కుక్కతో ట్రై చేసి.. కుక్కర్‌లో ఉడికించి మాధవి మ*ర్డర్‌ కేసు.. సీన్‌ టూ సీన్‌

సామాన్య మానవుల మనసును కలిచివేసే ఘటన ఇది. సైకోలకు కూడా సాధ్యం కాని పైశాచికత్వం ఇది. మీర్‌పేట్‌లో భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన ఘటనలో వెలుగులోకి వస్తున్న నిజాలు వింటుంటే.. ఒళ్లు గగురుపొడుస్తోంది. ఇదంతా నిజంగా ఓ మనిషి చేశాడంటే ఊహించుకోడానికే భయంగా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2025 | 04:01 PMLast Updated on: Jan 30, 2025 | 4:01 PM

Tried It With A Dog Madhavi Murder Case After Cooking It In A Cooker Scene To Scene

సామాన్య మానవుల మనసును కలిచివేసే ఘటన ఇది. సైకోలకు కూడా సాధ్యం కాని పైశాచికత్వం ఇది. మీర్‌పేట్‌లో భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన ఘటనలో వెలుగులోకి వస్తున్న నిజాలు వింటుంటే.. ఒళ్లు గగురుపొడుస్తోంది. ఇదంతా నిజంగా ఓ మనిషి చేశాడంటే ఊహించుకోడానికే భయంగా ఉంది.ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి అదే జిల్లాకు చెందిన వెంకటమాధవితో 13 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు. పెళ్లైన కొంత కాలానికి గురుమూర్తి ఆర్మీలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కంచన్‌బాగ్ డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. మీర్‌పేట్‌లోని జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి భార్య వెంకట మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి తరచూ ఆమెతో గొడవ పడేవాడు.

ఈక్రమంలోనే భార్యను హత్య చేయాలని పథకం వేశాడు. భార్యను చంపేయాలని నిర్ణయించుకున్న గురుమూర్తి అదును కోసం ఎదురుచూశాడు. ఇదే సమయంలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చాయి. దీంతో భార్య, ఇద్దరి పిల్లలతో కలిసి తన సోదరి ఇంటికి తీసుకె ళ్లాడు. అక్కడ పిల్లలను వదిలేసి భార్యతో ఇంటికి వచ్చాడు. 19వ తేది ఉదయం గురుమూర్తి మరో మహిళతో చనువుగా ఉన్న ఫొటోలను భార్య వెంకట మాధవి ఆయన ఫోన్లో చూసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికే హత్య చేయాలనే ప్లాన్‌లో ఉన్న గురుమూర్తి రోకలిబండతో కొట్టి భార్యను హతమార్చాడు. భార్యను హత్య చేసిన గురుమూర్తి శవాన్ని మాయం చేయడా నికి పక్కా ప్లాన్ చేశాడు. ఫుల్‌గా మద్యం తాగి భార్య మృతదేహాన్ని బాత్ రూంకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికాడు. వాటిని బకెట్‌లో వేసి హీటర్ ద్వారా బాగా ఉడికించాడు.

ఆ తర్వాత బొక్కలు, మాంసాన్ని వేరే చేసి కుక్కర్లో బాగా ఉడికించాడు. బాగా ఉడికిన బొక్కలను రోట్లే వేసి చూర్ణం చేశాడు. శరీర భాగాల మాంసాన్ని మొత్తగా దంచి పేస్ట్ చేశాడు. వాటిని కవర్లలో వేసుకోని మీర్ పేట్ చందా చెరువులో కొంత, డ్రైనేజీల్లో మరి కొంత వెదజల్లాడు. ఆ తర్వాత ఇల్లును శుభంగా కడిగేశాడు. ఇదంతా చేయడానికి గురుమూర్తికి రెండు రోజులు పట్టింది. అయితే భార్యను చంపి ఇలా శవాన్ని చేయడానికి ముందుగానే ఓ కుక్కపై గురుమూర్తి ప్రాక్టీస్‌ చేసినట్టు తెలుస్తోంది. అప్పుడు మటన్ నరికే కత్తులను, కొత్త కుక్కర్లను కొనుగోలు చేసి పెట్టుకున్నట్టు సమాచారం. భార్యను చంపి శవాన్ని మాయం చేసిన గురుమూర్తి తనకు ఏం తెలియదన్నట్టు అత్తామామలకు సమాచారం ఇచ్చాడు. తనతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. అంతటితో ఆగకుండా వెళ్లి మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇంటి, పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీని జల్లెడ పట్టారు. కానీ ఆమె ఒక్కతే వెళ్లిన దృశ్యాలు నమోదు కాలేదు. ఇంటి సమీపంలోని కెమెరాలో మాత్రం భర్తతో కలిసి నాలుగు రోజుల క్రితం ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి.

