పుష్ప అమ్మ మొగుడు.. నెలలో 10 కోట్ల వ్యూస్.. నార్త్ లో రామ్ క్రేజ్ వేరే లెవెల్
టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ టాలెంట్ కు మంచి వెయిట్ ఉన్నా సరే.. ఆయన సినిమాలు మాత్రం లైట్ గా ఉంటున్నాయి. సినిమాపై హోప్స్ పెట్టుకున్న ఫ్యాన్స్ ప్రతీసారి రక్త కన్నీరు కారుస్తూ బయటకు వచ్చేస్తున్నారు.
టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ టాలెంట్ కు మంచి వెయిట్ ఉన్నా సరే.. ఆయన సినిమాలు మాత్రం లైట్ గా ఉంటున్నాయి. సినిమాపై హోప్స్ పెట్టుకున్న ఫ్యాన్స్ ప్రతీసారి రక్త కన్నీరు కారుస్తూ బయటకు వచ్చేస్తున్నారు. ఉన్న క్రేజ్ ను ఆయన వాడుకోవటం లేదనే కామెంట్స్ ఫ్యాన్స్ నుంచే వినపడుతున్నాయి. అందుకే ఆయనకు సరైన హిట్టు పడటం లేదని ఆయన అభిమానులు బాధపడుతూనే ఉన్నారు. పూరి జగన్నాథ స్థాయికి తగ్గ సినిమాలు చేయడం లేదని విమర్శలు ఎప్పటి నుంచొ వస్తున్నాయి.
ఇక చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్నా… పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న సరే ఆయనకు ఆశించిన స్థాయిలో హిట్ రాకపోవడంతో ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు పూరి. ఒకప్పుడు టాలీవుడ్ లో ఇండస్ట్రీ సీట్లు కొట్టి సెన్సేషనల్ డైరెక్టర్ గా రికార్డులు బ్రేక్ చేసి, క్రియేట్ చేసిన పూరి..ఈ మధ్యకాలంలో పూరి నుంచి ఏ అప్డేట్ రాలేదు. అయితే అక్కినేని అఖిల్ కోసం మొన్నామధ్య ఒక కథ రాశారని ప్రచారం జరిగింది. కానీ ఆ కథను నాగార్జున ఒప్పుకోలేదని వార్తలు కూడా వచ్చాయి. ఇక లేటెస్ట్ గా మరో న్యూస్ కూడా పూరి జగన్నాథ్ గురించి వైరల్ అవుతుంది.
తన జీవితంపై ఒక వెబ్ సిరీస్ ను పూరి ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. పూరి లాస్ట్ సినిమా డబల్ ఇస్మార్ట్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో చేసినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీగానే నష్టాలు తీసుకువచ్చింది. బాలీవుడ్ స్టార్లను ఈ సినిమాలో తీసుకున్న సరే అనుకున్న విధంగా రిజల్ట్ రాలేదు. అయితే ఈ సినిమా యూట్యూబ్ లో మాత్రం సెన్సేషన్ అయింది. యూట్యూబ్లో రిలీజ్ చేసిన నెల రోజుల్లోనే ఏకంగా 10 కోట్ల వ్యూస్ వచ్చాయి.
అది కూడా నార్త్ ఇండియాలో… రామ్ సినిమాలకు నార్త్ ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. అతని సినిమాలను 60, 70 కోట్ల మంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన డబల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఇలాగే సక్సెస్ అయింది. ఏకంగా నెల రోజుల్లోనే 10 కోట్లు మంది చూడటంతో మూవీ యూనిట్ పండగ చేసుకుంటుంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు రాజీ పడకుండా ప్లాన్ చేసిన సరే అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఆడుతుందని ఎదురు చూశారు.
కానీ బోల్తాపడటంతో పూరి జగన్నాథ్ సైలెంట్ అయిపోయాడు. ఇక పూరితో సినిమా చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం కూడా మైనస్ అవుతుంది. ప్రస్తుతం తన కొడుకు హీరోగా మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడని అయితే నిర్మాతలు దొరకకపోవడంతో పూరి వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పూరి రాసిన కథలకు పెద్దగా డిమాండ్ ఉండటం లేదు. అందుకే స్టార్ హీరోలు కూడా పూరి విషయంలో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వేరే డైరెక్టర్ల కథలను హిట్ చేసే పూరి సమర్థవంతమైన కథ రాసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. మరి పూరి తర్వాతి ప్రాజెక్ట్ ఏంటో క్లారిటీ రావాలి.