Corruption : ఆకాశంలోనే కాదు.. అవినీతిలోనూ సగమే..
ఆడది అంటే ఆకాశంలో సగం అంటారు. ఆకాశంలోనే కాదు అవినీతిలో సగం అనిపించింది ఓ మహిళా ఉద్యోగి. మంచి జాబ్.. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన హోదా.. కాసులకు కక్కుర్తి పడి అన్ని మరిచిపోయింది. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిన. ఏసీబీ దాడులు మహిళలు చిక్కిన చాలా అరుదు.

Uda means half of the sky Not only in the sky but half of the corruption seemed to be a female employee
ఆడది అంటే ఆకాశంలో సగం అంటారు. ఆకాశంలోనే కాదు అవినీతిలో సగం అనిపించింది ఓ మహిళా ఉద్యోగి. మంచి జాబ్.. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన హోదా.. కాసులకు కక్కుర్తి పడి అన్ని మరిచిపోయింది. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిన. ఏసీబీ దాడులు మహిళలు చిక్కిన చాలా అరుదు. నిజాయితీకి మారు పేరులా ఉంటారు మహిళా అధికారులు అనే టాక్ ఉంది. అయితే ఆమె మాత్రం ఆ మాటకే మచ్చ తెచ్చింది. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఏసీబీ అధికారులకు టౌన్ ప్లానింగ్ అధికారిని ఉమా.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. . సరూర్ నగర్‌లోని జీహెచ్‌ఎంసీ, హయత్ నగర్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. కొన్ని రోజుల క్రితం గుర్రంగూడకు చెందిన సుధాకర్ రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఉమను కలిశారు. ఆ క్రమంలో ఆమె అనుమతి కోసం లక్షన్నర రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు.. ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి డబ్బులు ఇస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఉమతోపాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మణ్‌ను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.