TOLLYWOOD DRUGS CASE: టాలీవుడ్‌కు చుట్టుకుంటున్న డ్రగ్స్‌ కేసు.. లావణ్య చాటింగ్‌ లిస్ట్‌లో సంచలన పేర్లు..

కొంత కాలంగా డ్రగ్స్‌కు బానిస అయిన లావణ్య.. ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంది. విచారణలో లావణ్య చెప్పిన విషయాలు.. షాక్‌కు గురి చేస్తున్నాయ్. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో కొందరి గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2024 | 02:38 PMLast Updated on: Jan 30, 2024 | 2:38 PM

Tollywood Drugs Case Key Details Revealed In Lavanya Chating List

TOLLYWOOD DRUGS CASE: హైదరాబాద్‌లో డ్రగ్స్ దొరికిన ప్రతీసారి.. ఆ లింక్‌ టాలీవుడ్‌లో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అదే కనిపిస్తోంది. నార్సింగిలో లావణ్య అనే యువతిని.. ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హీరో గాళ్‌ఫ్రెండ్‌ అంటూ ప్రచారం జరుగుతున్న టైంలో.. రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయ్. ఇప్పుడు లావణ్య డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. రిమాండ్ రిపోర్టులో కొత్త పేర్లు బయటకు వచ్చాయ్. కొంత కాలంగా డ్రగ్స్‌కు బానిస అయిన లావణ్య.. ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంది.

Kerala BJP Leader Murdered : దేశ చరిత్రలో తొలిసారిగా 15కి ఉరిశిక్ష.. కేరళ బీజేపీ నేత హత్య కేసులో సంచల తీర్పు..

విచారణలో లావణ్య చెప్పిన విషయాలు.. షాక్‌కు గురి చేస్తున్నాయ్. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో కొందరి గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయ్. విజయవాడకు చెందిన లావణ్య.. సినిమాల మీద పిచ్చితో హైదరాబాద్‌ వచ్చింది. మ్యూజిక్ టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. తర్వాత సినిమా చాన్సుల కోసం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఆ టైమ్‌లోనే ఓ యంగ్ హీరోతో పరిచయం ప్రేమగా మారింది. ఐతే సరైన అవకాశాలు లేక.. నెమ్మదిగా డ్రగ్స్‌కు బానిస అయిన లావణ్య.. ఉనీత్ రెడ్డి అనే వ్యక్తితో డ్రగ్స్‌ తెప్పించుకునేది. గోవా నుంచి ఉనిత్‌ డ్రగ్స్ తీసుకువచ్చి లావణ్యకు ఇస్తే.. ఆమె ఇండస్ట్రీలో కొందరికి సరఫరా చేసినట్లు అనుమానాలు వినిపిస్తున్నాయ్. దీంతో లావణ్య ఫోన్, పర్సనల్‌ చాటింగ్‌, సోషల్‌ మీడియా అకౌంట్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు.

లావణ్యకు చాలామంది వీఐపీలతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. కొంతమంది సింగర్లు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు.. లావణ్యతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో చాలామందితో లావణ్యకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో.. ఈ కేసు వీఐపీల మెడకు చుట్టుకునే చాన్స్ ఉందా అనే చర్చ మొదలైంది. ఇక అటు లావణ్యకు డ్రగ్స్ సరఫరా చేసే ఉనీత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం.. మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. లావణ్య అరెస్ట్ అయినప్పటి నుంచి అతను కనిపించడం లేదు. దీంతో ఉనీత్‌ రెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు.