theaters closed : 10 రోజులు థియేటర్లు బంద్.. ఎందుకంటే.. ?

సినిమా ప్రేక్షకుడికి మంచి ఎంటర్ టైన్ మెంట్. కష్టం వచ్చిన సంతోషం వచ్చిన సినిమాలు చూస్తూ చిల్ అవుతుంటారు. మొన్నటి వరకు ఎలెక్షన్స్, ఐపీఎల్ (IPL) హడావుడితో థియేటర్లకు వెళ్లేందుకు ఆలోచించిన మూవీ లవర్స్ ఉహించని షాక్ తగిలింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 15, 2024 | 11:50 AMLast Updated on: May 15, 2024 | 11:50 AM

10 Days Theaters Bandh Because

సినిమా ప్రేక్షకుడికి మంచి ఎంటర్ టైన్ మెంట్. కష్టం వచ్చిన సంతోషం వచ్చిన సినిమాలు చూస్తూ చిల్ అవుతుంటారు. మొన్నటి వరకు ఎలెక్షన్స్, ఐపీఎల్ (IPL) హడావుడితో థియేటర్లకు వెళ్లేందుకు ఆలోచించిన మూవీ లవర్స్ ఉహించని షాక్ తగిలింది. తెలంగాణలో థియేట‌ర్‌లు మూతపడనున్నాయి.

శుక్రవారం నుండి తెలంగాణాలో ఒక పది రోజులు పాటు థియేటర్స్ మూతపడనున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో బడా హీరోల నుంచి ఒక మోస్తరు హీరోల దాకా ఎలాంటి సినిమాలు లేవు. దీంతో థియేటర్లు నడపటం భారం కావడంతో తెలంగాణ థియేటర్స్ (Telangana Theatres) యాజమాన్యం ఈ నిర్ణయo తీసుకుంది. సింగల్ స్క్రీన్ థియేటర్స్ వరకు బంద్ కానున్నాయి. ఈ వార్త సినీ ప్రేమికులకి అయితే బ్యాడ్ న్యూసే. వారంతా కొన్ని రోజులు సినీ పండుగకి దూరం కాక తప్పదు తిరిగి ఎప్పుడు ప్రారంభించేది మళ్ళీ అధికారకంగా ప్రకటిస్తారు. ఏం చేస్తాం కష్టాలు మనుషులకే కాదు సినిమాలకి వస్తాయి

నగరాలతో పోలిస్తే పట్టణాలు అలాగే మండలాలలో ఇది మరింత దారుణంగా ఉందని… తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఒక సారి ఇలాగే జరిగింది. కరెంట్ బిల్, స్టాఫ్ సాలరీస్ పెను భారం కావడంతో క్లోజ్ చేసారు. ఇక మల్టి ప్లెక్స్ థియేటర్స్ మాత్రం యధావిధిగా ఉంటాయి. సింగల్ స్క్రీన్ (Single screen) థియేటర్స్ మూసివేత విషయం మాత్రం ఇప్పుడు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది.