TOLLYWOOD DRUGS: లావణ్య.. ఓ లావణ్య.. ఎందుకిలా అయిపోయావ్..?
బంజారాహిల్స్ నుంచి కొండాపూర్... ఇటు నార్సింగి నుంచి గచ్చిబౌలి దాకా.. ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయ్ డ్రగ్స్. పెడ్లర్లు ఈ ఏరియాల్లోనే తిష్టవేశారు. సినిమా ఇండస్ట్రీతో.. డ్రగ్స్ బంధం పెనవేసుకుపోయింది.
TOLLYWOOD DRUGS: ఆమె పేరు లావణ్య. చూడటానికి అందంగా ఉంటుంది. సినిమాల్లో వెలిగిపోవాలనే కలతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చింది. కొన్ని సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్‌లో అవకాశాలు సంపాదించింది. అంతా బాగుంది అనుకున్న టైమ్‌లో ఆమెకు డ్రగ్స్ అలవాటు అయ్యాయ్. అంతే.. ఆమె దారి మారిపోయింది. దేనికోసమైతే హైదరాబాద్ వచ్చిందో.. ఆ పని మరిచిపోయింది. డ్రగ్స్ వాడటమే కాదు.. అమ్మకాలు మొదలుపెట్టింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. డ్రగ్స్‌కి కేరాఫ్‌గా మారిపోయింది హైదరాబాద్. ముఖ్యంగా సైబరాబాద్ !
Poonam Pandey: పూనమ్ పాండే మరణం.. వ్యాక్సిన్‌పై మళ్లీ చర్చ..
అటు బంజారాహిల్స్ నుంచి కొండాపూర్… ఇటు నార్సింగి నుంచి గచ్చిబౌలి దాకా.. ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయ్ డ్రగ్స్. పెడ్లర్లు ఈ ఏరియాల్లోనే తిష్టవేశారు. సినిమా ఇండస్ట్రీతో.. డ్రగ్స్ బంధం పెనవేసుకుపోయింది. లేటెస్ట్‌గా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న మరోతార.. డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు చిక్కింది. హైదరాబాద్ శివారులోని నార్సింగి డ్రగ్స్ కేసులో పట్టుబడిన లావణ్య కేసులో పోలీసులు దర్యాప్తు జోరుగా సాగిస్తున్నారు. ఈ కేసులో లావణ్య కీలకం కావడంతో.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు సినీ ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయ్. ఉనిత్ రెడ్డి, ఇందిర అనే ఇద్దరితో కలిసి లావణ్య డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. లావణ్య బ్యాచ్ ఒక్క గ్రాము 6వేల రూపాయలకు అమ్ముతున్నట్లుగా తెలుసుకున్నారు. విజయవాడకు చెందిన లావణ్య.. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది. కోకాపేటలో మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నించింది. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.
Poonam Pandey: చనిపోవడానికి గంటల ముందు పార్టీ.. కన్నీళ్లు పెట్టిస్తోన్న పూనమ్ చివరి పోస్ట్..
ఇలా టాలీవుడ్‌లో చాన్సుల కోసం ప్రయత్నిస్తున్న టైమ్‌లోనే లావణ్య జల్సాలకు అలవాటు పడింది. ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య.. అతని ప్రియురాలిగా మారిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. లావణ్య మొబైల్‌తో పాటు, సోషల్‌మీడియా అకౌంట్లు, వ్యక్తిగత చాట్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య మొబైల్‌లో పలువురు సింగర్స్, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్‌ను ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. మూడు నెలల కింద వరలక్ష్మీ టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. ఐతే అప్పుడు దొరక్కుండా లావణ్య తప్పించుకుంది. దీంతో లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో జనవరి 28న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్యను ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయ్. లావణ్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి గోవా నుంచి తీసుకొచ్చి డ్రగ్స్ ఇచ్చినట్లుగా తెలిపింది.
ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య మ్యూజిషియన్‌గా పనిచేస్తుండటంతో.. సినీ ఇండస్ట్రీలోనూ ఈమెకు పరిచయాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. లావణ్య కేవలం డ్రగ్స్ తీసుకుంటుందా.. లేదా సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా అమ్ముతుందా.. అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు మొత్తం లావణ్య చుట్టూ తిరుగుతోంది. కొంతమంది సింగర్లు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు.. ఆమెకు కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లోని కొందరికి ఆమె డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. లావణ్య మొబైల్ డేటాలో ప్రముఖుల నంబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు.