చస్తే చావు.. నాగాంజలితో దీపక్ ఏం మాట్లాడాడు..?
రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రి ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య కేసులో నిందితుడు దీపక్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రి ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య కేసులో నిందితుడు దీపక్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను మాయమాటలతో నాగాంజలిని లోబర్చుకున్నట్టు నిందితుడు దీపక్ ఒప్పుకున్నాడు. హాస్పిటల్ సిబ్బంది కుమార్తె వివాహ వేడుకలో నాగాంజలిని చూసినట్టు దీపక్ చెప్పాడు. అప్పటి నుంచి ఆమెను శారీరకంగా వాడుకునేందుకు రకరకాలు ప్రయత్నాలు చేసినట్టు అంగీకరించాడు.
హాస్పిటల్ దగ్గరలో ఒక రూమ్ లో అద్దెకుంటున్న నాగాంజలిని తానే వేరే రూమ్ కు నిందితుడు మార్చాడు. హాస్పిటల్ దగ్గరలోనే మరో నలుగురు అమ్మాయిలతో ఆమెను ఉంచిన దీపక్.. మిగిలిన అమ్మాయిలు రూమ్ లో లేని సమయంలో నాగాంజలిని శారీరకంగా వాడుకున్నట్టు నిందితుడు అంగీకరించాడు. ఆ తర్వాత చాలా సార్లు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి దీపక్ వాడుకున్నాడు. మార్చి 23న తనను పెళ్లి చేసుకోవాలని దీపక్ ను ఫోన్ లో నాగాంజలి అడిగింది.
పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని దీపక్ కు నాగాంజలి చెప్పింది. చస్తే చావు అన్న దీపక్ .. తన నుంచి దూరంగా వెళ్లిపోవాలని దీపక్ బెదిరించాడు. దీపక్ మాటలతో కన్నీరుమున్నీరైన నాగాంజలి.. దీపక్ తో వాగ్వాదం తర్వాతే అనెస్థీషియా.. ఇంజెక్షన్ తీసుకుంది బాధితురాలు. కిమ్స్ ఆసుపత్రిలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా దీపక్ అలియాస్ దువ్వాడ మాధవరావు పని చేస్తున్నాడు. పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నప్పటికీ పెళ్లి పేరుతో నాగాంజలి జీవితాన్ని దీపక్ నాశనం చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు.