USA GUNS : 4 రోజుల్లో 400 మంది కాల్చివేత

పేరుకే అగ్రరాజ్యం.. అమెరికా.. ప్రపంచ మొత్తం పెత్తనం చేయాలని అనుకుంటుంది.. ఏ దేశంలో ఏ అలజడి చెలరేగినా తనకే కావాలి. ఏ రెండు దేశాలు కొట్టుకున్నా తలదూర్చాలి. కానీ తమ దేశంలో తుపాకులతో జనం కాల్చి చంపుతుంటే శాంతి భద్రతలు అదుపులో పెట్టుకోవడం అమెరికా పాలకులకు తెలియడం లేదు. అమెరికాను కొన్నేళ్ళుగా తుపాకుల సంస్కృతి వణికిస్తోంది. రీసెంట్ గా కొత్త ఏడాది వేడుకల వేళ ఉన్మాదులు రెచ్చిపోయారు. 4 రోజుల్లోనే 400మందిని గన్స్ బలితీసుకున్నాయని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 6, 2024 | 12:30 PMLast Updated on: Jan 06, 2024 | 12:31 PM

We Know Why 400 People Were Shot In Just 4 Days In America The Worlds Largest Superpower

పేరుకే అగ్రరాజ్యం.. అమెరికా.. ప్రపంచ మొత్తం పెత్తనం చేయాలని అనుకుంటుంది.. ఏ దేశంలో ఏ అలజడి చెలరేగినా తనకే కావాలి. ఏ రెండు దేశాలు కొట్టుకున్నా తలదూర్చాలి. కానీ తమ దేశంలో తుపాకులతో జనం కాల్చి చంపుతుంటే శాంతి భద్రతలు అదుపులో పెట్టుకోవడం అమెరికా పాలకులకు తెలియడం లేదు. అమెరికాను కొన్నేళ్ళుగా తుపాకుల సంస్కృతి వణికిస్తోంది. రీసెంట్ గా కొత్త ఏడాది వేడుకల వేళ ఉన్మాదులు రెచ్చిపోయారు. 4 రోజుల్లోనే 400మందిని గన్స్ బలితీసుకున్నాయని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.

మనం పొద్దున్నే షాపుల కెళ్లి పాల ప్యాకెట్లు కొన్నంత ఈజీగా.. అమెరికన్లు గన్స్ కొనుక్కుంటున్నారు. లైసెన్స్‌ లేకుండా గన్‌ తీసుకెళ్లేందుకు అమెరికాలో 27 రాష్ట్రాల్లో అనుమతి ఉంది. అందుకే.. మన పిల్లలు బొమ్మ తుపాకీలు కొనుక్కున్నట్టు.. ఒక్కో ఇంట్లో నాలుగైదు గన్‌లు ఉంటాయి. కొందరు అమెరికన్లకైతే గన్స్ వాడకం వ్యసనంగా మారింది. మొబైల్ లేకుంటే ఎలా ఉండలేమో.. గన్ లేకుండా బతకలేం అనే పరిస్థితికి వచ్చారు కొందరు. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే తుపాకీ బయటకు తీసి ఇష్టమొచ్చినట్టు కాల్పులు జరుపుతున్నారు. మొబైల్‌లో గేమ్ ఆడినంత ఈజీగా జనాన్ని కాల్చేస్తున్నారు. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో నిత్యం తుపాకీ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరి చేతిలో గన్ పేలుతుందో తెలియని పరిస్థితి ఉంది. బజారుకు వెళ్ళినవాడు ఇంటికి క్షేమంగా వస్తాడన్న గ్యారంటీ లేకుండా పోతోంది. ఎవడు ఎవరిని కాల్చేస్తాడో తెలియడం లేదు. దాంతో అమాయకులు చనిపోతున్నారు. జనం భారీగా గుమిగూడిన ప్రతిచోటా తుపాకుల భయమే కనిపిస్తోంది. ఏ టైమ్ లో ఎవడు విరుచుకుపడతాడోనన్న టెన్షన్ అమెరికన్లలో కనిపిస్తోంది. ఇక మొన్నటి న్యూఇయర్‌ వేడుకల్లోనూ ఇదే పరిస్థితి. చాలా చోట్ల చిన్న చిన్న కారణాలకే గన్‌ బయటకొచ్చింది. ఎవడిపై కోపం వచ్చినా గన్ తీసి కాల్చేపారేస్తున్నారు. ఆ తర్వాత తానూ కాల్చుకుని చావడం అమెరికాలో అలవాటైంది. చంపడానికే కాదు చావడానికీ ఎక్కువగా గన్స్ వాడుతున్నారు అమెరికన్లు.

ఇలా కొత్త సంవత్సరం మొదలైన నాలుగు రోజుల్లో 400 మంది తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. న్యూఇయర్ వేడుకలు చాలామంది కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ సంఘటనలపై Xలో ట్వీట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐవోవాలో ఆరో తరగతి విద్యార్థి.. తోటి స్టూడెంట్స్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటనపై స్పందించారు. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా.. మరో ఐదుగురు, స్కూల్ ప్రిన్సిపల్ తీవ్రంగా గాయపడ్డారు. 17యేళ్ళ వయస్సున్న ఆ కుర్రాడు.. హ్యాండ్ గన్, షాట్ గన్ రెండింటినీ తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. పిల్లలు, యువత తుపాకీ సంస్కృతికి అలవాటు పడటంపై అందరూ ఆలోచించాలని ట్వీట్ లో పేర్కొన్నారు కమలా హారిస్. ఇప్పటికైనా తుపాకుల వాడకంపై చట్టసభల్లో చర్చ జరగాలనీ.. కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు.

2023లో దాదాపు 19 వేల మంది తుపాకుల కాల్పుల్లో చనిపోగా.. 36 వేల 357 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 6 వేల 192 మంది యువత, చిన్నపిల్లలపై కాల్పులు జరగ్గా.. 16 వందల మంది చనిపోయారు. 2023లో 656 మాస్‌ షూటింగ్స్ జరిగినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. 2013 నుంచి ఏటా మాస్‌ షూటింగ్స్ సంఖ్య పెరుగుతోంది. గత ఏడాదిలో అమెరికన్లు 1 కోటి 40 లక్షల తుపాకీలు కొన్నారు. కరోనా ఎఫెక్ట్ తో దేశంలో అశాంతి పెరిగిపోవడం.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడం కూడా తుపాకుల కొనుగోళ్ళు పెరగడానికి కారణమైంది. 2020 సంవత్సరంతో పోలిస్తే.. తుపాకుల కొనుగోళ్ళ సంఖ్య కొంచెం తగ్గుతోందని అంటున్నారు అధికారులు. చట్టసభల్లో కఠినమైన చట్టాలు చేసి తుపాకీ సంస్కృతిని అడ్డుకోవాలని US లో ఉన్న మన భారతీయులు కూడా కోరుకుంటున్నారు.