శోభిత కోసమే సామ్‌ని వదిలేశాడా.. విడాకులకు కారణం ఆమేనా ?
( ) ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పుకార్లే నిజమయ్యాయి. చైతు, శోభిత డేటింగ్‌లో వున్నారంటూ వచ్చిన వార్తలు గాసిప్స్ కావు. హైదరాబాద్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్‌లో ఇరుపెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా అందరికీ షేర్ చేశాడు. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా వుందని.. మా కుటుంబంలోకి శోభితాను సంతోషంగా ఆహ్వానిస్తున్నామని నాగార్జున ఎక్స్‌లో రాసుకొచ్చారు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు నాగ్. సమంతతో పెళ్లి, విడాకుల తర్వాత మరోసారి ఏడడుగులు వేస్తున్నాడు చైతన్య. ఏం మాయ చేసావె షూటింగ్ టైంలో సమంతతో ప్రేమలో పడ్డాడు చైతు. ఐదేళ్లపాటు ప్రేమించుకుని.. పెద్దల సమక్షంలో ఒకటయ్యారు. నాలుగేళ్ల తర్వాత అభిప్రాయబేధాలతో విడిపోయారు. డివోర్స్ తీసుకున్న మూడేళ్లకు చైతు మళ్లీ పెళ్లి కొడుకు అవుతున్నాడు.
సమంతతో డివోర్స్ తర్వాత చైతు మరోసారి ప్రేమలో పడ్డాడు. తెలుగమ్మాయి.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల డేటింగ్‌లో వున్నాడంటూ బాలీవుడ్ మీడియా కథనాలు అల్లినా.. ఇద్దరూ స్పందించలేదు. ఇండియాలో కలిసి తిరిగితే దొరికిపోతామన్న భయంతో.. ఫారిన్ చెక్కేసినా.. పిక్స్ బయటకొచ్చేశాయి. ఒకే లొకేషన్‌లో విడివిడిగా ఫోటోలు దిగి షేర్ చేసేవారు. ఫోటోలోని బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి వీరిద్దరు ఒకే చోట వున్నారని నెటిజన్లు పసిగట్టేసేవారు. లాల్‌సింగ్ చద్దా రిలీజ్ టైమ్‌లో నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ప్రస్తావన రాగా.. చెప్పలేక స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు. రాపిడ్ ఫైర్‌లో శోభిత ధూళిపాళ్ల పేరు వినగానే… మీకు గుర్తుకువచ్చేది ఏమంటని అడగ్గా.. చైతు నవ్వేశారు. జస్ట్ నవ్వుతాను అని బదిలిచ్చాడు. ఎఫైర్ వుందని.. చెప్పలేక… ఇలా చేశాడంటూ.. నెటిజన్లు అప్పట్లో కామెంట్స్ చేశారు. చైతు కొత్త ఇంటికి కూడా శోభిత వచ్చిందని… అసలు కొత్త ప్రియురాలి కోసమే కొత్త ఇల్లు కొన్నాడంటూ గుసగుసలు వినిపించాయి. గూఢచారితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి… ఆ తర్వాత మేజర్‌లో నటించింది. ప్రస్తుతం హిందీ సినిమా సితార చేస్తోంది.
చైతు తండేల్ మూవీతో బిజీగా వున్నాడు. ఎంగేజ్‌మెంట్ తర్వాత అక్కినేని వారి కాబోయే కోడలు శోభిత ధూళిపాళ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అసలు తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. శోభిత తెలుగమ్మాయే అయినా.. పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. 32ఏళ్ల శోభిత తెనాలిలో పుట్టినా తండ్రి నేవీ ఇంజనీర్ కావడంతో బాల్యం వైజాగ్‌లో సాగింది. ముంబాయ్‌లో లా కోర్స్ చేస్తూ.. నేవీ నిర్వహించే అందాల పోటీల్లో పాల్గొని నేవీ క్వీన్ కిరీటం దక్కించుకుంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సాధించి గ్లామర్ వరల్డ్ ఫోకస్ తనపై పడేలా చేసింది. మోడలింగ్ నుండి మెల్లగా యాక్టింగ్‌కు షిఫ్ట్ అయిన శోభిత… అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన హిందీ మూవీ రామన్ రాఘవ్ 2.0తో యాక్టింగ్ స్టార్ట్ చేసింది. డెబ్యూ మూవీతోనే ఇంప్రెస్ చేసిన శోభితపై… బాలీవుడ్, టాలీవుడ్ దృష్టి పడి.. ఆఫర్స్ రావడం మొదలైంది. అడవిశేష్ గూఢచారితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇదే హీరోతో కలిసి నటించిన మేజర్‌తో మరో హిట్ అందుకుంది శోభిత. సౌత్‌తో కన్నడ తప్ప తెలుగు, తమిళం, మలయాళంను కవర్ చేసిన శోభిత పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌తో తమిళంలో గ్రాండ్ ఎంట్రీ దక్కింది. గత ఏడాది మంకీ మ్యాన్‌తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్.. శోభితను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. అలా తెలుగు, హిందీలో బిజీ అయిన తనకు తమిళ, మలయాళం నుండి ఛాన్సులు అందుకుంది. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్‌తో శోభిత కోలీవుడ్‌లోకి గ్రాండ్ డెబ్యూ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో సితార మూవీ చేస్తోంది.
