దీనమ్మ జీవితం… ఒక్క పోస్టర్ తో మెగా గ్లోబల్ ఛేంజ్…
పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ అందనంత ఎత్తుకు ఎదిగాడు. తర్వాత పుష్ప వల్ల అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారాడు. ఆతర్వాత త్రిబుల్ ఆర్ పుణ్యమాని ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ అయ్యారు. కాకపోతే రాజమౌళి సపోర్ట్ లేకుండా పాన్ ఇండియాని షేక్ చేయగలనని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు.
పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ అందనంత ఎత్తుకు ఎదిగాడు. తర్వాత పుష్ప వల్ల అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారాడు. ఆతర్వాత త్రిబుల్ ఆర్ పుణ్యమాని ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ అయ్యారు. కాకపోతే రాజమౌళి సపోర్ట్ లేకుండా పాన్ ఇండియాని షేక్ చేయగలనని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పడు రామ్ చరణ్ వంతొచ్చింది. కాని గేమ్ ఛేంజర్ విషయంలో దేవరతో పోల్చే పరిస్థితే కనిపించట్లేదు. శంకర్ మేకింగ్ మీద జనాలకు నమ్మకం పోయింది. కాబట్టే గేమ్ ఛేంజర్ రిలీజ్ కి ముందే మరో భారతీయుడు 2 అనేస్తున్నారు. అసలు గేమ్ ఛేంజర్ పాటలు మెగా ఫ్యాన్స్ తప్ప ఇంకెవ్వరికీ నచ్చట్లేదనేలా కామెంట్లు పెరిగాయి. దిల్ రాజు టీం కూడా ఇచ్చే అప్ డేట్లు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంట్రస్టింగ్ గా లేదనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఒక్క ఫోటో, ఒకే ఒక్క ఫోటో మెగా ఫ్యాన్స్ కి ఊపు తెచ్చింది. రంగస్థలం రేంజ్ లో పూనకాలకు కారణమౌతోంది… మెగా గ్లోబల్ స్టార్ మీద మొన్నటి వరకు జాలి పడ్డ బ్యాచే, ఏదో జరిగేలా ఉందనే డౌట్ తో కూడా చూస్తున్నారు.. ఓవరాల్ గా ఇండస్ట్రీతో పాటు సీనీ జనాల్లో ఛేంజ్ అయిన గేమ్ ఏంటో చూసేయండి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ మూవీ అంటే మొదట్లో గొప్ప డిసీజన్ అన్నారు. ఇప్పుడేమో చరణ్ ని చూసి అంతా జాలి పడుతున్నారు. తన తోటి హీరో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ హిట్ తర్వాత దేవరతో తానేంటో పాన్ ఇండియా మార్కెట్ కి తెలియ చేశాడు. పాన్ ఇండియా టైగర్ గా మారిపోయాడీ మ్యాన్ ఆఫ్ మాసెస్.
పుష్ప 2 తో బన్నీ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. ప్రభాస్ అయితే టచ్ చేయలేని రేంజ్ లో పాన్ ఇండియా కింగ్ అయ్యాడు. ఎటొచ్చి రామ్ చరణే ఇంకా పాన్ ఇండియా లెవల్లో తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన స్టేజ్ లో ఉన్నాడు..
గేమ్ ఛేంజర్ పాటలు పర్లేదు… కాని శంకర్ మేకింగ్ లో వస్తున్న సినిమా కావటం వల్లే, మెగా ఫ్యాన్స్ కి కూడా కోట్లల్లో డౌట్లున్నాయి. ఇదేదో చరన్ మీద బురద చల్లే యాంటీ ఫ్యాన్స్ మాటల్ని రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం కాదు కాని, శంకర్ రోబో తర్వాత వరుసగా ఫ్లాపులు ఫేస్ చేసిన దర్శకుడు. భారతీయుడు 2 ఫ్లాప్ తో శంకర్ కి మైండ్ పోయిందా అనేంతగా కామెంట్లు వచ్చాయి.
అందుకే గేమ్ ఛేంజర్ కూడా పోయినట్టే అని అన్నారు. ఆ కామెంట్లకు కంగురు పడే, భారతీయుడు 2 ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ మీద ఉండొద్దనే విడుదలని సంక్రాంతికి వాయిదా వేశారు. కట్ చేస్తే లుంగీ లుక్ తో చరణ్ పోస్టర్ మతిపోగొడుతోంది.
రంగస్థలం రామ్ చరణ్, ముఠామేస్త్రీ చిరు డేస్ ని గుర్తుకు తెస్తున్నాయి. ఇంతవరకు కలెక్టర్ గా, లేదంటే జరగండి సాంగ్ లో లో క్లాసీ డాన్సర్ గా గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ వచ్చాయి. ఇన్నాళ్లకి మెగా ఫ్యాన్స్ కే కాదు మాస్ ని ఎట్రాక్ట్ చేసేలా సాలిడ్ అప్ డేట్ వచ్చింది
రైలు పట్టాల మీద లుంగి లుక్ లో చరణ్ అప్పియర్సెస్ అదిరిపోయింది. ఈ నెల 9న టీజర్ రిలీజ్ అంటూ వదిలిన అప్ డేట్ తో ఒక్కసారిగా వైబ్రేషన్సే మారిపోయాయి. ఎంత శంకర్ డైరెక్షన్ లో సినిమాలు ప్లాపవుతున్నా, తనకి సాలిడ్ కథ దొరికితే పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే. ఆ కోణం లో చూస్తే గేమ్ ఛేంజర్ మూవీ కథ రాసింది మాత్రం శంకర్ కాదు. పిజ్జా ఫేం కార్తిక్ సుబ్బరాజ్. దీనికి తోడు దిల్ రాజు టీం కూడా గేమ్ ఛేంజర్ కథ, ఫైనల్ ఔట్ పుట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది..
సో అలా చూస్తే మెగా గ్లోబల్ స్టార్ మీద పాన్ ఇండియా లెవల్లో పెరిగిన జాలికి, ఇప్పుడు తన లుంగి గెటప్ తోడైంది. మాస్ ఆడియన్స్ కి ఇది ఏమాత్రం రీచైనా, తిరుగుండదనే మాటే వినిపిస్తోంది.