khiladi lady: లూటీ చేసిన బ్యూటీ.. ఈమె చాలా డేంజర్‌ గురూ..

ఈ దంపతుల పేరు సమీనా, ఇస్మాయిల్‌. లేడీస్‌ బ్యూటీ ప్రొడక్ట్స్‌ వీక్‌నెస్‌ను అడ్డం పెట్టుకొని.. పెద్ద స్కెచ్ వేశారు. మూడు కోట్లు దోచేశారు. బ్యూటీపార్లర్‌ అంటూ ఘరానా మోసం చేశారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో.. మూడు కోట్లకు పైగా వసూళ్లు చేసి ఈ కిలాడి దంపతులు మాయం అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2024 | 02:25 PMLast Updated on: Jan 29, 2024 | 2:25 PM

Woman Cheated 3crs With Beauty Parlour In Hyderabad And Telangana

khiladi lady: వీళ్లిద్దరిని చూశారా.. అన్యోన్యానికి ఆధార్‌ ప్రింట్‌లా ఉన్నారు కదా ! నిజంగా అన్యోన్య దంపతులే. కాకపోతే అన్యాయం చేసే దంపతులు. అసలు విషయం తెలిస్తే.. ఇంతకుమించి అవాక్కవుతారు మీరు కూడా ! ఈ బ్యూటీ.. వందల మందిని బ్యూటీపార్లర్‌ పేరుతో లూటీ చేసింది. లక్ష.. పది లక్షలు కాదు.. 3 కోట్లకు పైగా పైగా మోసం చేసి.. అడ్రస్‌ మార్చేసింది. అసలు విషయం ఆరా తీస్తే.. ఈ దంపతులు మరిన్ని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్.

Election Petitions : ఆ ఎమ్మెల్యేల ఎన్నిక అక్రమం… KTR, హరీశ్,కౌశిక్ రెడ్డి సహా 24 మందిపై పిటిషన్లు

ఈ దంపతుల పేరు సమీనా, ఇస్మాయిల్‌. లేడీస్‌ బ్యూటీ ప్రొడక్ట్స్‌ వీక్‌నెస్‌ను అడ్డం పెట్టుకొని.. పెద్ద స్కెచ్ వేశారు. మూడు కోట్లు దోచేశారు. బ్యూటీపార్లర్‌ అంటూ ఘరానా మోసం చేశారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో.. మూడు కోట్లకు పైగా వసూళ్లు చేసి ఈ కిలాడి దంపతులు మాయం అయ్యారు. బ్యూటీపార్లర్‌ ఫ్రాంచైజీలు అంటూ జనాలకు ఎర వేసి.. అందినకాడికి దోచుకున్నారు. ఒక్కో బ్యూటీపార్లర్ ఫ్రాంచైజీ కోసం 3 లక్షల 20 వేలు వసూలు చేశారు. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35వేలు రూపాయలు జీతం ఇస్తామని సమీనా, ఇస్మాయిల్ దంపతులు నమ్మించారు. యూట్యూబ్‌ చానెళ్లలో యాడ్స్ ఇచ్చి మరీ కస్టమర్లను అట్రాక్ట్ చేశారు. ఈ మాయా దంపతుల మాయమాటలు విన్న కొందరు.. మంగళ సూత్రాలు అమ్మి, అప్పు చేసి మరీ.. ఫ్రాంచైజీల కోసం డబ్బులు చెల్లించారు. ఇప్పుడు బాధితులుగా మిగిలారు. వందకు పైగా పార్లర్లు ఓపెన్ చేసి.. 3కోట్లతో ఉండాయించారు. ఫ్రాంచైజీ కోసం డబ్బులు కట్టిన వారికి.. మొదటి మూడు నెలలు జీతాలు చెల్లించిన ఈ కేడీలు.. ఆ తర్వాత చేతులెత్తేశారు. రేపు.. మాపు అంటూ కాలం వెళ్లదీశారు.

జీతాల కోసం ఫోన్‌లు చేస్తే.. స్విచ్ఛాఫ్‌ పెట్టుకున్నారు. అనుమానం వచ్చి.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రగతినగర్ హెడ్ ఆఫీస్‌కు వెళ్లి చూస్తే.. ఆఫీస్‌కు తాళం వేసి ఉంది. మోసపోయామని గ్రహించిన బాధితులు.. బాచుపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో ఈ బ్యూటీ దంపతుల బాధితులు ఉన్నారు. బ్యూటీపార్లర్‌ మోసాలే కాదు.. తీగ లాగితే ఇప్పుడు డొంకంతా కదులుతోంది. ఈ దంపతుల బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. కామారెడ్డి జిల్లాలో చిట్‌ఫండ్ పేరుతో.. ఈ దగుల్బాజీ దంపతులు కోట్ల రూపాయలు మోసం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయ్.