చిరంజీవిని వణికిస్తున్న ఆ దర్శకుడు.. పెద్దాయన్ని అలా టెన్షన్ పెట్టకండ్రా బాబూ..!

చిరంజీవి సినిమాలు చేసిన చేయకపోయినా ఆయనకు పెద్దగా ఇప్పుడు వచ్చేది లేదు పోయేది లేదు. ఇప్పటికే సాధించాల్సిన రికార్డులు ఎన్నో సాధించాడు మెగాస్టార్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2025 | 06:50 PMLast Updated on: Mar 06, 2025 | 6:50 PM

చిthat Director Who Is Making Chiranjeevi Nervous

చిరంజీవి సినిమాలు చేసిన చేయకపోయినా ఆయనకు పెద్దగా ఇప్పుడు వచ్చేది లేదు పోయేది లేదు. ఇప్పటికే సాధించాల్సిన రికార్డులు ఎన్నో సాధించాడు మెగాస్టార్. ఎవరికి సాధ్యం కానీ సంచలనాలు సృష్టించాడు చిరంజీవి. అయినా కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నాడు చిరంజీవి. అది కేవలం అభిమానుల కోసమే.. అందులో ఆయన స్వార్థం కూడా ఉంది.. ఈ జనరేషన్ దర్శకులతో పనిచేస్తే తాను కూడా వయసు తగ్గించుకోవచ్చు అని చూస్తున్నాడు చిరంజీవి. కాకపోతే ఇప్పుడున్న దర్శకులు మేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కొన్నిసార్లు సీనియర్ హీరోలకు అది మింగుడు పడకపోవచ్చు. కంటెంట్ వర్కౌట్ అయితే ఎవరు ఏమి మాట్లాడరు కానీ అదే మిస్ ఫైర్ అయితే మాత్రం ఓ రేంజ్ లో ఆడుకుంటారు. చిరంజీవినిప్పుడు కంగారు పెడుతున్న విషయం అదే.

వశిష్ట దర్శకత్వంలో ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఇది విడుదలకు ముందే బాగా ట్రోల్ అవుతుంది. కథ నచ్చడంతో కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడిని నమ్మి ఈ సినిమా ఇచ్చాడు మెగాస్టార్. రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ ముందుగానే సోషల్ మీడియాలో ట్రోలర్స్ కు మంచి స్టఫ్ ఇచ్చింది విశ్వంభర. అందుకే రాబోయే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేశాడు చిరంజీవి. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక పర్ఫెక్ట్ మాస్ సినిమా చేయాలని చూస్తున్నాడు చిరంజీవి. దీని మీద ఎవరికి పెద్దగా కంప్లైంట్స్ లేవు. వింటేజ్ చిరంజీవిని చూపించాలని అనిల్ ఫిక్స్ అయిపోయాడు. ఇందులో కొత్త కథనాలు ఉంటాయని కూడా ఎవరు అనుకోవడం లేదు. తెలిసిన పాత కథలే కొత్తగా ఎంటర్టైనింగ్ గా చెప్పాలని చూస్తున్నాడు అనిల్.

చిరంజీవిని టెన్షన్ పెడుతున్న సినిమా అనిల్ రావిపూడిది కాదు. ఆ తర్వాత ఆయన కమిటైన దర్శకుడిదే ఈ కంగారు అంతా. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడు. ఇది ఎలా ఉండబోతుందో అని తలుచుకుంటేనే మెగా ఫ్యాన్స్ వణికిపోతున్నారు. అదేంటి శ్రీకాంత్ మంచి డైరెక్టర్ కదా అనుకోవచ్చు.. కానీ మనోడు ఎంత మంచి దర్శకుడో.. అంత మెంటల్ దర్శకుడు కూడా..! దసరా సినిమానే ఓ రేంజ్ లో తీసిన శ్రీకాంత్.. ఇప్పుడు నానితో పారడైజ్ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఏకంగా బూతులు పెట్టేశాడు. ఈ సినిమా తర్వాత రాబోయే సినిమా అంటే అంచనాలు కూడా మామూలుగా ఉండవు. పైగా అక్కడున్నది మెగాస్టార్ చిరంజీవి.. ఆ సినిమాలో కూడా శ్రీకాంత్ ఓదెల ఇలాగే తెగిస్తే బాక్సాఫీస్ దగ్గర ఏరుకోడానికి రికార్డుల ముక్కలు కూడా దొరకవు. అలా కాదని ఏదైనా మిస్ ఫైర్ అయింది అంటే మాత్రం చిరంజీవి సినిమాలు చేసినన్ని రోజులు గుర్తు చేసుకొని మరి ట్రోల్ చేస్తారు. అందుకే పెద్దాయనను టెన్షన్ పెట్టకుండా కథ, కథనాలు చూసుకొని రంగంలోకి దిగాలి అంటూ శ్రీకాంత్ ఓదెలకు మెగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.