Youtube: ఇంస్టాలో పరిచయం – యూట్యూబ్ చూసి ప్రసవం – పొత్తిళ్లలోని పసిపాప మృతి..!

15 ఏళ్ల గర్భిణీ బాలిక తన బిడ్డను జన్మనివ్వడం కోసం యూట్యూబ్ వీడియోలు చూసి, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శుక్రవారం తన సొంత బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఏడ్చినా కూడా ఇరుగుపొరుగు వారికి తెలియకుండా ఉండేందుకు బెల్టుతో గొంతు కోసి చంపేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2023 | 07:13 PMLast Updated on: Mar 06, 2023 | 7:13 PM

Youtube Instagram Killed Baby

ప్రస్తుత యుగంలో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఇదే అదునుగా భావించి కొందరు వింత చేష్టలు, విభిన్న అభిప్రాయాలు పంచుకుంటారు. సామాజిక మాధ్యమం అంటే ఎవరికి తోచిన విధంగా వారు ఉండేందుకు.. అలా ఉన్న విషయాన్ని బహిర్గతం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న వేదికలాగా అయిపోయింది. ఇది ఇంతటితో ముగిస్తే బాగానే ఉండేది. కానీ ఏపాపం తెలియని ఒక ప్రాణాన్ని బలిపెట్టింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యూ ట్యూబ్ అనగానే ఆ లోగో మన ఊహకు గుర్తుకొచ్చేస్తుంది. అందులో ప్రపంచంలోని అన్ని అంశాలు ఉంటాయన్న విధంగా సర్చ్ చేస్తూ ఉంటాం. అదొక అపోహ అని గుర్తించం. ఎవరైనే చేసి అందులో అప్లోడ్ చేస్తేనే వస్తాయని అలా ఉన్న వీడియోలన్నీ హేతుబద్దమైనవి కాదనే అవగాహన చిన్న వయసు వారికి ఉండదు. ఇలాగే ఒక ప్రయోగం చేసి అది వికటించింది. ఆప్రయోగం ఏ వంట గురించో.. సినిమా వివరాల గురించో కాదు. కాన్పు ఎలా చేయాలన్న దానిపై అవగాహన పెంచుకునేదుకు ప్రయత్నించింది. ఆ మైనర్ బాలిక పైత్యానికి పొత్తిళ్లలోనే పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.

ఈ మానవీయ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. అంబజారీ ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికకు సామాజిక మాధ్యమం ఇన్ స్టా గ్రామ్ లో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. మాట మాట కలిసి లైంగికంగా ఒక్కటైయ్యారు. దీని ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా రకరకాల మాయమాటలు చెబుతూ దాటవేస్తూ వచ్చింది. క్రమక్రమంగా బాలిక పొట్ట పెరగడం గమనించిన తల్లి కూతురిని గట్టిగా అడిగింది. ఏదో అనారోగ్య సమస్య కారణంగా ఇలా ఉందని చెప్పి అప్పటికి తప్పించుకుంది ఆబాలిక. కొన్ని నెలలు గడవడంతో తాజాగా బాలిక ప్రసవానికి సమయం దగ్గరపడింది. ప్రసవ వేదన భరించలేక తన గర్భంలోని బిడ్డను ఎలా బయటకు తీయాలో తెలుసుకునేందుకు యూట్యూబ్ చూసి తెలుసుకుంది. తాజాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పాప ఎక్కడ ఏడుస్తుందో అన్న అనుమానంతో బెల్ట్ తో గొంతు నులిమి చంపేసింది. అలా నిశ్శబ్దంగా పడిపోయిన బిడ్డను సంచిలో వేసి టెర్రస్ మీద వదిలివేసింది. శుక్రవారం రాత్రి ఓ మాల్‌లో పనిచేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మైనర్‌ తల్లి గదిలో పలుచోట్ల రక్తపు మరకలను చూసి ఆశ్చర్యపోయింది. అలాగే ఆమె కూతురు పాలిపోయి అలసిపోయినట్లుగా కనిపించింది. అప్పటికీ కూడా మైనర్ బాలిక నిజాన్ని చెప్పకుండా తన ఋతుస్రావం కారణంగా రక్తపు మరకలు వచ్చాయని తల్లికి చెప్పింది. తల్లి వెంటనే తన కూతురిని ఆసుపత్రికి తరలించింది. అక్కడి వైద్యులు అంబజారి పోలీసులకు విషయాన్ని అందించారు.

