రిలీజ్ కి ముందే 1 మిలియన్ … ఫస్ట్ ఇండియన్ మూవీ…

దేవర ఎగ్జాక్ట్ గా 20రోజుల ముందు అసలు ప్రమోషనే లేదు.. కొరటాల శివ ఏం చేస్తున్నాడన్నారు. కట్ చేస్తే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పూనకాలు షురూ అయ్యాయి. ట్రైలర్ వచ్చింది. యూ ట్యూబ్ ని ఊచకోత కోస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 10, 2024 | 09:05 PMLast Updated on: Sep 10, 2024 | 9:05 PM

1 Million Before Release First Indian Movie

దేవర ఎగ్జాక్ట్ గా 20రోజుల ముందు అసలు ప్రమోషనే లేదు.. కొరటాల శివ ఏం చేస్తున్నాడన్నారు. కట్ చేస్తే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పూనకాలు షురూ అయ్యాయి. ట్రైలర్ వచ్చింది. యూ ట్యూబ్ ని ఊచకోత కోస్తోంది.
విచిత్రం ఏంటంటే అసలు ఈ ట్రైలర్ రిలీజ్ అవటానికి 10 గంటల ముందు ఓ అరుదైన రికార్డు దేవర టీంకి దక్కింది. పాన్ ఇండియా మూవీలే కాదు, ఏ భారతీయ సినిమాకు దక్కని రికార్డు దేరవకు దక్కింది. అంతటికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజే కారణం. ఇక్కడ ట్రైలర్ వదిలితే, సౌండ్ యూఎస్ లో వస్తోంది. రిలీజ్ కిముందే వన్ మిలియన్ వసూళ్లు రాబట్టిన ఏకైక ఇండియన్ ఫిల్మ్ గా అరుదైన రికార్డు దేవరకి దక్కింది.

దేవర ట్రైలర్ రాకముందే ఊహించని రికార్డు క్రియేట్ అయ్యింది. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఏ హీరోకి సాధ్యం కాని హిస్టరీ ఎన్టీఆర్ కే దక్కింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ తో కొరటాల శివ తీసిన దేవర మూవీ విడుదలకుముందే యూఎస్ లో 30 వేల టిక్కెట్లు అడ్వాన్స్ బుక్కింగ్ రూపంలో బుక్ అయ్యాయి. అలా వన్ మిలియన్ డాలర్స్ ఈ సినిమా రిలీజ్ కిముందే వచ్చేసినట్టైంది.

బేసిగ్గా ఫస్ట్ డే ఓపెనింగ్స్ తోనో, లేదంటే ప్రివ్యూలతోనో ఇలాంటి రికార్డులు రావటం కామన్. కాని రిలీజ్ కి రెండు వారాల టైం ఉన్నా, ఈలోపే అడ్వాన్స్ బుక్కింగ్స్ రూపంలో 30 వేల టిక్కెట్లు బుక్ అవటమే రికార్డంటే, వాటితో వన్ మిలియన్ డాలర్ల వసూళ్లు రావటం మరో రికార్డు. ఇదంతా ట్రైలర్ రాకముందే జరిగింది. ఇక ట్రైలర్ ఊచకోత చూశాక ఈ అడ్వాన్స్ బుక్కింగ్స్ రూపంలో ఇంకెన్ని టిక్కెట్లు తెగుతాయో అన్న హైప్ పెరిగింది

రిలీజ్ కిముందే కనీసం ఐదు మిలియన్ల వసూళ్లు వచ్చేలా ఉన్నాయి. అదే జరిగితే, ఓపెనింగ్స్ కనీసం 3 మిలియన్లు వచ్చినా, విడుదైలన మొదటి వారంలోనే 10 మిలియన్లు డాలర్లు రాబట్టే రికార్డికి వందకు వందశాతం చాన్స్ఉంది. ఏదేమైనా ప్రభాస్ నుంచి యష్ వరకు చరణ్ నుంచి బన్నీ వరకు ఎవరి సినిమాకు ఇలా జరగలేదు. ఖాన్లు, కపూర్లే కాదు, కోలీవుడ్ స్టార్లకు కూడా ఇలాంటి రికార్డు సొంతం కాలేదు

సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుక్కింగ్స్ రూపంలో వన్ మిలియన్ వసూళ్లు రావటం అనేది మరే ఇండియన్ మూవీకి దక్కని రికార్డు. ఇవన్నీ చూస్తుంటే, దేవరకి పెరిగిన హైప్ ని నిజంగానే రిజల్ట్ కూడా పాజిటివ్ టాక్ తో టచ్ చేసే బాక్సాఫీస్ లో సినీ సునామీనే.