Wife Murder: కట్టుకున్నవాడే కాటికి చేర్చాడు.. అప్పు, అనుమానాలే హత్యకు కారణాలు

హత్యలు సాధారణంగా కక్ష్యలతోనో మనస్పర్థలకారణంగానో జరుగుతాయి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆర్థిక లావాదేవీలు, అనుమానాలు అనే ద్వంద క్రియల మధ్య జరిగింది. సినిమాటిక్ డైరెక్షన్లో సిగరెట్లతో కాల్చి, బండరాళ్లతో గుద్ది, కారుతో తొక్కించి మరీ దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఇది స్నేహితుని మధ్యో, బంధువుల మధ్యో, తెలిసిన వారి మధ్య జరిగిన దారుణం కాదు. కట్టుకున్న భర్తే భార్యను కడచేర్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 21, 2023 | 01:23 PMLast Updated on: May 21, 2023 | 1:27 PM

Wife Murder By Husband

ప్రకాశంజిల్లా వెలిగండ్ల మండలానికి చెందిన రాధ అనే 35 సంవత్సరాల వివాహిత ఈ ఉదాంతంలో తన ప్రాణాలు కోల్పోయారు. రాధ బాల్య స్నేహితుడు కేతిరెడ్డి కాశీరెడ్డి ఆమె వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తానని నమ్మబలికాడు. దీంతో రాధ.. కాశీ రెడ్డి చెప్పిన ప్రదేశానికి వెళ్లడంతో అక్కడ ఆమెకు డబ్బు ఎగురకొట్టి ప్రాణాలు తీసేశాడు అని తొలుత అనుమానాలు వచ్చాయి.

తమ కూతురు అతి కిరాతకంగా గాయాలబారినపడి మరణించడంతో రాధ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే మృతురాలి అంత్యక్రియలు తెలంగాణలోని సూర్యాపేట కోదాడలో జరిగాయి. అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఆమె భర్త సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రకాశం జిల్లాకు పిలిపించి విచారణ చేపట్టారు.

మోహన్ రెడ్డిని విచారణకు పిలిపించేందుకు మునుపే పోలీసులు ఇతని వాట్సప్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించారు. మోహన్ రెడ్డే తన భార్యను హత్య చేసినట్టు నిర్థారించుకున్నారు. ఉద్యోగం కోల్పోయిన మోహన్ రెడ్డి స్నేహితుడికి ఆదుకోవడం కోసం రూ. 80లక్షలు అప్పు ఇప్పించింది రాధ. ఈ డబ్బులు ఎంతకాలానికి తిరిగి రాకపోవడంతో భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. సీన్ కట్ చేస్తే.. రాధ కాశీ రెడ్డిని ఎందుకు గట్టిగా డబ్బులు ఇవ్వమని అడగడం లేదు అన్న ఆలోచనతో ఉన్నాడు మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే తన భార్య కాశీ రెడ్డితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు అనుమానించారు.

Radha Murder Case

Radha Murder Case

ఈ క్రమంలో కాశీరెడ్డి పేరు మీదుగా సిమ్ కార్డ్ తీసుకొని తన భార్యతో మోహన్ రెడ్డే కాశీరెడ్డిలాగా చాటింగ్ చేయడం ప్రారంభించారు. ఇలా చేస్తూ కొన్ని రోజులు గడిచిన తరువాత ఈ నెల 17వ తేదీన డబ్బులు తిరిగి ఇస్తానని కాశీరెడ్డి లాగా తన భార్యను నమ్మించాడు భర్త మోహన్ రెడ్డి. దీంతో ఆమె అప్పు తిరిగి చెల్లిస్తాడన్న నమ్మకంతో ఎంతో ఆశగా కనిగిరికి వెళ్లింది. ఆనంతరం కారులో తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా హింసించి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కేసులో మోహన్ రెడ్డి పై అనుమానం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కనిగిరిలోని పామూరు బస్టాండ్ వద్ద ఉన్న ఎరుపు రంగు కారు హైదరాబాద్ కు చెందినదిగా గుర్తించడం. డబ్బులు తీసుకున్న కాశీరెడ్డి గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లడం. గతంలో రాధ ను వేధింపులకు గురిచేస్తూ ఆమె తల్లిదండ్రుల వద్ద నుంచి మోహన్ రెడ్డి రూ. 25 లక్షల వరకూ తీసుకోవడం. ఈ పై కారణాలన్నీ మోహన్ రడ్డిని హంతకుడిగా చూపించేందుకు దోహదపడ్డాయి. ఈ దారుణ హత్యకు పాత్రదారులు ఇంకా ఎంతమంది ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాట్లు పోలీసులు తెలిపారు.

 

T.V.SRIKAR