maharastra minor rape

maharastra minor rape

తన అమ్మాయి ఫోన్‌లో ఎక్కువ సమయం గడిపేదని పోలీసులకు చెప్పింది. దీనిపై పోలీసులు ఆరాదీయడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. మైనర్ బాలిక కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఠాకూర్‌ అనే అబ్బాయిని కలుసుకుంది. అతనితో చాట్ చేయడం ప్రారంభించింది. ఆమెకు అతని పూర్తి పేరు, చిరునామా తెలియదు. అతని గురించి ఎటువంటి వివరాలను అందించలేకపోయింది అని చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులను ఈకేసును ముందుకు తీసుకుపోయేందుకు పెద్ద సమస్యగా మారింది. ఠాకూర్ ఎల్లప్పుడూ మెసెంజర్ మరియు వాయిస్ కాల్స్ ద్వారా ఆమెతో కమ్యూనికేట్ చేయడంతో, అతనిని ట్రేస్ చేయడానికి అతని మొబైల్ నంబర్ కూడా పోలీసులకు అందుబాటులో లేదు. మైనర్‌ను కలవాలని ఆ వ్యక్తి స్నేహం చేస్తున్నాడనే సాకుతో ప్రలోభపెట్టాడని పోలీసులు తెలిపారు. ఠాకూర్ ఒకసారి ఆమెను స్నేహితురాలి ప్రదేశానికి తీసుకెళ్లాడు, అక్కడ ఆమెను బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశాడని బాలిక చెప్పినట్లు వెల్లడించారు. మైనర్ తన ఋతు చక్రం గురించి అడిగినప్పుడల్లా తన తల్లికి చూపించడానికి శానిటరీ నాప్‌కిన్‌ల బ్యాగ్‌లను సిద్ధంగా ఉంచుకునేదని తెలిసింది. మైనర్ యొక్క ఉబ్బిన పొత్తికడుపు గురించి కొంతమంది పొరుగువారు రకరకాలుగా మాట్లాడుకున్నప్పటికీ బాలిక తనకు రుతుక్రమం సమస్య అని చెప్పుకొచ్చినట్లు అంబజారి పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ ఇన్‌స్పెక్టర్ గజానన్ కళ్యాణ్కర్ చెప్పారు.

ఇక్కడ తప్పు పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం కాదు. వారిని గమనించకపోవడం. పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు. ఏమి చేస్తున్నారన్న అవగాహన తల్లిదండ్రుల్లో లేకపోవడం. అలాగే ఏమి చూడాలి ఏమి చూడకూడదు అన్న కనీస ఇంకితం అమ్మాయికి లేకపోవడం. పోనీ కాన్పుకు సంబంధించిన వీడియోలు చూసేంత మానసిక పరిపక్వత పరాయివాళ్లతో కలిసేటప్పుడు ఉండి ఉంటే బాగుండేది. ఇలాంటి పరిస్థితికి కారణం అయి ఉండేది కాదు. అలాగే కూతురి గర్భం పరిమాణం రోజు రోజుకూ పెరుగుతున్నప్పటికీ తల్లి డాక్టర్లను సంప్రదించకుండా నిర్లక్ష్యం చేయడం. పైగా నిండు గర్భంతో ఉన్న కూతురిని ఒంటరిగా వదిలేసి వెళ్లడం. అవగాహనా లేమికి, నిర్లక్ష్యానికి, సామాజిక మాధ్యమానికి అమాయకమైన నిండు ప్రాణం బలికావల్సి వచ్చింది. ఇంతటి పరిస్థితులు తలెత్తడానికి కారణమైన ఆ సోషల్ మీడియా పరిచయస్తుడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు.

 

 

T.V.SRIKAR