Visakapatnam: విశాఖ యువతి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. కీలకంగా ఫోన్‌ కాల్‌ రికార్డింగ్స్‌.. అందులో ఏమున్నాయ్ ?

విశాఖ ఆర్కే బీచ్‌లో వివాహిత శ్వేత శవమైన కనిపించిన ఘటన.. కలకలం రేపుతోంది. బీచ్ ఒడ్డున మృతదేహం పడి ఉన్న తీరు ఆమెదీ హత్యా.. లేదా ఆత్మహత్య అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయ్. ఇసుకలో సగం మృతదేహం కూరుకుపోయి.. మిగతా సగం అర్థనగ్నంగా కనిపించింది. మంగళవారం అత్తగారింటి నుంచి వెళ్లిపోయిన ఆమె.. ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2023 | 06:15 PMLast Updated on: Apr 26, 2023 | 6:34 PM

Vizag Murder Mistry

ఐతే విశాఖ ఆర్కే బీచ్ సమీపాన ఉన్న వైఎంసీఏ బీచ్ ప్రాంతంలో బుధవారం శవమై తేలింది. ఆమె గాజువాకకు చెందిన శ్వేతగా నిర్ధారించారు. ఐతే ఈ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. మృతికి గల కారణాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడీ కేసులో ఓ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమె చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాసింది. చనిపోవడానికి కారణాలను అందులో తెలిపింది. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు ఉండగలవని. నీకు అసలు ఏం మాత్రం ఫరఖ్ పడదు అని. ఏనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడాలని ఉన్నా కూడా ఏమీ మాట్లాడలేదు. బికాజ్ నువ్వు బయటకు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా యు నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అని లెటర్ రాసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది శ్వేత.

చివరిలో ఎ బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్ అని పెద్దగా రాసింది. ఐతే అత్తారింటి వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందని.. వారిని వారిని కఠినంగా శిక్షించాలని శ్వేత తల్లి డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయ్. చనిపోయే సమయానికి శ్వేత ఐదు నెలల గర్భవతి. ఐతే ఇంటి నుంచి బయలుదేరే గంట ముందు వరకు కూడా భర్త మణికంఠతో గొడవపడినట్లు తెలిసింది. శ్వేత అత్తింటి వారిపై ఆమె తల్లి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. భర్త, అత్తమామల వేధింపుల వల్లే శ్వేత చనిపోయిందంటూ ఆరోపిస్తున్నారు.

గత ఏడాది ఏప్రిల్ 15న శ్వేతకు మణికంఠతో పెళ్లి జరిగింది. ఐతే అత్తింటివాళ్లు శ్వేతకు నరకం చూపించారని.. తరచూ తన కూతురు బాధను పంచుకునేదని ఆమె తల్లి అంటున్నారు. చనిపోవడానికి ముందు కూడా ఫోన్ చేసిందని.. తర్వాత భర్త మణికంఠ ఫోన్ చేశాడని కట్ చేసిందని తెలిపింది. 5 నెలల గర్భిణీ అని కూడా చూడకుండా ఇంట్లో పనులన్నీ శ్వేతతో తన అత్త చేయించేదని ఆరోపించింది. శ్వేత భర్త మణికంఠ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. భార్య కనిపించకపోవడంతో విశాఖకు చేరుకున్నారు.

శ్వేత ప్రతి దానికి వితండవాదం చేసేదని.. ఇంట్లో విషయాలు ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్పానని.. ఫోన్ చేసిన మాట నిజమేనని, తన మాట వినాలని, గొడవలు ఆపేయాలని గట్టిగా చెప్పానన్నారు. దీంతో ఇంట్లో ఫోన్ వదిలేసి, సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు. ఐతే అసలేం జరిగింది.. ఆమె మరణానికి కారణాలు ఏంటి.. నిజంగా ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు మొదలయ్యాయ్. బీచ్‌లో శ్వేత చనిపోయి ఉన్న ప్రదేశం మరిన్ని సందేహాలకు కారణం అవుతోంది. అసలు ఫోన్‌ కాల్‌ కట్‌ చేసిన తర్వాత ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ కాల్‌లో శ్వేత, మణికంఠ ఏం మాట్లాడుకున్నారన్నది ఆరా తీసే పనిలో పోలీసులు పడ్డారు. దీంతో ఆ ఫోన్‌.. ఈ కేసులో కీలకంగా మారింది.