Train Accident: రైలు ప్రమాదంపై జగన్ ప్రశ్నల వర్షం..!
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తనను బాధించిందని.. ఒక రైలును మరో రైలు ఢీకొట్టిందని.. రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయని.. ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని స్పష్టమైన ప్రశ్నలకు దారి తీస్తుందంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు జగన్.
Train Accident: విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడడ్డాయ్. ఈ ఘటనలో పలువురు చనిపోగా.. పదుల సంఖ్యలో గాయాలపాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైలు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని.. మరణాలు సంభవించడం బాధాకరమని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అందులో కొన్ని అనుమానాలను లేవనెత్తారు.
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తనను బాధించిందని.. ఒక రైలును మరో రైలు ఢీకొట్టిందని.. రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయని.. ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని స్పష్టమైన ప్రశ్నలకు దారి తీస్తుందంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు జగన్. బ్రేకింగ్ సిస్టమ్, అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు.. సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది.. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా ఫెయిల్ అయింది.. వీటిపై నిజనిజాలు తెలుసుకోవాలని కోరారు. ఈ అంశాలపై ప్రధానిని, రైల్వే మంత్రిని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు జగన్. భవిష్యత్తులో ఇలాంటి విధ్వంసకర ప్రమాదాలు జరగకుండా చూసేందుకు.. ఈ లైన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఈ అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ట్వీట్ చేశారు జగన్.
తన ఆలోచనలు, ప్రార్థనలు వారి ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో ఉన్నాయని.. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణ అందించేలా తమ ప్రభుత్వం కొనసాగుతుందని జగన్ ట్వీట్ చేశారు. సీఎం జగన్ ఇలా ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేయడం.. హాట్‌టాపిక్‌గా మారింది.