పవన్ ఈజ్ బ్యాక్, డిప్యూటి సిఎం టూ పవర్ స్టార్…

కొందరి సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం ఉండదు. సినిమా వస్తే అదే పది వేలు. ఆ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు డిప్యూటి సిఎం కావడంతో ఆయన పెద్దగా దృష్టి పెట్టడం లేదు గాని...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 20, 2024 | 12:55 PMLast Updated on: Sep 20, 2024 | 12:55 PM

పవన్ ఈజ్ బ్యాక్ డిప్యూటి

కొందరి సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం ఉండదు. సినిమా వస్తే అదే పది వేలు. ఆ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు డిప్యూటి సిఎం కావడంతో ఆయన పెద్దగా దృష్టి పెట్టడం లేదు గాని… సినిమాల విడుదల కోసం ఆయన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు విడుదల చేస్తారు సార్ అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ను వేడుకుంటున్నారు. మీడియాలో ఎక్కువగా కనపడుతున్నా… సినిమాల విషయంలో మాత్రం పవన్ ఫోకస్ పెట్టాల్సిందే అనే డిమాండ్ లు వస్తున్నాయి.

ఏకంగా మూడు సినిమాలను పవన్ కళ్యాణ్ లైన్ లో పెట్టాడు. ఆ సినిమాలు మూడేళ్ళ నుంచి జనాల్లో నానుతున్నాయి గాని సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో క్లారిటీ లేదు. ఇటీవల మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఇంటికి మూడు సినిమాల డైరెక్టర్ లు నిర్మాతలు వెళ్లి కలిసారు. ఈ నెల 15 నుంచి సినిమాల రీ షూట్ ఖాయం అనుకున్నారు. కాని విజయవాడ వరదలతో ఆలస్యం అయింది. ఇప్పుడు మళ్ళీ పవన్ ఇంటికి వెళ్ళారు దర్శకులు నిర్మాతలు. హరిహర వీరమల్లు టీం పవన్ ఇంటికి వెళ్ళింది. మిగిలిన షూట్ పూర్తి చేయాలని కోరింది.

దీనికి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. వచ్చే నెల 5 నుంచి షూట్ కి వస్తాను అని ఏది ఏం జరిగినా షూట్ పూర్తి చేస్తా అని పవన్ కళ్యాణ్ వారికి సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం. ఇక ఈ నెలలోనే హరి హర వీరమల్లు నుంచి ఒక లుక్ లేదా ఒక వీడియో విడుదల చేయాలని పవన్ ను చిత్ర యూనిట్ కోరింది. స్టార్ హీరోల సినిమాలు అన్నీ లైన్ లో ఉన్నాయని ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదని… మీరు ఓకే అంటే డిసెంబర్ మొదటి వారంలో సినిమా విడుదల చేద్దాం అని కూడా అడిగారట. దీనికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. మరి షూట్ లో ఎప్పుడు పాల్గొంటారు అనేది చూడాలి.