10 ప్యాక్స్… 3000 కోట్ల కట్టింగ్.. షార్ట్ హేయిర్ తో…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి రెండు నెల్ల టైం దొరికింది. ఈ టూమంథ్స్ లో తను చాలా పెద్ద బాధ్యతలు తీసుకున్నాడు. ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ కి కండీషన్స్ పెట్టడంతో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏకంగా టెన్ ప్యాక్స్ పెంచే పనిలో ఉన్నాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి రెండు నెల్ల టైం దొరికింది. ఈ టూమంథ్స్ లో తను చాలా పెద్ద బాధ్యతలు తీసుకున్నాడు. ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ కి కండీషన్స్ పెట్టడంతో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏకంగా టెన్ ప్యాక్స్ పెంచే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ 15 కిలోల వేయిట్ తగ్గిన ఎన్టీఆర్ కొత్తగా ఏం చేయబోతున్నాడు..? మొన్నటికి మొన్న తన హేయిర్ స్టైల్ మీద ట్రోలింగ్ జరిగింది. అది జరిగిన రెండు రోజులకే కొత్త హేయిర్ స్టైల్ తో ఎన్టీఆర్ లుక్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు అంతకుమించే మ్యాన్ ఆఫ్ మాసెస్ టూ మంథ్స్ ట్రేనింగ్ తీసుకుంటున్నాడు. ఆల్రెడీ గతంలోనే సిక్స్ ప్యాక్స్ చూపించిన ఎన్టీఆర్ కి, డ్రాగన్ గా మారటానికి టెన్ ప్యాక్స్ అవసరమొచ్చిందా? ఇంతవరకెన్నడూ చూడని ఎన్టీఆర్ ని చూపించేలా ఎన్టీఆర్ షార్ట్ హేయిర్ తో కనిపించబోతున్నాడా..? తారక్ ని ఎవరూ గుండుతో చూపించలేదు. టెంపర్ లో పోలీస్ లా కనిపించినా, పోలిస్ కటింగ్ లో తారక్ కనిపించలేదు. ఇప్పుడు ఇవన్నీ జరగబోతున్నాయా? ఇంతకి డ్రాగన్ పాత్రకి, తన లుక్ తాలూకు రిక్వైర్ మెంట్స్ ఏంటి? హావేలుక్.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెండు నెలల్లో 10 ప్యాక్స్ తో షాక్ ఇవ్వబోతున్నాడు. వార్ 2 సాంగ్ షూటింగ్ లో కొంత భాగం పూర్తైతే, ఎంటైర్ మూవీ షూటింగ్ కే గుమ్మడి కాయ కొట్టాలనుకున్నారు. కాని అరి కాలి గాయం వల్ల హ్రితిక్ రోషన్ రెండు నెలలు డాన్స్ చేసే పరిస్థితి లేదు. సో ఈనెల, వచ్చే నెల మొత్తంగా 50 రోజుల వరకు ఎన్టీఆర్ కి టైం దొరికింది.ఈ 50 రోజుల్లో టెన్స్ ప్యాక్స్ లుక్ లోకి మారటమే కాదు, తన హేయిర్ స్టైల్ నుంచి ప్రతీదీ ఈ 50 రోజుల్లోనే మారబోతోంది. వార్ 2 పెండింగ్ సాంగ్ షూటింగ్ మేకి వాయిదా పడింది. కేవలం 30 సెకన్ల నిడివి ఉన్న డాన్స్ మూమెంట్స్ మాత్రమే తీయాల్సి ఉందట. కొంత ప్యాచ్ వర్క్ మేలోనే పూర్తి చేస్తారట.
ఈ లోపు ఎన్టీఆర్ టెక్ ప్యాక్స్ లుక్ లో కి మారాలి. ఆల్రెడీ 15 కిలోల వేయిట్ తగ్గిన తారక్. బైసెప్స్, ట్రైసెప్స్ పెంచుతూనే టెన్ ప్యాక్స్ లోకి వచ్చేయాలి. మామూలుగా 6 ప్యాక్స్ కోసమే సిక్స్ మంత్స్ కష్టపడాలంటారు. అలాంటిది టెన్ ప్యాక్స్ ని 50 రోజుల్లో వర్కవుట్ చేయటం కష్టమే. కాని తను ఆల్రెడీ రెండు నెలల నుంచి అదే పనిలో ఉన్నాడు. ఆరెండు నెలలకి మరో 50 రోజుల టైం కలిసొచ్చింది.
ఇక ఇంతవరకెన్నడూ చూసడి ఎన్టీఆర్ ని డ్రాగన్ లో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. అరవింద సమేత వీరరాఘవలో సిక్స్ ప్యాక్స్ తో కనిపించిన తారక్, త్రిబుల్ ఆర్ లో కాస్త భారీగా నే మజిల్స్ పెంచాడు. ఇప్పుడు టెన్ ప్యాక్స్ లుక్ తోపాటు, పోలీస్ కటింగ్ తో కనిపిస్తాడట. గుండు లుక్ తో కూడా కనిపించబోతున్నాడట.
ఈ విషయంలో 300 హేయిర్ స్టైల్స్ ని తనముందుంచారని తెలుస్తోంది. వీటిలో ఏది ఫైనల్ కాలేదు. తనకి టెన్ ప్యాక్స్ వచ్చాక ఏ హేయిర్ స్టైల్ సెట్ అవుతుందో ఆ 300 స్టైల్స్ లో సెలక్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇక డ్రాగన్ లో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. మామూలుగా రా ఏజెంట్ అంటే నార్మల్ గా ఏదో ప్రైవేట్ జాబ్ చేసేవాడో, లేదంటే వ్యాపారి ముసుగులో ఉండటం చూశాం. కాని ఓ రా ఏజెంట్ ఐపీఎస్ ఆఫీసర్ పొజీషన్ లోఉంటే.. ఇక్కడ అదే ట్విస్ట్… ఒకవైపు ఐపీఎస్ మరో వైపు రా ఏజెంట్గా ఇండో చైనా బోర్డర్ లో డ్రాగన్ గా కనిపించబోతున్నాడు తారక్. ఇది మాత్రం కంప్లీట్ గా వేరే లెవల్ ప్లానింగ్…