్రయోగం చేశారు.. టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ అసలు నిజాలు..

ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిపేశారంటూ ఓషియన్‌ గేట్ సంస్థపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నో సబ్‌మెరైన్లు తయారు చేసిన అనుభవం ఉన్న సంస్థ అయినప్పటికీ ఈ టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ను మాత్రం ప్రయోగాత్మకంగా తయారు చేశారని అంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 24, 2023 | 11:54 AMLast Updated on: Jun 24, 2023 | 11:54 AM

Titan Submersible Implosion What We Know About Catastrophic Event

Titan submersible: ఓషియన్‌ గేట్‌ సంస్థ తయారు చేసిన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌లో ఐదుగురు బిలియనీర్లు ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిపేశారంటూ ఓషియన్‌ గేట్ సంస్థపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నో సబ్‌మెరైన్లు తయారు చేసిన అనుభవం ఉన్న సంస్థ అయినప్పటికీ ఈ టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ను మాత్రం ప్రయోగాత్మకంగా తయారు చేశారని అంటున్నారు.

10 వేల 342 కేజీల బరువు ఉండే ఈ సబ్‌మెర్సిబుల్‌ ఇప్పటి వరకూ చేసిన చాలా సబ్‌మెరైన్స్‌ కంటే పెద్దది. కానీ ఇందులో ఐదుగురు వ్యక్తులు మాత్రమే కూర్చునేందుకు వీలుంటుంది. అది కూడా వాళ్లు కిందే కూర్చోవాలి. సబ్‌మెర్సిబుల్‌ మొత్తం పొడవు 6.7 మీటర్లు. చాలా ఇరుకుగా ఉంటుంది. ఇందులో ఒకే టాయిలెట్‌ ఉంటుంది. దానికి కర్టెన్‌ మాత్రమే ఉంటుంది. డోర్‌ ఉండదు. సబ్‌మెర్సిబుల్‌కు ఎక్కడా డోర్లు ఉండవు. సిట్టింగ్‌ స్పేస్‌లో టూరిస్టులను కూర్చోబెట్టి బోల్టులు బిగించేస్తారు. సబ్‌మెర్సిబుల్‌కు ముందు దారి చూసేందుకు పెద్ద గోపురం లాంటి నిర్మాణం ఉంటుంది. చుట్టూ విజువల్స్‌ రికార్డ్‌ చేసేందుకు హై క్వాలిటీ కెమెరాలు ఉంటాయి. 96 గంటల పాటు 4 వేల మీటర్ల లోతుకు ఇది ప్రయాణించగలదు.

ఇందులో ప్రయాణించాలి అనుకునేవాళ్లకు ముందుగానే శిక్షణ ఇస్తారు. అయితే ఈ సబ్‌మెర్సిబుల్‌ డిజైన్‌ విషయంలో, నిర్మాణంలో చాలా సేఫ్టీ ప్రమాణాలను పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన చాలా మంది ఇందులో ప్రయాణించేందుకు నిరాకరించారట. దీనితో ట్రయల్‌ చేసిన ఓ ఇంజినీర్‌ దీన్ని సూసైడ్‌ మెషీన్‌ అంటూ కామెంట్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన సేఫ్టి సర్టిఫికేట్‌ కూడా తీసుకోకుండా దీన్ని వాడుకలోకి తెచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఐదుగురు బిలియనీర్ల ప్రాణాలతో ప్రయోగం చేశారంటూ ఓషియన్‌ గేట్‌ సంస్థపై అంతా ఆరోపణలు చేస్తున్నారు. అయితే చనిపోయిన ఐదుగురు వ్యక్తుల్లో ఓషియన్‌ గేట్‌ వ్యవస్థాపకుడు కూడా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది.