Telangana: పేపర్‌ లీక్‌ చేసిన డబ్బులతో అప్పుల చెల్లింపు సిట్ నివేదికలలో ఆశ్చర్యపోయే విషయాలు

టీఎస్పీఎస్పీ పేపర్‌ లీక్ వ్యవహారంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. రాజకీయంగానూ మంటలు రేపుతోందీ వ్యవహారం. పేపర్‌ లీక్‌పై ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేయగా.. ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా విచారణ సాగించింది. హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయ్. ముఖ్యంగా పేపర్‌ లీక్‌ చేసి.. అమ్ముకొని ఆ డబ్బులతో వాళ్లంతా ఏం చేశారన్న అనుమానాలకు క్లారిటీ వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2023 | 02:45 PMLast Updated on: Apr 12, 2023 | 2:45 PM

Tspsc Question Paper Issue

ప్రశ్నపత్రాల లీకేజీ నిర్వాకంలో ఆర్థిక లావాదేవీల లిస్టును సిట్‌ అధికారులు గుర్తించారు. ప్రశ్నపత్రాలను ఎంతకు బేరం పెట్టారు.. వాటిని కొన్నవారు ఎన్ని డబ్బులు ఇచ్చారు.. ఆ డబ్బులను నిందితులు ఎలా ఖర్చు చేశారనే అంశాలు సిట్‌ దర్యాప్తులో క్లియర్‌గా బయటకు వచ్చాయ్. కేసులో కీలక నిందితుడు ప్రవీణ్‌ AE ప్రశ్నపత్రాన్ని అమ్మేందుకు 10 లక్షలకు బేరం పెట్టినా.. తర్వాతి దశలో అది మరో 40 లక్షల లావాదేవీలకు దారితీసినట్లు సిట్‌ గుర్తించింది. ప్రవీణ్‌ నుంచి ముందుగా రేణుక AE క్వశ్చన్‌పేపర్‌ కొనుగోలు చేసింది. దీనికోసం 10 లక్షలు నగదురూపంలో చెల్లించింది.

ఖమ్మం జిల్లాకు చెందిన సాయిలౌకిక్‌, సుస్మిత దంపతులకు.. DAO పేపర్‌ను 10 లక్షలకు ప్రవీణ్‌ బేరంపెట్టాడు. వీరు 6 లక్షలు ప్రవీణ్‌ అకౌంట్‌లో వేశారు. ప్రవీణ్‌ను అరెస్టు చేసిన తర్వాత అతడి బ్యాంకు ఖాతాలో 4 లక్షలు నిల్వ ఉన్నట్లు గుర్తించి సిట్‌ వాటిని స్వాధీనం చేసుకుంది. ఈ డబ్బులో నుంచి తన బంధువుకు.. ప్రవీణ్‌ 3 లక్షలు చెల్లించాడు. దీనిపై సిట్‌ అధికారులు ఆరా తీయగా బంధువు అలాంటిదేమీ లేదని చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రవీణ్‌ బ్యాంకు ఖాతాలను పరిశీలించినప్పుడు అది నిజమేనని తేలింది. ఈక్రమంలో అతడి బంధువు నుంచి 3 లక్షలను సిట్‌ స్వాధీనం చేసుకుంది. నిజానికి తన సోదరుడు రాజేశ్వర్‌ కోసం అని.. రేణుక AE ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసింది.

ఐతే రాజేశ్వర్‌ పరీక్షే రాయలేదు. ఆ ప్రశ్నపత్రాలను మాత్రం మరో నలుగురికి విక్రయించేందుకు 10లక్షల చొప్పున బేరం పెట్టాడు. వారిలో ఒక్కరు మాత్రమే 8 లక్షలు చెల్లించారు. మిగిలిన వారిలో ముగ్గురు 5 లక్షల చొప్పున ఇచ్చారు. వాటిలో నుంచి తన అప్పు తీర్చేందుకు.. 5 నుంచి 6 లక్షలను రాజేశ్వర్‌ ఖర్చు చేశాడు. మరో 6-7లక్షలతో వేరే పనులు చేశాడు. ఎవడి డబ్బు.. ఎవడు ఖర్చు చేశాడు.. లక్షల మంది నిరుద్యోగుల కలలను కొట్టారు కదా అంటూ ఇదంతా తెలిసిన జనం ఫైర్ అవుతున్నారు.