Lover Cheats: ప్రేమించినోడిని నిలువునా ముంచింది.. ఈ లవ్ స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు..
ఏదో కొంత కాలం ప్రేమించిన అమ్మాయి దూరమైతేనే ప్రాణం పోయినట్టు ఫీలువుతుంటారు అబ్బాయిలు. అలాంటిది ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే సర్వం దోచేస్తే.. అవసరాలకు వాడుకుని అడ్డంగా వదిలేస్తే.. ఆ వ్యక్తి బాధ వర్ణనాతీతం. అలాంటి బాధే వచ్చింది శివ్‌భగత్ అనే వ్యక్తికి.
Lover Cheats: ‘అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం పట్టొచ్చు కానీ చాలా సింపుల్‌గా మర్చిపోతారు. అదే అబ్బాయిలు ప్రేమించడానికి తక్కువ టైం పట్టొచ్చు కానీ మర్చిపోడానికి ఒక జీవితం కావాలి’.. నిజానికి ఇది ఓ సినిమాలోని డైలాగ్. కానీ చాలా మంది అబ్బాయిల జీవితంలో ఇదే నిజమవుతోంది. ఏదో కొంత కాలం ప్రేమించిన అమ్మాయి దూరమైతేనే ప్రాణం పోయినట్టు ఫీలువుతుంటారు అబ్బాయిలు.
అలాంటిది ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే సర్వం దోచేస్తే.. అవసరాలకు వాడుకుని అడ్డంగా వదిలేస్తే.. ఆ వ్యక్తి బాధ వర్ణనాతీతం. అలాంటి బాధే వచ్చింది శివ్‌భగత్ అనే వ్యక్తికి. కర్నాటకలోని షాపూర్‌కు చెందిన శివ్‌భగత్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొన్నేళ్ల నుంచి భవిక భొయిర్ అనే మహిళతో ప్రేమలో ఉన్నాడు. భవిక అంటే శివ్‌భగత్‌కు ప్రాణం. కానీ భవిక ప్రేమించింది మాత్రం శివ్‌భగత్‌ను కాదు. అతని డబ్బుని. కానీ ఆ విషయం పాపం శివ్‌భగత్‌కు తెలియదు. రీసెంట్‌గా శివ్‌భగత్‌ను కలవాలంటూ భవిక అతనికి కాల్ చేసింది. వచ్చేటప్పుడు గోల్డ్ రింగ్, గోల్డ్ నెక్లెస్, కాస్ట్లీ షూస్ లాంటి చాలా గిఫ్ట్‌లు కావాలంటూ కోరింది. ప్రేయసి కోరికే ఆదేశంగా ప్రతీ ఒక్కటి తీసుకుని భవిక దగ్గరికి వచ్చాడు శివ్.
ఇద్దరు తన కారులో కూర్చున్నారు. కాస్త దూరం వెళ్లగానే మరో నలుగురు వ్యక్తలు వచ్చి బలవంతంగా కారులో ఎక్కారు. శివ్‌భగత్‌ను తీవ్రంగా కొడుతూ ఓ రెస్టారెంట్‌కు తీసుకువెళ్లారు. అప్పుడు అర్థమైంది అతనికి. ఇదంతా తన ప్రేయసి ప్లానే అని. వేరే వ్యక్తి కోసం ప్రేయసి తనను మోసం చేసిందని. శివ్‌భగత్ తెచ్చిన గిఫ్ట్‌లు అన్నీ తీసుకుని భవిక ఆమె స్నేహితులు పారిపోయారు. రాత్రంతా తీవ్రంగా కొట్టి బట్టలు లేకుండా శివ్‌భగత్‌ను హైవే పక్కన డంప్‌లో పడేశారు. మరుసటి రోజు ఉదయం పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు శివ్‌భగత్‌ను గుర్తించారు. హాస్పిటల్‌కు తరలించి విషయం తెలుసుకున్నారు. నాలుగు రోజుల పాటు ట్రోమాలో ఉన్న శివ్‌భగత్ తేరుకున్న తరువాత చెప్పిన మాటలు పోలీసులతో కూడా కంటతడి పెట్టించాయి.
భవిక కోసం తాను లక్షలు ఖర్చు చేసినట్టు చెప్పాడు శివ్‌భగత్. తన కోసం షాపూర్‌లో ఇల్లు కూడా కట్టించానని, తన కోరికే ఆదేశంగా అన్నీ సమకూర్చానని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ భవిక మాత్రం వేరే వ్యక్తి కోసం తనను వదిలేసిందని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు భవికతో పాటు ఆమె ఫ్రెండ్‌ను అరెస్ట్ చేశారు. మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఆలస్యంగా బయటికి వచ్చిన ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. అంతలా ప్రేమించిన వ్యక్తిని మోసం చేసిందంటే ఆమె మనిషి కాదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.