దేవరని కాపీ కొట్టబోయారు… ఏమైంది? సీన్ రివర్స్..
నవ్విన నాపచేనే పండింది... వెక్కిరించిన బ్యాచే వెనక ఫాలో అయ్యింది.. లాంటి సామెతలు ఎన్ని విన్నా... అవి రియల్ లైఫ్ లో జరిగితే ఆ కక్కే వేరు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర విషయంలో అవే నిజమౌతున్నాయి.
నవ్విన నాపచేనే పండింది… వెక్కిరించిన బ్యాచే వెనక ఫాలో అయ్యింది.. లాంటి సామెతలు ఎన్ని విన్నా… అవి రియల్ లైఫ్ లో జరిగితే ఆ కక్కే వేరు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర విషయంలో అవే నిజమౌతున్నాయి. తన దేవర మూవీని దేశం అంతా మెచ్చుకుంటుంటే, అరవ అడ్డాలో థియేటర్స్ సమస్య ఎదురైంది. మన మాస్ ఫార్ములా మీద అరవ అడ్డాలో కాస్త వ్యతిరేక ప్రచారమే జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు దేవర పాన్ ఇండియా సక్సెస్ కి మాస్ సొల్యూషన్ గా మారింది. అదే ఎలా అని, యాజ్ ఇట్ ఈజ్ కంగువా టీం కాపీ కొట్టబోయింది. అచ్చంగా దేవర లానే థియేటర్స్ మీద భారీగా దండెత్తాలనుకుంది. కాని టాలీవుడ్, బాలీవు్డ సంగతి అటుంచితే, సొంతగడ్డ అరవ అడ్డాలోనే కంగువాకి పంచ్ పడింది. ఇక పులిని చూసి ఎవరు వాతలు పెట్టుకున్నా, వాతలే మిగులుతాయి కాని, కలెక్షన్ల కోతలు కష్టమే అని ఎన్నోసార్లు తేలింది.. దేవరని అనుకరిస్తున్న కంగువాకి, కాలం కన్నెర్ర చేసిందా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ని లైట్ తీసుకున్న అరవ తంబీలకు, అరవ అడ్డాలోనే అద్రుష్టం ఆవిరైందా? వాళ్ల వాతలతో తేలిందేంటి?
పాన్ ఇండియా లెవల్లో తెలుగు హీరోలు, దర్శకుడు బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటే, అరవ తంబీలు తమ నెంబర్ ఎప్పుడొస్తుందని వేయిట్ చేస్తున్నారు. లియో, గోట్, వెట్టయాన్, విక్రమ్, ఇలా ఎన్ని తమిళ హిట్లొచ్చినా, అరవ అడ్డావరకు వాల్ల దరువు పరిమితం.. కాని దేవర, కల్కీ, సలార్, త్రిబుల్ ఆర్ ఇలా రీసెంట్ హిట్ లనుంచి బాహుబలి వరకు కనీసం ఒక్క సినిమానంటే ఒక్క సినిమాను టచ్ చేయలేకపోయారు అరవతంబీలు
ఇంతవరకు వెయ్యికోట్లు రాబట్టలేదనే ఫ్రస్ట్రేషన్ ఒక వైపు, తెలుగు సినిమాలు వేల కోట్లను ఈజీగా కొల్లగొట్టేస్తున్నాయనే అసూయ మరో వైపు.. వాళ్లని ఆలోచనల్లో పడేసింది. మరి అరవ అడ్డాలో ఆడియన్స్ ఇలానే ఆలోచిస్తున్నారే ఏమో కాని, దేవర, సలార్, కల్కీ మూవీల విషయంలోనే కాదు త్రిబుల్ ఆర్ దూసుకెళుతున్నటైంలో కూడా ఈ మూవీలను సోసోగా ఆదరించారు
బేసిగ్గా తమిళ జనం తమ భాష, తమ సంస్క్రుతి, తమ జీవితలే ఓ లోకంగా బతికేస్తారనే కామెంట్ ఉంది. మరోకరిని ఆదరించరు, పొరుగు సరుకుని కొనరనే కామెంట్లు కూడా ఉన్నాయి. దేవరని కూడా ఇలానే అసూయతో దూరం పెట్టారన్నారు. కొందరు థియేటర్స్ విషయంలో ఇబ్బంది పెడితే, అక్కడి ఆడియన్స్ కూడా దేవర లాంటి మాస్ ఫార్ములా మూవీలకు దూరం అన్నట్టు బిల్డప్ ఇచ్చారు
కాని అక్కడ మాస్ మూవీల్లో సరుకెంత ఉంటుందో, గత పేదల్ల లిస్ట్ తీస్తే తెలుస్తుంది.. ఇన్ని చెప్పి మళ్లీ దేవర దారిలోనే నడిస్తే ఎలా? ఇప్పుడదే జరుగుతోంది. దేవరలానే ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ కోసం 8 వేల థియేటర్స్ లో రిలీజ్ ప్లాన్ చేసిందట కంగువా టీం.
కాని అరవ అడ్డాలో శివకార్తికేయన్ మూవీ అమరన్ ఇంకా దూసుకెళుతుండటంతో, తన మాత్రు పరిశ్రీమలోనే కంగువాకు 50శాతం మించి థియేటర్స్ దొరకట్లేదట. అంతేకాదు కంగువ వసూల్లలో 75 శాతం షేర్ ఇవ్వాలనే కండీషన్ నిర్మాత పెట్టడంతో కూడా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కంగువాకి దూరం జరుగుతున్నారని తెలుస్తోంది. ఓవర్ సీస్ లోకూడా కంగువ రిలీజ్ తోపాటు, అడ్వాన్ బుకింగ్, ఇలా అన్నీంట్లో దేవర అడుగు జాడల్లోనే నడుస్తోంది.
ఎంతైనా దేవర కామెంట్లు, ట్రోలింగ్స్ తట్టుకుని నార్త్ ఇండియాని, యూఎస్ మార్కెట్ ని శాసించాడు. కాబట్టే దేవర ఫార్ములానే కంగువా టీం ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. కాని ఎగ్జిక్యూషనే సరిగా లేదనేకామెంట్లు పెరిగాయి. ఏదేమైనా దేవరనే చిన్న చూపు చూసిన అరవ జనం ఇప్పుడు అదే దేవరని మార్కెటింగ్ విషయంలో మక్కీకి మక్కీ కాపీ కొట్టడం వింతగా ఉందనే కామెంట్స్ పెరుగుతున్నాయి.