పాపం దుబాయ్ ఫ్యాన్స్, పుష్ప 2లో ఆ సీన్ కట్
అందరూ ఊహించినట్టుగానే పుష్ప 2 సినిమాలో జాతర సీన్ మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ కు కూడా పూనకాలు తెప్పిస్తోంది. ఆ సీన్ లో అల్లు అర్జున్ తాండవం ఆడాడు. అలాగే ఆ సీన్ లో యాక్షన్ ను ఓ రేంజ్ లో చూపించాడు సుక్కు.
అందరూ ఊహించినట్టుగానే పుష్ప 2 సినిమాలో జాతర సీన్ మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ కు కూడా పూనకాలు తెప్పిస్తోంది. ఆ సీన్ లో అల్లు అర్జున్ తాండవం ఆడాడు. అలాగే ఆ సీన్ లో యాక్షన్ ను ఓ రేంజ్ లో చూపించాడు సుక్కు. హీరో నటన ఇప్పటివరకు ఏ హీరో కూడా కనీసం సాహసం కూడా చేయలేని రేంజ్ లో బన్నీ చేశాడు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. సినిమా చూసి బయటికి వచ్చిన ఆడియన్స్ కు ఆ సీన్ కళ్ళల్లో నుంచి పోవడం లేదనే చెప్పాలి.
ఆ ఒక్క సీన్ సినిమాకు ఖచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు తీసుకురావడం ఖాయం అంటూ బన్నీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. అయితే ఆ సీన్ విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పుష్ప మేకర్స్ కు షాక్ ఇచ్చింది. అసలు సినిమా లో అత్యంత కీలకమైన సన్నివేశం అదే. అయితే గల్ఫ్ చట్టాలతో వాళ్ళకున్న పరిమితులతో వాళ్ళ చట్టాల ప్రకారం ఆ సీన్ ను కట్ చేసే సెన్సార్ బోర్డు కు అనుమతి ఇచ్చారు. దేవుళ్ళపై ఏవైనా సీన్స్ ఉంటే వాటిని కచ్చితంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కట్ చేస్తున్నారు.
ఇప్పటికే పలు ఇండియన్ సినిమాలను అక్కడ రిలీజ్ చేయడం లేదు. అమరన్ లాంటి సూపర్ హిట్ సినిమా కూడా అక్కడ రిలీజ్ కాలేదు. తమ చట్టాలకు లోబడి ఉండే సన్నివేశాలు ఉంటే మాత్రమే సినిమాలకు అనుమతి ఇస్తామని అక్కడి సెన్సార్ బోర్డ్ అధికారులు చెబుతూ వస్తున్నారు. అన్నట్టుగానే పుష్ప 2 సినిమాలో జాతర సీక్వెన్స్ ను కట్ చేసి సెన్సార్ బోర్డ్ అనుమతి ఇచ్చింది. దీనితో దుబాయ్ ప్రేక్షకులు జాతర సీక్వెన్స్ లేకుండానే సినిమా చూడనున్నారు. హిందూ మతాన్ని ప్రమోట్ చేసినట్టుగా ఆ సీన్ ఉండటమే కారణం.
అయితే సినిమా చూసిన వాళ్లు మాత్రం అసలు ఆ సీన్ లేకుండా పుష్ప 2 సినిమా చూడటం కూడా అనవసరం అంటూ కామెంట్ చేయడం గమనార్హం. సినిమా టికెట్ ఖర్చు మొత్తం ఆ ఒక్క సీక్వెన్స్ కోసమే సరిపోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సినిమా అంతా ఒక ఎత్తు అయితే జాతర సీక్వెన్స్ మరో ఎత్తు అంటూ మా క్లాస్ ఆడియన్స్ కూడా ఊగిపోతున్నారు. మరి ఆ సీన్ లేకుండా పుష్ప ది రూల్ ఎలా ఉంటుందో… ఇక ఓవరాల్ గా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ ను కామెంట్ చేసిన వాళ్ళు కూడా సినిమా చూసి సైలెంట్ అయిపోయారు. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే ఫ్రీ బుకింగ్ లు ఓ రేంజ్ లో జరిగాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొట్టడం ఖాయం అంటూ కాలనీ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్.