Yogi Adithyanath: మళ్లీ పంజా విసిరిన యోగి.. మరో డాన్‌ ఖతమ్‌..

యూపీలో తుపాకీ శబ్దాలకు బ్రేక్‌లు కనిపించడం లేదు. ఉమేష్‌ పాల్ కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి అంతు చూస్తామని అసెంబ్లీ వేదికగా వార్నింగ్ ఇచ్చి మరీ.. ఒక్కొక్కరిని లేపేస్తున్నారు సీఎం యోగి. ఈ కేసులోనే అరెస్ట్ అయి జైలు నుంచి బయటకు వస్తున్న అతీక్ అహ్మద్‌పై కాల్పులు జరిపిన ఘటన.. ఇప్పటికీ కళ్లముందే తిరుగుతోంది అందరికీ ! మాఫియాను కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామని పదేపదే చెప్తున్న యోగి.. మ్యాన్ ఆన్ యాక్షన్ అనిపిస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 4, 2023 | 06:00 PMLast Updated on: May 04, 2023 | 6:00 PM

Yogi Adithyanath Attack On Gangster Culture

నేరస్థుల గుండెల్లో నిద్రపోతున్నాడు. తప్పు చేయడం కాదు.. ఆ ఆలోచన రావాలన్నా వెన్నులో వణుకు పుట్టాలనే రేంజ్‌లో భయపెడుతున్నారు యోగి. మాజీ ఎంపీ, మాఫియా డాన్ అతీక్ అహ్మద్ ఘటన మర్చిపోక ముందే.. ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‭స్టర్ ఎన్‭కౌంటర్ జరిగింది. భయంకరమైన గ్యాంగ్‭స్టర్ అనిల్ దుజానాను యూపీ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఖతమ్ చేశారు. అనిల్‌ దుజానాది.. గౌతంబుద్ధనగర్ జిల్లాలోని బదలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దుజానా గ్రామం. అతని అసలు పేరు అనిల్ నగర్. అతని మీద 62 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 18కేసులు అత్యంత తీవ్రమైన నేరాలకు సంబంధించినవి. వెస్ట్‌ యూపీ ఏరియాకు చెందిన అనిల్ దుజానాపై.. హత్యలు, దోపిడీలు, భూదందా, కిడ్నాప్ వంటి అనేక తీవ్ర నేరాలు చాలానే ఉన్నాయి.

రాష్ట్రంలోని మాఫియాను మట్టిలో కలిపేస్తానని అసెంబ్లీ సాక్షిగా యోగి ఆదిత్యనాథ్ శపథం చేశారు. చెప్పినట్టుగానే గ్యాంగ్‌స్టర్ల వేట కొనసాగిస్తున్నారు. అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ఎన్‭కౌంటర్ తర్వాత.. రాష్ట్ర టాస్క్‭ఫోర్స్ పోలీసులు చేసిన రెండవ పెద్ద ఎన్‭కౌంటర్ ఇదే. డిసెంబర్ 2022లో అనిల్ దుజానాను ఢిల్లీ పోలీసులు మయూర్ విహార్ ప్రాంతంలో అరెస్టు చేశారు. దుజానాపై 50వేల రివార్డు ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్‌లో అనిల్ దుజానా ఉన్నాడు. నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌, గూండా యాక్ట్‌తో సహా చాలా అభియోగాల్లో దుజానాపై కేసులు నమోదు చేశారు. కొన్ని కేసుల్లో హాజరుకాకపోవడంతో కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది.

బాదల్‌పూర్ కోర్టు దుజానాకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అనిల్ దుజానాపై మొదటి కేసు 2002లో నమోదైంది. తర్వాత అతను నరేష్ భాటి గ్యాంగ్‌లో చేరాడు. సుందర్ భాటిని నరేష్ భాటి చంపి తనకు తాను డాన్‌గా ప్రకటించుకున్నాడు. దాదాపు పదేళ్లుగా ఆడింది ఆట అన్నట్లుగా దారుణాలకు తెగించాడు దుజానా. యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇన్నాళ్లుకు దుజానా పాపం పండింది. ఎన్‌కౌంటర్‌లో లేచిపోయాడు. దీంతో యోగి పాలన తీరుపై.. ఇప్పుడు మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.