వివేకా కేసులో లైంగికి వేధింపులు మర్డర్ కేసు తేలేనా ?
వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఓ వీడని చిక్కుముడిలా మారింది. కేసు కొలిక్కి వచ్చింది అనుకున్న ప్రతీసారి ఓ కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పటికే చాలా కారణాలు మారిపోగా ఇప్పుడు మరో కొత్త కోణాన్ని కోర్టులో వ్యక్తపరిచారు భాస్కర్ రెడ్డి తరఫు లాయర్. నిందుతుల్లో ఒకడైన సునీల్ యాదవ్ తల్లిన వివేకా లైగింకంగా వేధించాడని.. ఆ కక్షతోనే సునీల్ యాదవ్ వివేకాను హత్య చేశాడని చెప్పారు. దీంతో కేసు మళ్లీ మొదటికి వచ్చి చేరింది.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రువర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ అవినాష్ రెడ్డి కోర్టులో పిటషన్ అప్పీల్ చేశాడు. దీనిపై జరిగిన విచారణలో ఈ కొత్త పాయింట్‌ను వెలుబుచ్చారు. తన వాదన వినిపించేందుకు మరో గంట కావాలంటూ భాస్కర్ రెడ్డి లాయర్ కోర్టును కోరాడు. దీంతో గురువారానికి విచారణ వాయిదే వేసింది కోర్టు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ కేసు ఇప్పటికే చాలా మలుపులు తిరిగింది.
రాజకీయ కక్షల కారణంగానే మర్డర్ జరిగిందని మొదట అంతా అనుకున్నారు. కానీ ఆయన గుండెపోటుతో చనిపోయారని కొత్త వాదన కొన్ని రోజులకు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు, ఆది నారాయణ రెడ్డి ఈ హత్య వెనకున్నారనే పుకార్లు పుట్టించారు. కానీ సిట్ దర్యాప్తులో ఇవన్నీ అబద్ధాలే అని తేలడంతో కేసును సీబీఐకి ట్రాన్స్‌ఫర్ చేసింది కోర్ట్. ఆఖరికి దస్తగిరి స్టేట్‌మెంట్‌తో ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లు బయటికి వచ్చాయి. ఈ కేసులో అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు ప్రశ్నించింది సీబీఐ. సుమారు నెల రోజుల తరువాత ఇవాళ కోర్టులో ఈ కేసు మీద విచారణ జరగడంతో ఈ కొత్త కోణాన్ని స్క్రీన్ మీదకు తీసుకువచ్చాడు భాస్కర్ రెడ్డి లాయర్. అయితే కోర్టుకు కావాల్సింది లాయర్ చెప్పే మాటలు కాదు.. ఆ మాటలను నిజం చేసే సాక్ష్యం. కానీ ప్రస్తుతానికి అవేమీ లేవు.
అవినాష్ రెడ్డి వివేకా ఇంటికి వెళ్లినట్టు గూగుల్ టేకౌట్‌లో ఉంది. కానీ నిందుతులెవరో ఆయన ఫోన్‌ను వివేకా ఇంటికి తీసుకువెళ్లారనేది భాస్కర్ రెడ్డి లాయర్ పాయింట్. ఇప్పుడు ఆ వాదనను డిఫెండ్ చేయడానికి సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపించాలంటే ఇంకొన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఈ గ్యాప్‌లో ఇంకెన్ని కొత్త కోణాలు బయటికి వస్తాయో చూడాలి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. కోర్టు కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉంది. ఇప్పుడు మరోసారి ఇన్వెస్టిగేషన్ పొండగించాల్సి వస్తే కోర్టు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కీలకంగా మారింది.