ఒక్క సీన్ కే 10 కోట్లా… మరి 80 సీన్లకు 800 కోట్లా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. ఇండో చైనా, భూటాన్ బార్డర్ ని బేస్ చేసుకుని నార్త్ ఈస్ట్ ఇష్యూస్ తో తెరకెక్కుతోంది .

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 3, 2025 | 09:15 PMLast Updated on: Mar 03, 2025 | 9:15 PM

10 Crores For One Scene And 800 Crores For 80 Scenes

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. ఇండో చైనా, భూటాన్ బార్డర్ ని బేస్ చేసుకుని నార్త్ ఈస్ట్ ఇష్యూస్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఐతే ఇది 500 కోట్ల బడ్జెట్ తోతెరకెక్కుతున్న ప్రాజెక్ట్ అని ఇంతవరకు ప్రచారం జరిగింది. కాని అది నిజం కాదని తెలుస్తోంది. కేవలం ఓ చిన్న దర్నా సీన్ కే 3 వేల మందిని పెట్టి 10 కోట్ల ఖర్చుతో షూటింగ్ చేశాడట ప్రశాంత్ నీల్. అది కూడా ఎన్టీఆర్ లేని సీన్… అంటే హీరో లేని సీన్ నే ఇంత భారీ ఖర్చుతో తీస్తే, ఇక ఇందులో యాక్షన్ ఎపిసోడ్లు, మిగతా సీన్లకు ఇంకెంత ఖర్చు చేయిస్తాడు… అంతా అనుకున్నట్టు ఇంది కేవలం పాన్ ఇండియా ప్రాజెక్టో, పాన్ ఆసియా సినిమానో కాదని తెలుస్తోంది. ఎన్నడా అఫీషియల్ గా సినిమా సంగతి తేల్చకుండా, పాన్ వరల్డ్ మార్కెట్ మీద గట్టిగా ఫోకస్ చేస్తున్నట్టున్నారు. సింగిల్ సీన్ కి 10 కోట్లంటే, సినిమా అన్నాక కనీసం 60 నుంచి 80 సీన్లుంటాయి… అలా లెక్కేస్తే 800 కోట్లుమేకింగ్ కే అవుతుంది. ఇక ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 350 కోట్లు… అంటే ఇది నిజంగా 1000 కోట్ల బడ్జెట్ మూవీనా? రాజమౌళితో మహేశ్ చేస్తున్న సినిమానే మించేలా భారీ సాహసం ఏదో జరుగుతోందా? హావేలుక్

త్రిబుల్ ఆర్ 1350 కోట్లు రాబట్టిన మూవీ.. తర్వాత వచ్చిన దేవర 670 కోట్ల పండగ తెచ్చిన సినిమా. ఈ రెండీంటి తర్వాత ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ మీద దండెత్తే పనిలో ఉన్నాడు. అది ఏమాత్రం వర్కవుట్ అయినా 2 వేల కోట్ల వసూల్లు రాబట్టే స్టామినా ఉన్న సినిమా అది… ఆతర్వాత ఎన్టీఆర్ చేసేది మాత్రం డ్రాగన్.. ఆల్రెడీ తను లేకుండానే సీన్లు తీస్తున్నాడు ప్రశాంత్ నీల్..

ఇందులో కొత్త విషయం ఏమీ లేదు కాని, బడ్జెట్ మాత్రం అందరినీ షేక్ చేసేలా ఉంది. ఇంతవరకు ఈసినిమా బడ్జెట్ 500 కోట్ నుంచి 550 కోట్లుండొచ్చన్నారు. హీరో రెమ్యునరేషన్ 300 కోట్లు, డైరెక్టర్ పారితోషికం 50 కోట్లకు మేకింగ్ ఖర్చులు 150 కోట్లు కలిపితే మొత్తం 500 కోట్లనుకున్నారు. కాని రియాలిటీ చెక్ చేస్తే 1000 కోట్లు దాటేలా ఉంది ఈ సినిమా బడ్జెట్.ఇది రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు చేస్తున్న సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ. ఇదంటే పాన్ వరల్డ్ మూవీకాబట్టి అంత ఖర్చు చేస్తున్నారనుకోవచ్చు.. మరెందుకు ఎన్టీఆర్ పాన్ ఆసియా సినిమాకు అన్ని కోట్లు పెడుతున్నట్టు… ఈ డౌట్ కి ఆన్సర్ డ్రాగన్ పాన్ ఆసియా మూవీ కాకపోవటమే… నిజంగానే ఇది పాన్ ఇండియానో, పాన్ ఆసియా మూవీనో కాదట. పాన్ వరల్డ్ ప్రాజెక్టుగానే డ్రాగన్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది

ఇండియా, భూటాన్, చైనా మధ్య కామన్ కనెక్షన్ చికెన్ నెక్… ఆ ఏరియాలో కాన్సెప్ట్ ఇండో చైనా బోర్డర్ ఇష్యూస్ తోపాటు డ్రగ్స్ బ్యాగ్రౌండ్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. కొరియా, ఇండోనేషియా నటుల్లే ఎక్కువగా తీసుకున్నారట. నార్త్ ఈస్ట్ రాష్ట్రా గొడవల నేపథ్యం తో వస్తున్న తొలి ఇండియన్ మూవీగా కూడా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేయబోతోంది.అయితే కేవలం 3 వేల మంది ఆర్టిస్ట్ లతో చేసిన దర్నా సీన్ కే పదికోట్లు ఖర్చయ్యాయట. అది కూడా హీరోలేని సీన్ అవటం మరో షాక్. హీరో సెట్లో లేకుండానే ఓ సిన్ కి 10 కోట్లు ఖర్చైతే, ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేసే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లకెంత ఖర్చుచేస్తారు. సెట్లు, గ్రాఫిక్స్ వీటి ఖర్చెంతుంటుంది. సినిమాలో నార్మల్ గా 60 నుంచి 80 సీన్లుంటే, సీన్ కి 10 కోట్ల చొప్పున 80 సీన్లకు 800 కోట్లు ఖర్చయ్యేఛాన్స్ఉంది. స్టార్స్ రెమ్యునరేషన్, ప్రమోషన్, గ్రాఫిక్స్ వర్క్ ఖర్చు అదనం.. అలాచూస్తే రాజమౌళి మూవీనే ఈ సినిమా బడ్జెట్ మించేలా ఉంది. ఇంత ఖర్చుచేసి తీస్తే ఈ సినిమా 1000 కోట్లు రాబడితే పెద్దగా ప్రయోజనం ఉండదు. 1500 కోట్ల పైనే రాబట్టాలి.. అలా జరగాలంటే పాన్ వరల్డ్ లెవల్లో ఈమూవీరావాలి.. అంత కంటెంట్ ఉంది కాబట్టే, ఇంత రిస్క్ చేస్తోందట ఫిల్మ్ టీం.