ఆ తర్వాత ఆమె బయటకు వచ్చిన విజువల్స్ ఎక్కడా రికార్డు కాలేదు. మరోవైపు ఆమె మిస్సింగ్ అయినప్పటి నుంచి భర్త గురుమూర్తి పలుమార్లు వివిధ కవర్లతో బయటకు వెళ్లి రావడం రికార్డు అయ్యాయి. అతడి వ్యవహారశైలి అనుమానా స్పదంగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకోని వాళ్ల స్టైల్‌లో విచారిస్తే అసలు నిజం బయటికి వచ్చింది. గురుమూర్తి భార్యను హత్య చేసిన తీరు.. ఆధారాలు మాయం చేసిన తీరు చూసి పోలీసులే విస్తు పోయారు. గురుమూర్తి తన భార్యను హత్య చేశానని ఒప్పుకున్నా.. అందుకు సాక్ష్యాలు లేకుండా చేశాడు. భార్య మృతదేహం కానీ, చంపిన ఆనవాళ్లు, క్లూస్ ఏదీ లేకుండా రూపుమాపాడు. అంతే కాదు.. నేను హత్య చేశాను.. కానీ మీరు కోర్టులో ఎలా నిరూపిస్తారు అంటూ పోలీసులకే సవాల్‌ విసిరాడు. వెంకట మాధవి ఎముకల పొడి, ఆమె శరీర ముద్దల కోసం పోలీసులు చెరువులో, డ్రైనేజీలో వెతికినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇంట్లో, బాత్ రూం, వంట గదిలో FSL టీంలతో సెర్చింగ్ చేశారు. రక్తం మరకల కోసం ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో వెతికారు. ఈ సమయంలో పోలీ సులకు కొన్ని ఆధారాలు లభించాయి. మాధవి శరీర భాగాలను ఇంట్లోనే కాల్చిన ఆనవాళ్లను ఫోరెన్సిక్ టీం గుర్తించింది. కాలిపోయిన మాధవి తల వెంట్రుకలు లభించాయి. వీటి ఆధారంగా పిల్లల DNAతో సరిపోల్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

వీటి ద్వారా గురుమూర్తి పక్కాగా చిక్కే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక హత్యకు ఉపయోగించిన కత్తులు, మొద్దు, కుక్కర్లు, హీటర్ ఇలా అన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురుమూర్తి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అతడి సమీప బంధువైన ఓ మహిళతో గత కొన్నాళ్లుగా లైంగిక సంబంధం కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భార్యను రివర్స్ నువ్వు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని వేధిస్తూ తరచూ గొడవపడేవాడని స్థానికులు చెబుతున్నారు. మాధవిని వదిలించుకోని ఆ మహిళతో కలిసి ఉండటం కోసమే భార్యను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి మిస్సింగ్ అయిందని తెలుసుకున్న పిల్లలు ఇంటికి తిరిగి వచ్చారు.

ఆ సమయంలో ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఏంటి ఈ వాసన అని అడిగినా తండ్రి ఎలాంటి సమాధానం చెప్పలేదు. అమ్మ ఏది అని అడిగినా మౌనంగానే ఉన్నాడు. కానీ భార్య శరీర భాగాలను కుక్కర్లో ఉడికించినప్పుడు, బొక్కలను, వెంట్రుకలను స్టాప్పై కాల్చినప్పుడు బాగా స్మెల్ వచ్చిందని.. ఆ సమయంలో ఏంటి ఈ వాసన అని అడిగితే యాట కాళ్లు, తలకాయ కాలుస్తున్నానని స్థానికులకు సమాధానం చెప్పినట్టు చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం అతడే హత్య చేసి శవాన్ని ఉడికించాడని.. తెలియడంతో ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ల వాళ్లంతా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

భార్యను చంపి శరీర భాగాలను కుక్కర్లో ఉడికించాడని తెలియడంతో నేషనల్ మీడియా, సైతం మీర్‌పేట్కు పరుగులు పెట్టింది. గురుమూర్తి ఇదంతా చేయడానికి ఓ రీసెంట్‌ వెబ్‌సిరీస్‌ను రిఫరెన్స్‌గా తీసుకోవడం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. రీసెంట్‌గా వచ్చిన మలయాళ సినిమా ‘సూక్ష్మదర్శిని’ సినిమాలో ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటాడు విలన్. ఆ తర్వాత దత్తత కూతురిని తల్లితో కలిసి హత్య చేస్తాడు. మృతదేహాన్ని మాయం చేయడానికి శరీరాన్ని ముక్కలుగా నరికి కొన్ని కెమికల్స్‌, యాసిడ్ వాడి ద్రవంలా చేస్తారు. దానిని బాత్ రూంలో ఫ్లష్ చేసి డ్రైనేజీలోకి వదిలేస్తారు. ఇప్పుడు గురుమూర్తి కూడా అదే చేశాడు. ఆధారాలు మాయం చేసేందుకు శవాన్ని కైమా చేశాడు. కానీ ఎన్ని రోజులకైనా చేసిన తప్పు బయటికి రావాల్సిందే దొంగ దొరకాల్సిందే. అలాగే పోలీసులకు చిక్కాడు గురుమూర్తి.