Vizag MRO Murder: విశాఖలో ఎమ్మార్వో హత్య వెనుక అసలు కారణం తెలుసా..?
ప్రశాంతతకు మారు పేరైన విశాఖపట్నంలో కొంతకాలంగా పరిస్థితి మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హత్యలు, భూదందాలు, అత్యాచారాలు పెరిగాయి. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అయిన తర్వాత ఇవి కాస్త శృతి మించాయి.
Vizag MRO Murder: విశాఖ జిల్లా మధురవాడలో తహసీల్దార్ రమణయ్య దారుణహత్యకు గురయ్యారు. ఇటీవలే విశాఖ రూరల్ నుంచి విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలానికి బదిలీ అయ్యారు. ఎమ్మార్వోను చంపింది ఎవరు? ఎందుకు చంపారు? ఆర్థిక లావాదేవీలే కారణమా? లేదంటే భూవ్యవహారాలు తేడాలు రావడం వల్లే రియల్ వ్యాపారులు చంపించారా? తహసీల్దార్ హత్యపై పోలీసుల వర్షెన్ ఏంటి..?
విశాఖ జిల్లా మధురవాడలో విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. విజయనగరం బదిలీ కాకముందు.. విశాఖ జిల్లా రూరల్‌లోని చినగదిలిలో తహసీల్దార్‌గా పని చేశారు. విశాఖలోని కొమ్మాదిలోని చరణ్ క్యాసిల్ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఫోన్ రావడంతో అపార్ట్‌మెంట్ గేట్ దగ్గరకు వచ్చారు. బయట వెయిట్ చేస్తున్న వ్యక్తిని కలిసి కొంతసేపు మాట్లాడిన తర్వాత వాగ్వాదం జరిగింది. దుండగుడు ఇనుపరాడ్‌తో ఎమ్మార్వో రమణయ్యపై దాడి చేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ప్రశాంతతకు మారు పేరైన విశాఖపట్నంలో కొంతకాలంగా పరిస్థితి మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హత్యలు, భూదందాలు, అత్యాచారాలు పెరిగాయి. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అయిన తర్వాత ఇవి కాస్త శృతి మించాయి. రాయలసీమ వాసులు విశాఖపట్నంలోనే మకాం వేశారు.
JANASENA: పొత్తులో జనసేనకు దక్కబోయే స్థానాలు ఇవేనా..?
చీమ చిటుక్కుమన్నా తమకు తెలిసిపోయేలా యంత్రాంగాన్ని తయారు చేసుకున్నారు. భూములు అమ్మాలన్నా.. కొనాలన్నా.. కప్పం కట్టాల్సిందే. ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. తమదంటూ జెండా పాతేస్తున్నారు. ప్రభుత్వ భూములైనా.. ప్రైవేటువైనా.. కాస్ట్‌లీ భూములపై కన్ను పడిందంటే ఇక అంతే సంగతులు అన్న పరిస్థితి కల్పించారు. బొండపల్లి ఎమ్మార్వో సనపల రమణయ్య హత్య… ప్రస్తుతం విశాఖలో కలకలం రేపుతోంది. విజయనగరంకు బదిలీ అయిన తహసీల్దార్‌ను హత్య చేయాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్థిక లావాదేవీలే కారణమా ? లేదంటే భూ వ్యవహారాల్లో వాటాల వ్యవహారమా అన్నది అంతుచిక్కడం లేదు. రమణయ్య హత్యపై పోలీసులు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఎమ్మార్వో స్థాయి లాంటి వ్యక్తులను చంపే ధైర్యం ఉత్తరాంధ్ర వాసులకు లేదని, రాయలసీమ ఫ్యాక్షన్‌తో సంబంధం ఉన్నవారే చంపి ఉంటారని అనుమానిస్తున్నారు.
సీసీ ఫుటేజ్ ప్రకారం అక్కడికి వచ్చిన వ్యక్తి ధరించిన బట్టలను బట్టి హంతకుడు కచ్చితంగా రాయలసీమకు చెందిన వ్యక్తి అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం అపార్ట్‌మెంట్‌లో ఉన్న రమణయ్యకు ఫోన్ చేసి పిలిపించి దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రమణయ్య కింద పడిపోయిన తర్వాత హంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ప్రత్యేక పోలీసు బృందాలు హంతకుడి కోసం గాలిస్తున్నాయి. ఉత్తరాంధ్ర వాసులకు హత్య చేసేంత ధైర్యం లేదని, ఇది కచ్చితంగా రాయలసీమ వాసుల పనేనన్న ఆరోపణలు వస్తున్నాయి.