ఎక్కడెక్కడో తాకుతూ నన్ను.. బెహరా ఏం చేశాడంటే…

ఆదర్శంగా ఉండాల్సిన సినిమా వాళ్ళే గాడి తప్పుతున్నారు. తమ సినిమాలతో మంచి సందేశాలు ఇవ్వాల్సిన నటులే తప్పటి అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఆశలతో, కష్టాలతో సిన్నిమా పరిశ్రమలో అడుగు పెట్టిన నటులు, ఇతరత్రా సిబ్బంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2024 | 07:40 PMLast Updated on: Dec 18, 2024 | 7:40 PM

ఎక్కడెక్కడో తాకుతూ నన్ను

ఆదర్శంగా ఉండాల్సిన సినిమా వాళ్ళే గాడి తప్పుతున్నారు. తమ సినిమాలతో మంచి సందేశాలు ఇవ్వాల్సిన నటులే తప్పటి అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఆశలతో, కష్టాలతో సిన్నిమా పరిశ్రమలో అడుగు పెట్టిన నటులు, ఇతరత్రా సిబ్బంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమాన్ను కూడా షేక్ చేసింది. ఆయన ఏదో చేసారు అంటూ ఆయన అసిస్టెంట్ కేసు పెట్టింది. ఆ తర్వాత జానీ మాస్టర్ బెయిల్ కోసం నానా కష్టాలు పడ్డారు.

ఇప్పుడు మరో నటుడు ప్రసాద్ బెహరాపై కూడా కేసు నమోదు అయింది. తనను రేప్ చేయాలని చూసాడు అంటూ ఓ హీరోయిన్ కేసు పెట్టింది. దీనితో ఈ రోజు మధ్యాహ్నం లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వెబ్ సీరీస్ యాక్టర్ ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రసాద్ బేహేరాను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. ప్రసాద్ బేహేరా తో వెబ్ సీరీస్ లో బాధితురాలు నటించింది. గత కొన్ని రోజులుగా లైంగికంగా వేడిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

వెబ్ సీరీస్ లు చేస్తున్న ప్రసాద్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. అతని టైమింగ్ కు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం సినిమాల్లో ఛాన్స్ లు కూడా కొట్టేస్తున్నాడు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. షూటింగ్ సమయంలో యువతి ప్రైవేట్ భాగాలను తాకుతూ ప్రసాద్ బెహరా అవమానించాడు. ప్రసాద్ బెహ్ర వేధింపులపై జూబ్లీహిల్స్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. ప్రసాద్ బెహరా పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసారు. 75(2),79,351(2)BNS సెక్షన్స్ కింద కేసు నమోదు చేసారు పోలీసులు.

నీ బ్యాక్ బాగుందని కామెంట్ చేసాడట ప్రసాద్. అంతటితో ఆగకుండా అందరి ముందు అసభ్య వ్యాఖ్యలు చేసినట్టు హీరోయిన్ కాంచనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రసాద్ బెహరా ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా… కోర్ట్ అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. విడాకులు, పెళ్లి వారమండి, మెకానిక్ వెబ్ సిరీస్ లతో ప్రసాద్ కు మంచి ఇమేజ్ వచ్చింది. ఇటీవల రిలీజయిన కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నటుడిగా కెరీర్ లో సినిమాల్లో ఫస్ట్ హిట్ కొట్టాడు. అతని కామెడికి యూత్ ఫిదా అవుతారు.