100 కోట్ల కాశీ నగరం.. 100 ఎకరాల్లో అడవి.. 100 కెమెరాల సీన్..

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న సినిమాకు, పురాణాలతో లింకుందని తేలింది. దీనికి తోడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకోసం ఏకంగా కాశీ నగరాన్నే నిర్మిస్తున్నట్టు మొన్నామధ్య పిక్స్ లీకయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2025 | 08:00 PMLast Updated on: Mar 13, 2025 | 8:00 PM

100 Crore Kashi City 100 Acres Of Forest 100 Camera Scenes

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న సినిమాకు, పురాణాలతో లింకుందని తేలింది. దీనికి తోడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకోసం ఏకంగా కాశీ నగరాన్నే నిర్మిస్తున్నట్టు మొన్నామధ్య పిక్స్ లీకయ్యాయి. కాసేపు సౌత్ ఆఫ్రికా అడవుల్లో అద్బుతాల వేటన్నారు. ఇండియానా జోన్స్ లాంటి సాహసాలు చేసే హీరోగా మహేశ్ పాత్ర ఉంటుందన్నారు. కట్ చేస్తే లీకైన సెట్ వీడియోలు, షూటింగ్ స్పాట్ లో లీకైన సీన్ వీడియో తో కొత్త కన్ ఫ్యూజర్ పెరిగింది. కానీ ఏకంగా 22 ఎకరాల్లో కాశీ సెట్ రెడీ అవుతోందని తెలుస్తోంది. కెన్యా అడవుల్లో షూటింగ్ అన్న మాట అటే పోయింది. డ్యూయెల్ రోల్ లో మహేశ్ బాబు అన్న మాట మీద డౌట్ కొడుతోంది. ఇప్పుడు పూర్తిగా సినిమా అంతా కాశీ చుట్టే తిరిగేలా ఖనిపిస్తోంది. కల్కీలో ఆల్రెడీ కాశీని పీక్స్ లో చూపించారు. మరి రాజమౌళి తన పాన్ వరల్డ్ మూవీలలో కాశీని ఇంకెలా చూపించబోతున్నాడు..? జేమ్స్ కామెరున్ తో ప్రెస్ మీట్ ఎప్పుడు..? 50 వేల థియేటర్స్ లోరిలీజ్ అయ్యేలా డిస్నీ పిక్చర్స్ వాళ్లు సీన్ లోకొస్తే, కొత్తగాప్రాజెక్టులో జరిగే మార్పులేంటి? హావేలుక్.

రాజమౌళి సైలెంట్ గా ఏదో తీస్తున్నాడు. వైలెంట్ గా చుట్టు పక్క జనాలు సెల్ ఫోన్ పుణ్యమాని షూటింగ్ స్పాట్ లోనే సీన్లు లీక్ చేస్తున్నారు. దీంతో మరింత కట్టుదిట్టంగా జాగ్రత్తలు పెంచిన రాజమౌళి, ఇంకా ఏం చేస్తున్నాడో మాత్రం ఊహకందట్లేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో 100 కోట్ల ఖర్చుతో కాశీ నగరం తాలూకు సెట్ ఆల్ మోస్ట్ సగం రెడీ అయ్యింది.ముందు రెడీ చేసిన సెట్ ఫోటోలు ఆల్రెడీ లీకయ్యాయి. 20 నుంచి 22 ఎకరాల్లో ఈ సెట్ రెడీ అవుతోంది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ ఔట్ స్కట్స్ లో 100 ఎకరాల్లో ఏకంగా ఓ ఫేక్ అడవినే క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఇండోర్ షూటింగ్ కి ఓ వైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాని ఒడిషాలో ఔట్ డోర్ షూటింగ్ మాత్రం జరుగుతోంది.

కెన్యాలో ఎప్పుడు షూటింగ్ ఉంటుందో, ఆఫ్రికా అడవుల్లో సాహసాలు షూటింగ్ ఇంకెప్పుడు ప్లాన్ చేస్తారో కాని, ఒకేసారి మల్టిపుల్ వర్క్స్ జరుగుతున్నాయి. టైటానిక్ మూవీకోసం సముద్రాన్నే తలపించే ఓ చెరవునే తవ్వి, అందులో టైటానిక్ సెట్ వేసి ముంచి, తేలుస్తూ షూట్ చేసినట్టు, గంగానదినే హైద్రబాద్ లో క్రియేట్ చేయబోతున్నారు.గంగానది, ఘాట్లు అలానే కాశీ టెంపుల్స్ తోపాటు, సిటీని రామోజీ ఫిల్మ్ సిటీలో రీక్రియేట్ చేసి, అక్కడే 20 శాతం సీన్లు తీయబోతున్నారట. కేవలం కాశీ సెట్లో తీసే సీన్లకోసమే 100 కెమెరాలని జతచేసి ఏదో కొత్త ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. జమానాలో హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్ మూవీ కోససం 150 కెమెరాలను ఒకదాంతో ఒకటి లింక్ చేసి ఫైట్ సీన్ తీశారు.

అచ్చంగా అలానే శంకర్ కూడా బోయ్స్ మూవీలో ఓ పాటకోసం ఇలానే 110 కెమెరాలను లింక్ చేసి సాంగ్ షూట్ చేశాడు. ఇప్పుడు రాజమౌళి 100 కెమెరాలతో కాశీ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నాడు. మరి అన్ని కెమెరాలు మ్యాట్రిక్స్ లాంటి సీన్స్ కోసమా, మరేమైనా ఉద్దేశ్యం ఉందా తేలట్లేదు.ఏదేమైనా 100 కోట్ల ఖర్చుతో కాశీనగర సెట్టు, 100 ఎకరాల్లో అడవి సెట్, 100 కెమరాలతో కాశీ నగర సీన్లు ఇలా మూడు వందల నెంబర్ ఇండస్ట్రీలో వైరలౌతోంది… రాజమౌళి ఏంచేస్తున్నాడా అన్న క్యూరియాసిటీని ఇంకా పెంచేస్తోంది.