ఇదంతా ఇలా ఉంటే…. నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం శోభిత ధూళిపాళ్లేనా అనే చర్చ మొదలైంది. నిజానికి విడాకులకు అంటే 2021కి ఏడాదికి ముందే చైతు, శోభిత మధ్య అఫైర్ మొదలైంది. అది బయటపడడంతో… నాగచైతన్యను సమంత నిలదీసింది. మొదట్లో శోభితతో అఫైర్‌ను.. కేవలం స్నేహమేనని కథలు చెప్పిన చైతన్య… ఆ తర్వాత సమంతకు అడ్డంగా రెండు మూడు సార్లు దొరికిపోవడంతో ఒప్పుకోక తప్పులేదు. అయితే సమంత శోభిత ధూళిపాళ్ల… ఒకటి రెండు సార్లు ఎదురు పడినప్పటికీ ఈ విషయంలో ఎక్కడ రగడ జరగలేదు. నాగచైతన్యకు అఫైర్లు కొత్తేమీ కాదు. సమంతతో పెళ్లికి ముందు… కొన్నాళ్లు శృతిహాసన్‌తో డేటింగ్ చేశాడని పుకార్లు నడిచాయి. అలాగే మరో ఇద్దరితో నాగచైతన్య పేరుని ముడేసి చాలా కథనాలు పుట్టుకొచ్చాయి. ఏం మాయ చేసావే మూవీలో సమంతతో పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఐదేళ్ల ప్రేమ, ఆ తర్వాత పెళ్లితో.. కథ సుఖాంతం కాలేదు. కానీ సమంత, చైతన్య మధ్య శోభిత ఎంటర్ అయింది. అక్కడి నుంచి వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగింది. చివరికి విడాకులు తీసుకోక తప్పులేదు. కానీ నాగార్జున కుటుంబం రకరకాల లీకులు ఇచ్చింది. నాగచైతన్యకు ఇష్టం లేని కొన్ని రూల్స్ సమంత చేసిందని… ఫ్యామిలీ మ్యాన్‌లో శ్రీలంక యువతిగా… LTT తీవ్రవాదిగా ఒక అభ్యంతరకరమైన సీన్‌లో వద్దన్నా నటించిందని కథనాలు సృష్టించారు. అలాగే పుష్పాలో ఊ అంటావా ఐటెం సాంగ్ చేసి ఫ్యామిలీలో అందరి ఆగ్రహానికి గురైందని ఇలాంటి రకరకాల కథలు వినిపించే. కానీ అవన్నీ అవాస్తవం అని తేలిపోయింది. శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య నడిపిన అఫైర్ విడాకులకు కారణమని ఇప్పటికే తేలింది. సమంత సన్నిహితుడు, ఆమె డ్రెస్ డిజైనర్ ప్రీతం జువాల్కర్… శ్యామ్ విడాకులు తీసుకున్న రోజు శోభిత ధూళిపాళ్లను టార్గెట్ చేస్తూ… బిచ్ నువ్వు ఇప్పుడు ఇక హ్యాపీగా ఉండు… అని అభ్యంతరకరమైన ట్వీట్ చేశాడు. అయితే అప్పుడు శోభిత పేరు పెట్టకపోవడంతో ఆమె ఎవరో అన్నది తెలియలేదు. ఇప్పుడు అందరికీ తెలిసిందీ.. ఆరోజు జువాకర్ ఎవరిని ఉద్దేశించి ట్విట్ చేశాడో. ఇంతకీ ఈ పెళ్లిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.