Vizag: శ్వేత కేసులో కొత్త అనుమానాలు.. పోస్టుమార్టం నివేదికలో ఏముంది ?
విశాఖ బీచ్‌లో శవమై కనిపించిన వివాహిత శ్వేత కేసులో.. గంటకో అనుమానం తెరమీదకు వస్తోంది. డెడ్‌బాడీ పడి ఉన్న తీరుతో.. ఆమెది హత్యా, ఆత్మహత్యా అనే సందేహాలు మరింత బలంగా మారుతున్నాయ్. అత్తవారింటి వారే చంపేశారని శ్వేత తల్లి ఆరోపిస్తుంటే.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించా రెండు ప్రాణాలు కోల్పోయా అని ఆమె భర్త అంటున్నారు.
బీచ్‌లో శవం అభ్యంతరక రీతిలో కనిపించడం.. ఇసుకలో కూరుకుపోవడం.. డెడ్‌బాడీ మీద కేవలం లోదుస్తులు మాత్రమే ఉండడం.. ఇంటి నుంచి గొడవ అయిన వెళ్లిన సమయానికి.. డెడ్‌బాడీ దొరికిన సమయానికి మధ్య కొంచెం టైమ్ మాత్రమే గ్యాప్ ఉండడం.. మరిన్ని సందేహాలకు కారణం అవుతోంది. దీంతో కేసు మరింత క్రిటికల్‌గా మారుతోంది.
చనిపోవడానికి ముందు శ్వేత సూసైడ్ నోట్ రాసింది. నిన్ను నువ్ ప్రశ్నించుకో అని భర్తకు ఆ లెటర్‌లో రాసింది. చివరలో బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్ అని రాయడం.. మరింత మిస్టరీగా మారింది. ఇసుకలో శవం కూరుకుపోయింది. ఒంటి మీద గాయాలు లేవు అంటున్నారు. శరీరం మీద లోదుస్తులు మాత్రమే ఉన్నాయ్. దీంతో అసలేం జరిగిందనే విషయం తెలుగు రాష్ట్రాల జనాలను వెంటాడుతోంది. భర్తతో చివరి కాల్ మాట్లాడిన తర్వాత ఇంటి నుంచి శ్వేత వెళ్లిపోయింది. ఫోన్ ఇంట్లోనే పెట్టేసింది. అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఇదీ ప్రస్తుతానికి తెలిసిన మ్యాటర్.
బీచ్‌లో రాత్రి 11గంటల వరకు హడావుడి ఉంటుంది. అప్పుడు సూసైడ్ చేసుకోవడం అసాధ్యం. ఆ తర్వాత చేసుకుంది అంటే.. ఆ సమయంలో అంటే అర్థరాత్రి చనిపోతే.. పొద్దున వరకు శవం ఎలా తేలుతుంది.. అసలు బీచ్‌కు శ్వేత ఒక్కతే వెళ్లిందా, లేదంటే ఎవరైనా తోడు ఉన్నారా.. ఆమె శరీరంపై ఒక్క గాయం కూడా ఎందుకు లేదు.. అసలు ఇసుకలో బాడీ ఎలా కూరుకుపోయింది. నిజంగా ఆత్మహత్య చేసుకుందా.. గంజాయి బ్యాచ్ ఏమైనా చేసిందా.. ఈ మృతిలో అత్తగారి కుటుంబం పాత్ర ఏమైనా ఉందా.. ఇలా రకరకాల ప్రశ్నలు ఈ కేసులో వెంటాడుతున్నాయ్. ఐతే వీటన్నింటికి సమాధానం.. పోస్టుమార్టం రిపోర్టులోనే దొరకనుంది. దీంతో అది కీలకంగా మారింది.