మొన్న లుక్స్.. నిన్న సెట్స్.. ఇప్పుడు సీన్ మొత్తం లీక్…!

రాజమౌళి ఎందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాను సీక్రెట్ గా మొదలు పెట్టాడో కాని, అసలు రహస్యమన్న పదానికే అర్ధం లేకుండాపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2025 | 07:20 PMLast Updated on: Mar 11, 2025 | 7:20 PM

మొన్న లుక్స్ నిన్న సెట్స

రాజమౌళి ఎందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాను సీక్రెట్ గా మొదలు పెట్టాడో కాని, అసలు రహస్యమన్న పదానికే అర్ధం లేకుండాపోయింది. మొన్నటికి మొన్న హీరో లుక్కు రివీలైంది. తర్వాత సినిమా సెట్లు, వాటి వీడియోలు లీకయ్యాయి. ఒడిషాలో అడుగుపెట్టినప్పటి నుంచి లీకులే షాకులిస్తున్నాయి. ఇక సండే రోజైతే ఏకంగా షూటింగ్ చేస్తున్న సీన్ మొత్తం సెల్ ఫోన్ పుణ్యమాని లీకైపోయింది. రాజమౌళి సైబర్ సెల్ ని అప్రోచ్ అయినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కట్ చేస్తే ఇదంతా రాజమౌలి అండ్ కో సినిమా మీద క్రేజ్ పెంచేందుకు చేస్తున్న చీప్ ట్రిక్స్ అని కొంతమంది ట్రోలింగ్ పెంచారు. అదే నిజమైతే, రాజమౌళి అసలు ఈ సినిమానెందుకు సీక్రెట్ గా లాంచ్ చేస్తాడు…? అసలు రాజమౌళి పేరే పెద్ద బ్రాండైనప్పుడు, పబ్లిసిటీ కోసం ఇదంతా చేయాల్సిన అవసరం తనకుందా? సో కామన్ సెన్స్ లెవల్లోనే ట్రోలింగ్ కి మీనింగ్ లేదని అర్ధమౌతోంది. ఇంతకి ఈ లీకులకు ఎలా బ్రేకులు పడతాయి? మహేశ్ బాబుకి ఇది ఎంతవరకు డ్యామేజ్ గా మారే అవకాశం ఉంది? హావేలుక్

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి ఏం సినిమా తీస్తున్నాడో కాని, డైరెక్ట్ సెట్లో షూటింగ్ జరిగిన సీనే లీకైంది. ఏతైనా సినిమా తీసి, థియేటర్స్ లో రిలీజ్ చేశాక, పైరసీ అవటం చూస్తాం. కాని రాజమౌళి తీస్తున్న సినిమా సెట్లో ఉన్నప్పుడే పైరసీ అయినట్టుంది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఒడిషాలో మొదలైనప్పటి నుంచి లీకులు షాకులిస్తూనే ఉన్నాయి.ఇక లీకైన వీడియోని బట్టి చూస్తే, హీరోని ఎవరో పట్టుకుని తీసుకువచ్చి, వీల్ చైర్ లో ఉన్న వ్యక్తి ముందు ఉంచుతాడు… హీరోని బలవంతంగా నీల్ డౌన్ చేయించినప్పుడు, వీల్ చైర్ లోవ్యక్తి హీరోకి ఏదో చెబుతుంటాడు.. ఇదంతా ఓ కార్ లో కూర్చుని సెల్ కెమెరాతో రికార్డు చేసినట్టు తెలుస్తోంది.

బేసిగ్గా రాజమౌళి సినిమా మొదలైతే, హీరోలు, టెక్నీషియన్స్ కెమెరాలు కూడా సెట్లో ఉండవు.. అంతగా తన సినిమా తాలూకు ఏ డిటేల్ లీక్ కాకుండా, ఎవరూ ఫోటోలు తీయకుండా జాగ్రత్త పడతాడు జక్కన్న. అలాంటిది సెట్లో, హీరో లుక్కో కాదు, ఏకంగా ఈసారి సీనే లీకైంది.వారం క్రితం అద్దంలో తనని తాను చూసుకుంటున్న మహేశ్ బాబు వీడియో లీకైంది. అది కూడా ఇందులో తను హీరోగా చేస్తున్న పాత్రతాలుకు లుక్ సంబంధించిందే… ఇక నిన్న ఒడిషాలో ఈ మూవీ కోసం వేసిన సెట్ పిక్స్ వచ్చాయి. వీడియోలు కూడా వచ్చాయి.

ఇప్పుడు ఏకంగా ఈ సినిమా లో హీరో లుక్కు, తనతోపాటు విలన్ వీల్ చైర్ లుక్కు, అలానే ఓసీనే బయటికొచ్చింది. ఐతే రాజమౌళి టీం కావాలనే ఇలా ఓ సీన్ ని లీక్ చేయించి, దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేయాలనుకుందని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. కాని రాజమౌళి సినిమా సెట్స్ పైకెళ్లిందంటేనే ఆ ఆప్ డేట్ సెన్సేషన్ గా మారుతుంది. కాబట్టి పబ్లిసిటీ కోసం, ఏకంగా తన సినిమా లో సీనే లీక్ చేయాల్సినంత దుస్థితి రాజమౌలికి లేదు.

కాని రామోజీ ఫిల్మ్ సిటీలోనో, లేదంటే అల్యూమినియం ఫ్యాక్టరీలోనో ఎన్నడూ తన సినిమా తాలూకూ ఏ అంశం లీక్ కాలేదు. అనవసరంగా ఔడ్ డోర్ షూటింగ్ పెట్టుకున్నాడు. ఒడిషాలో హీరో దర్శకుడు అడుగుపెట్టినప్పటి నుంచి సెట్ వేసే వరకు లీకులై జరుగుతూనే వచ్చి, ఫైనల్ గా ఓ సీన్ కి సీనే లీకైంది. ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏకంగా 100 జామర్లను రంగంలోకి దింపుతున్నారట. కెమెరాకి 200 మీటర్ల వరకు మనుషులెవరు లేకుండా చేసి, అక్కడ జామర్లు పెడతారట. దాంతో సినిమా కెమరాకేమికాదు కాని, ఎవరు ఇంకే కెమెరా వాడినా అందులో రికార్డు కావట… మరి లాంగ్ డిస్టెన్స్ నుంచి వీడియో తీస్తే ఏం చేస్తారు… ఇది ఈ న్యూస్ బయటికొచ్చిన వెంటనే సోసల్ మీడియాలో ఎదురౌతున్న డౌటు..